ఆడపిల్లవి నీవు
ఆత్మీయతకి రూపానివి
ఆనందాల హరివిల్లువి
మమతల పొదరిల్లువి
ఆడపిల్లవి నీవు
గృహమందు నిలిచిన తులసికోటవి
గడపపై తీర్చిన ముగ్గురేఖవి
అల్లుకున్న మల్లెతీగవి
ఆడపిల్లవు నీవు
శరత్చంద్రుని వెన్నెలవి
మలయమారుతపు తెమ్మెరవి
పరిమళపు గంధానివి
ఆడపిల్లవి నీవు
అపరంజి బొమ్మవి
ఆదుకొనే ఆలంబనవి
మామతాను రాగాల కల్పవల్లివి
ఆడపిల్లవి నీవు
వేదనని దాచుకుంటావు
వెలలేని మమతని పంచుతావు
ధీరవనితగా దిక్కుగా ఉంటావు
ఆడపిల్లవి నీవు
ఆడనే ఉంటూనే
ఈడ ఉన్నవారి ఇక్కట్లు తీరుస్తావు
కాలు పెడితే చాలు కొండంత అండవి
ఆడపిల్లవి నీవు
జగన్మాతవి నీవు
నీవులేని ఇల్లు వెలితి
నవ్వుల పువ్వుల విరియాలి విశ్వ మంతా