ఏమండీ జాగ్రత్తగా వెళ్ళండి అసలే ఎండలు బాగా మండిపోతున్నాయి
అంటు మా ఆవిడా శారద నాకు చేయి ఊపుతూ జాగ్రత్తలు చెపుతుంది. నెమ్మదిగా బస్సు
కదులుతుంది. కండెక్టర్ లోపలికి వెళ్ళండి అంటు చిరాకుగా అందరిని నెడుతున్నాడు
అసలే కాళ్ళు పీక్కుపోతున్నాయి కూర్చుందామంటే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు నాకు
ఎదురుగా కూర్చున్న కుర్రాడు చాలాసేపటి నుంచి నన్ను గమనించుతున్నాడు.తను
ఎవరు? చూడటానికి చాల చురుకుగా,తెలివిగా,అందంగా కనబడుతున్నాడు.తనకు
నేను తెలుసా? నన్ను ఎక్కడైనా చూసాడా? అని మనసులో అనుకునేలోపే అంకుల్
అని పిలిచాడు. ఏం బాబు! ఏమైంది?. చాలాసేపటి నుంచి అక్కడ నిలబడి
ఇబ్బందిపడుతున్నారు ఇక్కడ కూర్చోండి అంటు నిలబడ్డాడు. అప్పటికే అలసి పోయిన
నేను నీరసంగా కూర్చుండిపోయాను. థాంక్స్ బాబు అని చెప్తే అయ్యో అంకుల్ మీరు
పెద్దవారు ఆలా అనకండి ఇదుగో ఈ మంచినీళ్లు తాగండి అంటు వాటర్ బాటిల్ ఇస్తూ,
ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ అంటు అడిగాడు.
నా పేరు కృష్ణమూర్తి బ్యాంకులో చిన్న ఉద్యోగం చేస్తున్నాను మా ఆవిడా శారద
తనగురించి ఏమి పట్టించుకోదు ఎప్పుడు నా గురించి, మా పిల్లల గురించే ఆలోచిస్తుంది.
మాకు ఇద్దరు కొడుకులు పెళ్లిళ్లు కూడా చేశాను వారు ఉద్యోగాలు సంపాదించుకుని
బెంగళూరులో,హైదరాబాదులో స్థిరపడ్డారు అంటు నా గురించి చెప్పాను.
నా పేరు హేమంత్ అంకుల్ అంటూ తన గురించి పరిచయం చేసుకున్నాడు.
హేమంత్ కూడ విజయవాడకే వెళ్ళవలసి ఉందని తను అక్కడే ఉంటానని ఉద్యోగం కూడ
అక్కడే అని చెప్పాడు ఇంతలో నా పక్కన కూర్చున్న పెద్దాయన తన స్టేషన్ రావడంతో
దిగి వెళ్ళిపోయాడు.హేమంత్ నా పక్కకు వచ్చి కూర్చున్నాడు,పాపం నా కోసం చాల సేపు
నిలబడి ఉన్నాడు,హేమంత్ చూడటానికి మాత్రమే కాదు తన మనసు కూడ చాల
అందమైనది,విశాలమైనది అని అనుకున్నాను కాసేపు మా సంభాషణ అలాగే కొనసాగింది.
హేమంత్ ఫోన్ రింగ్ అయింది హలో! ఆ…అమ్మ! అని మాట్లాడుతున్నాడు ఎందుకో
హేమంత్..ని చూస్తుంటే చాల ముచ్చటేసింది, తనని చూస్తుంటే ఎందుకో వికాస్..ని
చూస్తున్నట్టు ఉంది తను చాల మంచి అబ్బాయి,తెలివైనవాడు,మంచిగుణం కలవాడు
హేమంత్ కి వికాస్ గురించి పరిచయం చేశాను.
వికాస్ గురించి తెలుసుకోవాలంటే గతంలోకి కాస్త లోతుగానే వెళ్ళాలి,
రంగాపురం అనే గ్రామంలో విశ్వనాథ్ కూలిపనులు,పొలంపనులు చేస్తుండేవాడు
కొద్దిరోజులకు తన పక్క గ్రామంలోని వనజతో వివాహం జరిగింది కానీ వారికి సంతానం
కలగలేదు. నాలుగేండ్లు పూర్తికావస్తున్నాయి అయిన పిల్లలు కాలేదు, అది వాళ్ళ
దురదృష్టమని ఆశల్ని వదులుకున్నారు. విశ్వనాథ్,వనజలు పేదవారని ఎప్పుడు దిగులు
చెందలేదు పేదవారైనా పిల్లలకోసం చాల ఖర్చులు చేసారు,చివరికి వాళ్ళు
ఎదురుచూస్తున్న, సంతోషించేరోజు రానే వచ్చింది వనజ గర్భం దాల్చింది. వనజకి ఏడు
నెలలు ఉన్నప్పుడు నేను విశ్వనాథ్ వాళ్ళింటికి వెళ్ళాను ఏరా కృష్ణ! ఎలా ఉన్నావ్?
అంటూ కౌగిలించుకున్నాడు. నిజానికి విశ్వనాథ్ నేను చిన్నప్పటి స్నేహితులం అలా
కాసేపు కబుర్లు చెప్పుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాను.
వనజ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. అది తెలిసిన నేను చాల సంతోషించాను,
ఇంకా వనజ,విశ్వనాథ్..లా ఆనందానికి అయితే అవధులే లేవు. పిల్లాడికి వికాస్ అని
పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు, వికాస్ మూడు సంవత్సరాల వయసున్నప్పుడు
వనజ మళ్ళీ గర్భందాల్చి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. పాపకి సంధ్య అని
నామకరణం చేసారు.ఇద్దరుపిల్లలని కంటికిరెప్పలా పెంచసాగారు వాళ్ళకి చదువుకునే
వయసు వచ్చింది ఇద్దరిని ప్రభుత్వ పాఠశాలకు పంపించేవారు. వికాస్ మరియు సంధ్య
చాల తెలివైన,చురుకైన పిల్లలు దేనినైనా చాల సులువుగా నేర్చుకునేవారు.కేవలం
చదువులోనే కాకుండా ఇతర ఆటల్లో,పాటల్లో కూడా ముందుండేవారు,వీరు ఏకతాటి
మెదడుగల పిల్లలు,సెలవులు వచ్చినప్పుడు తల్లిదండ్రులకి సాయం చేస్తూ వారి పనులలో
చేదోడువాదోడుగా ఉండేవారు.సెలవులు వస్తేచాలు ఇల్లంతా సందడి సందడిగా మారేది ఆ
అల్లరి చూసి విశ్వా చాల సంబరపడిపోయేవాడు అలా వికాస్ తన ఉన్నతవిద్యని పూర్తి
చేసాడు.
వికాస్ పై చదువులుకోసం హైదరాబాదుకి వెళ్లి మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు
తానని అంతదూరం పంపించడం విశ్వనాథ్,వనజలకి ఏమాత్రం నచ్చలేదు కానీ వికాస్
భవిష్యత్తు కోసం పంపించక తప్పలేదు వికాస్ బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి తన
తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని వాళ్ళకి మంచిపేరు తీసుకురావాలని,వాళ్ళ
కష్టానికి ఫలితాన్ని అందించాలని అదే గమ్యంగా మార్చుకున్నాడు .
వికాసతో కలిసి ఇంకో ఐదుగురు స్నేహితులు ఉండేవారు,వాళ్ళందరూ ఒకే
దగ్గర ఉండేవారు ఎటువెళ్లిన కలిసే వెళ్లేవారు.తన స్నేహితులు మద్యంకి, జల్సాలకి
అలవాటుపడి చెడుతిరుగుళ్లు తిరిగేవారు కానీ వికాస్ మాత్రం ప్రతి రెండుమూడు
నెలలకోసారి తన సొంతగ్రామానికి వెళ్లి కుటుంబంతో సంతోషంగా గడిపేవాడు తిరిగి మళ్ళి
చదువుకోసం వచ్చేవాడు అలా మెల్లమెల్లగా వికాస్ కూడా మద్యానికి అలవాటుపడ్డాడు.
ఒకరోజు వికాస్ కాలేజీలో ఒక దృశ్యాన్ని చూసాడు. తన స్నేహితులు డ్రగ్స్
తీసుకుని కాలేజీకి వచ్చారు అందరు వాళ్ళని వింతగా చూసారు తన స్నేహితుల చేష్టలన్ని
కొత్తగా ఉండటం వలన అందరు వాళ్ళని వింతగా చూస్తున్నారని వికాస్ గమనించాడు
వాళ్ళు బాగా మద్యం సేవించడం వలననే ఇలా ప్రవర్తిస్తున్నారని వికాస్ భ్రమపడ్డాడు,దాని
గురించి ఎవరికైనా తెలిస్తే ఈ కాలేజీలో చదువనివ్వరని, లెక్చరర్ చుస్తే చాల ప్రమాదం
అని ఒక ఆటోలో ఆ ఐదుగురిని ఎక్కించి డ్రైవర్ కి అడ్రస్ చెప్పి,డబ్బులిచ్చి పంపించాడు.
వికాస్ రెండుసంవత్సరాలు బాగా చదువుకుంటూ,సంతోషంగా గడుపుతాడు.ఇటు తన
స్నేహితులు డ్రగ్స్ మైకంలో మునిగిపోయారు.
ఒక రోజు వికాస్ మరియు తన స్నేహితులు కలసి పబ్ కి వెళ్తారు,
వికాస్ కి తెలియకుండా తను తీసుకునే సిగరెట్..లో వికాస్ స్నేహితులలో ఒకడు వినయ్
డ్రగ్స్ ని కలిపి వికాస్ కి ఇచ్చాడు.వికాస్ డ్రగ్స్ తీసుకోగానే తనకు చాల మత్తుగా
అనిపిస్తుంది అలా డ్రగ్స్..ని కలిపిన సిగరెట్లను రెండు తాగుతాడు వికాస్. తనకి చాల
అయోమయంగా అనిపిస్తుంది ఒకవస్తువే రెండువస్తువులుగా కనబడతాయి, దేనిని కూడా
స్పష్టంగా చూడలేకపోతాడు, కాసేపటికి స్పృహ కోల్పోతాడు వికాస్. తను కళ్ళు తెరిచి
చూసేసరికి ఒకరోజు గడిచిపోతుంది.ఏం జరిగిందో తెలియని గందరగోళంలో వాళ్ళ
స్నేహితుల దగ్గరికి వెళ్లి దినేష్ దగ్గరినుండి మల్లి డ్రగ్స్..ని కలిపిన సిగరెట్‌ని తాగుతాడు
కానీ తనకు మొదట వచ్చినంత మత్తు ఏం రాలేదు హుషారుగా,చాల ఉత్సాహంగా ఏదో
సాధించినట్లు అనిపిస్తుంది అలా మళ్ళీ డ్రగ్స్..ని తీసుకుంటాడు నిజానికి తనకి
డోపమైన్,సెరటోస్ అనే ఉత్రేరకాలు విడుదలయ్యాయి దానివలననే తను ఎంతో
సంతోషంగా ఉన్నాడు.అలా మూడురోజులు గడిచిపోయాయి.వికాస్..కి తను డ్రగ్స్
తీసుకుంటున్నాడని తెలుస్తుంది అయిన కూడా వికాస్ డ్రగ్స్ కావాలనే చెపుతాడు తను
డ్రగ్స్ తీసుకోకముందు డ్రగ్స్ అనే పదం కూడా నచ్చేది కాదు,దాన్ని చాల
అసహ్యించుకునేవాడు కానీ ఇప్పుడు డ్రగ్స్హే కావాలంటున్నాడు. రోజు కాలేజీకి
వెళ్ళేటప్పుడు డ్రగ్స్ పౌడర్ని కవర్స్..లో ప్యాక్ చేసి వాళ్ళ షూస్..లో పెట్టుకునేవారు బ్రేక్
టైంలో వాష్ రూంకీ వెళ్లి డ్రగ్స్ తీసుకునేవారు కొన్ని రోజులవరకు అలాగే గడిచింది.
వికాస్ తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు తన కుటుంబంతో సంతోషంగా
గడపలేకపోయేవాడు. చిరాకుతో,విసుగుతో,కోపంతో ఉండేవాడు.ఎప్పుడు చూసిన చాల
మత్తులో ఉండేవాడు,కొడుకు ప్రవర్తన కొత్తగా ఉండేసరికి విశ్వనాథ్,వనజలు చాల
భయపడుతారు. సంధ్య ఏం అయిందో తెలియని అయోమయంలో
ఉండిపోతుంది. వికాస్..ని భయంభయంగానే హైదరాబాదుకి సాగనంపుతారు వికాస్
కాలేజీలో వింతగా ప్రవర్తించడం గురించి లెక్చరర్స్ వరకు పాకుతుంది చురుకుగా ఉండే
అబ్బాయి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఎవరికీ అర్ధం కాదు. కొన్నిరోజుల తరువాత వికాస్
కాలేజ్..కి వెళ్లడం పూర్తిగా మానేస్తాడు అది గమనించిన లెక్చరర్స్ విశ్వనాథ్..కి కాల్ చేసి
వికాస్ కొన్ని రోజులుగా కాలేజికి రావడంలేదు కాల్ చేసిన ఆన్సర్ చేయడం లేదు అని
చెప్తాడు.
విశ్వనాథ్,వనజ అదేరోజు హైదరాబాద్..కి వెళ్తారు అక్కడ వికాస్..ని,
తనగదిని చూసి చాల ఆశ్చర్యపోతారు రూమ్ మొత్తం చెత్తచెత్తగా బీర్
బాటిల్స్,సిగరెట్స్,ఎవేవో పాకెట్స్ తోని రూమ్ నిండి ఉంది. ఆ చెత్తపక్కనే వికాస్ పడుకొని
ఉన్నాడు వికాస్..ని ఇంటికి తీసుకెళ్తారు.వికాస్..ని చూసి సంధ్య చాల భయపడుతుంది తన
కళ్ళు చాల ఎరుపుగా ఉంటాయి,తను చాల కోపంగా,విసుగుగా ఉంటాడు అందుకే సంధ్య
తనని చూసి పక్కకు తప్పుకుంటుంది. వికాస్ ఫ్రెషప్ అయ్యి తన రూమ్ కి వెళ్లి రెస్ట్
తీసుకుంటాడు. తినడానికి వనజ ఆహారం తీసుకెళ్తుంది ఆ ప్లేట్..ని కిందకి ఎత్తేస్తాడు,
వనజని తిట్టి రూంలోని లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని చీకటిగదిలో సిగరెట్ తాగుతూ డ్రగ్స్
తీసుకుంటూ ఉంటాడు.అది చూసిన వనజ సిగరెట్..ని బయటపడేయడానికి వెళ్తే వనజని
కొడుతాడు,సంధ్య దానికి అడ్డొస్తే సంధ్యని కూడా కొడతాడు.ఎప్పుడు కూడా చిన్న మాట
అనని వికాస్ ఒకేసారి కొట్టేసరికి వనజ చాల బాధపడుతుంది,సంధ్య చాల ఏడుస్తుంది.
విశ్వనాథ్ వికాస్..కి ఎప్పుడు అడ్డొచ్చేవాడు తను వ్యసనం తీసుకోకుండా
ఆపేవాడు కానీ విశ్వనాథాన్ని పక్కకు నెట్టేసేవాడు,వనజని చాల కొట్టేవాడు,ఒకసారి వనజని
కొడితే తన తలకి గాయం అవుతుంది.వికాస్ ఎప్పుడు డోర్ పెట్టుకొని చీకటిగదిలోనే ఉంటూ
ఏవో ఊహల్లో బ్రతికేవాడు, పక్కన ఎవరు లేకున్నాకాని ఒక్కడే మాట్లడుకునేవాడు, చేతిలో
ఫోన్ లేకున్నా కూడా ఫోన్ ఉన్నట్లుగా ఉహించుకునేవాడు చీకటి గదిలో ఒక్కడే కూర్చుని
పిచ్చిపట్టినవాడిలా నవ్వుకునేవాడు. అసలు తను పగలుకి,చీకటికి కూడా తేడా తెలియని
పరిస్థితిలో ఉండేవాడు.
విశ్వనాథ్ తనకి ఎప్పుడు అడ్డుపడుతున్నాడని ఎలాగైనా తన తండ్రిని
చంపాలనుకున్నాడు.ఒక కత్తితో విశ్వనాథ్‌ని పొడుస్తాడు అది చేతికి దిగుతుంది,మళ్ళీ
కత్తితో కడుపు దగ్గర పొడుస్తాడు విశ్వనాథ్ అరుపులతో వనజ,సంధ్య నిద్రలేచి వికాస్ ని
గదిలోపెట్టి తలుపేస్తారు విశ్వని ఆసుపత్రికి తీసుకెళ్తారు అదృష్టవశాత్తు వానికి ఎలాంటి
ప్రమాదం జరగలేదు కడుపులో చిన్న…గాటు పడింది కానీ చేతికి మాత్రం చాల పెద్ద
గాయం అవుతుంది.సంధ్య వికాస్ గురించి ఆలోచించి చాల భయపడుతుంది తన తల్లిని
కొట్టడం వలన తలకి గోడతాకి చాల పెద్దగాయం అయింది ఆమె పూర్తిగా కోలుకోకముందే
తన తండ్రికి ఈ ఆపద వచ్చింది వీటన్నిటికి కారణం తన అన్నయ్య మాత్రమే అని
దిగులు చెందుతుంది.
విశ్వనాథ్ వాళ్ళు ఇంటికి వెళుతారు రాత్రిమొత్తం ఆసుపత్రిలోనే ఉండేసరికి
వికాస్ రూమ్ చాల చెత్తగా మారుతుంది.ఆ రూంకి వెళ్లేసరికి మొత్తం డ్రగ్స్ వాసన వస్తుంది.
వికాస్ డ్రగ్స్ కి ఎంతగా అలవాటుపడ్డాడంటే తను డ్రగ్స్ తీసుకోకపోతే ఒక్కనిమిషం కూడ
నిలుచోలేకపోయాడు.కాళ్ళు,చేతులు చాల వణికాయి డ్రగ్స్ వల్ల తన సొంతవాళ్ళని
చంపడానికి కూడ వెనుకాడలేదు.వికాస్ నిజప్రపంచానికి,ఊహాప్రపంచానికి తేడా ఏదో కూడ
తెలుసుకోలేకపోయాడు.ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడ
తెలుసుకోలేకపోయేవాడు.వికాస్ నిద్రపోవడాన్ని,తిండిని మానేసాడు కేవలం డ్రగ్స్,సిగరెట్
మాత్రమే తీసుకునేవాడు తను సరిగా నిద్రపోకుండా బహుశా పదిరోజులు గడిచాయి.
ఆరోజు రాత్రి వనజ వికాస్ రూంకి వెళ్లేసరికి తన చొక్కమొత్తం రక్తంతో
తడిచి ఉంటుంది వనజ గట్టిగా కేక పెట్టేసరికి విశ్వనాథ్,సంధ్య అక్కడికి వస్తారు.వికాస్ ని
చూస్తారు తన మెడపైన పెద్దగాయం ఉంటుంది విశ్వనాథ్‌కి అప్పుడు
అర్ధమవుతుంది.వికాస్ గుమ్మమేదో, కిటికేదొ కూడ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడని,
కిటికీలోంచి బయటకు వెళ్లాలని చూసినప్పుడు అక్కడ పగిలి ఉన్న అద్దంముక్క తన
మెడపైన గుచ్చుకుంది. వికాస్ కి చికిత్స చేయిస్తారు తన మెడపైన కుట్లుపడిన కూడ తనకి
ఎలాంటి నొప్పి తెలియదు.ఇలా వదిలేస్తే ప్రమాదం అని విశ్వనాథ్,వనజలు కలిసి ఒక
గొలుసుతో వికాస్ ని కట్టేస్తారు వికాస్ మొహం పూర్తిగా కమిలిపోయింది.ఎవరో తన మొహం
మీద కొట్టినట్టుగా అయింది,ఒక రెండురోజులు వికాస్ ని గొలుసుతో కట్టేసి
ఉంచుతారు.వికాస్ చాల కేకలు పెడుతు గట్టిగా ఏడుస్తాడు తన చేతులు వణుకుతూ
ఉంటాయి వికాస్ ఇక బ్రతకడేమో అని బయపడింది సంధ్య.
ఉదయం అయ్యాక వికాస్ ని డీఆడిక్షన్ సెంటర్..కి తీసుకెళుతుంది అక్కడ
డాక్టర్ వికాస్ గురించి ఇలా చెప్తాడు.విశ్వనాథం గారు మీరు వికాస్ గురించి చెప్పేదాన్నిబట్టి
అర్ధమైంది ఏమిటంటే తను కొకైన్ పౌడర్,గేట్ పే డ్రగ్స్ కి బానిసయ్యాడు.దానివలన వాస్తవ
పరిస్థితులకి భిన్నంగా ఆలోచిస్తారు. రాత్రికి,పగలుకి తేడా తెలీదు, నొప్పి తెలీదు, ఉద్రేగం
పెరుగుతుంది, జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది, ఉపిరితిత్తులు పాడవుతాయి,
రక్తనాళాలు కుశించుకుపోతాయి, గుండెపనితీరు దెబ్బతింటుంది, జ్ఞాపకశక్తి
క్షిణిస్తుంది,ఏకాగ్రత ఉండదు,మెదడుదెబ్బతిని మూర్ఛ,పక్షవాతం వస్తాయి అని
అంటాడు.అదృష్టవశాత్తు మీ అబ్బాయికి ఏం ప్రమాదం లేదు కానీ తనకు నొప్పి
తెలియట్లేదు, ఉద్రేగం పెరుగుతుంది, వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు,
జీర్ణవ్యవస్థ దెబ్బతిన్నది, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించింది, ఊహల్లో
బ్రతుకుతున్నాడు,కంగారుపడకండి దానికి చికిత్స ఉంది ప్రాణానికి మాత్రం ఎలాంటి
ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పాడు. తనకి మానసిక కౌన్సిలింగ్ చాల అవసరం అని
అంటాడు. రేపటినుండి చికిత్సకి తీసుకురండి అని చెప్పి విశ్వనాథ్,వనజని ఇంటికి
పంపిస్తారు.
ఆ రోజు రాత్రి వికాస్ బయటకి వస్తాడు డాక్టర్ ఎలాంటి ప్రమాదం లేదని
చెప్పినందున విశ్వనాథ్ కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదు వికాస్ కి ఒక డెలివరీబాయ్ డ్రగ్స్
ని ఇచ్చి వెళ్తాడు వికాస్ డ్రగ్స్ ని తీసుకున్నపుడు పోలీసులు చూస్తారు వికాస్ ను అరెస్ట్
చేస్తారు అది తెలుసుకున్న విశ్వనాథ్ కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్తారు వికాస్ ని
వదిలిపెట్టమని బ్రతిమిలాడుతారు తన కొడుకు తప్పు ఏమి లేదని చెప్తారు వాళ్ళ
స్నేహితులే వికాస్ కి డ్రగ్స్ ని అలవాటు చేసారని, ఆ డెలివరీ బాయ్ ని కూడ వాళ్ళే
పంపారని చెప్తారు పోలీసులు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఏంక్యైరి చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్
పోలీసులకు లంచం ఇచ్చి వాళ్ళ తప్పు ఏం లేదని మొత్తం వికాస్ తప్పేనని చెప్తారు
లంచం పోలీసులు కూడ వికాస్ తప్పే అని చెప్తారు. అది మొత్తం అబద్దం అని
తెలుసుకున్న సంధ్య తనతోటి విద్యార్థులతోని ధర్నాచేయడం మొదలుపెడుతుంది వికాస్
స్నేహితులు తనని మోసం చేసారని వికాస్ చాల డిప్రెషన్లోకి వెళ్తాడు.తనని జైలులోనే
ఉంచుతారు వికాస్ డ్రగ్స్ లేకపోవడం వలన జైల్లో పిచ్చివాడిలా ప్రవర్తించుతాడు సంధ్య
ధర్నా చేయడం వలన ఆ విషయం మీడియ వరకు చేరుతుంది అది చూసి పోలీసులకి
భయంవేసి వికాస్ ఫ్రెండ్స్ ఐదుగురిని అరెస్ట్ చేస్తారు.
సంధ్య దాంతో ఆపేయకుండా డ్రగ్స్ మొత్తాన్ని బ్యాన్ చేయాలని
చెపుతుంది రోజురోజుకి సంధ్య పక్కన ఎక్కువ మంది చేరడం ప్రారంభమైంది వికాస్ ని తన
కోర్ట్ కి తీసుకెళ్తారు. వికాస్ స్నేహితులకి ఏడు సంవత్సరాల కఠినకారాగారశిక్షను, వికాస్ కి
తన స్నేహితులు డ్రగ్స్ ని అలవాటు చేసారు కాబట్టి తన తప్పులేకున్నా కూడ తను డ్రగ్స్
ని తీసుకున్నాడు కాబట్టి వికాస్ కి నాలుగు సంవత్సరాల జైలుశిక్షని,డీ అడిక్షన్ సెంటర్
నుండి చికిత్సని,కౌన్సిలింగ్ ని ఇప్పించారు.
సంధ్య వలన డ్రగ్స్ ఎక్కడ బ్యాన్ చేయవలసి వస్తుందేమోనని
డ్రగ్స్ ని సరఫరా చేసేవారిలో హైదరాబాద్ ముఠాని చూసుకునే డ్రగ్స్ లీడర్ కొందరు
రౌడీలను సంధ్యను చంపమని పంపుతాడు, సంధ్య వలన డ్రగ్స్ బిజినెస్ లో లాస్
అవుతానని చెప్తాడు. ఇద్దరు రౌడీలు సంధ్య ఒంటరిగా ఉన్న సమయంలో లారీతో గుద్ది
ఆక్సిడెంట్ చేస్తారు సంధ్య అందరికి తెలియడం వలన చుట్టుపక్కల వాళ్ళు ఆసుపత్రికి
తీసుకెళ్తారు డాక్టర్ ఇలాచెప్తాడు సమయానికి తీసుకొచ్చారు,లేదంటే ఈ అమ్మాయి ప్రాణానికి
ప్రమాదం ఉండేది ఇప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పాడు. ఈ విషయం
తెల్సుకున్న వికాస్ తనలో తాను చాల కుమిలిపోతాడు కేవలం తను డ్రగ్స్ తీసుకోవడం
వలన మాత్రమే తన తల్లి, తండ్రి ,చెల్లెలు చావు చివరంచులదాక వెళ్లి వచ్చారు.కేవలం
తన వలన మాత్రమే పెద్దవారైనా కూడ ఎవరి ముందు చేయిచాని తన తల్లిదండ్రులు
ఇప్పుడు అప్పుల బారిన పడ్డారు, అందరితో మాటలు పడుతున్నారు. పరువు,ప్రతిష్టలకు
ప్రాణం ఇచ్చే తన తండ్రిని నడిరోడ్డుపైనే నిల్చోబెట్టాను నేను జైలుకు వచ్చి అని
పాశ్చాతాపం పడుతాడు.ఈ సమస్యలన్నీ వికాస్ ని చాల బాధిస్తాయి.
చివరికి నాలుగు సంవత్సరాల తరువాత వికాస్బయటకు వస్తాడు
కానీ తను మెంటల్ గ చాల కృంగిపోతాడు, చాల డిప్రెషన్ లో ఉంటాడు అది గమనించిన
సంధ్య తన తల్లిదండ్రులకి సైకియాట్రీ వద్దకి తీసుకెళ్లామని సలహా ఇస్తుంది. సైకియాట్రీ
దగ్గర ఒక నెలరోజుల పాటు వికాస్ కి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు తను తొందర్లోనేకోలుకుంటాడు.
వికాస్ తన జీవితంలాగ ఇంకా ఎవరిజీవితం కాకూడదని, తనని మోసగించిన స్నేహితులకు
ఎలాగైనా బుద్ధిచెప్పాలని,డ్రగ్స్ మొత్తాన్ని బ్యాన్ చేయాలనీ గట్టి నిర్ణయం తీసుకుంటాడు.
కష్టపడి చదివి ఐ.పి.ఎస్ అవ్వాలనుకుంటాడు కానీ డ్రగ్స్ తీసుకోవడం వలన తనపైన
ఎఫ్.ఐ.ఆర్ ఉంటుంది అందువలన తను ఐ.పి.ఎస్ కాలేనని,తాను చేయలేని పని తన
చెల్లెలు సంధ్యతో చేయిస్తాడు.సంధ్య ప్రతి అడుగుజాడలో తోడుంటూ సంధ్య వెనుక
నిలబడుతాడు.
ఎక్కడ అన్యాయం జరిగిన, డ్రగ్స్ ఉన్న అక్కడ వికాస్,సంధ్యలు
ఉంటారు,వారితో పాటు న్యాయం కూడ ఉంటుంది. అలా వికాస్ చాల మందికి ఆదర్శంగా
నిలిచాడని వికాస్ గురించి హేమంత్ కి చెప్పను. వికాస్ ని,సంధ్యని చూడాలని ఆతృతగా
ఉంది అని హేమంత్ చెప్పాడు, నేను కూడ విజయవాడకి వికాస్ కోసమే వెళ్తున్నానని
హేమంత్ తో చెప్పను,అలా చెప్పగానే నన్ను కూడా తీసుకెళ్లండి అంకుల్ అంటూ
హేమంత్ అడిగాడు. తప్పకుండ తీసుకెళ్తానని చెప్పను ఇలా నేను, హేమంత్ ఐ.పి.ఎస్
సంధ్య,వికాస్ వాళ్ళింటికి వెళ్ళాం హేమంత్ వికాస్ తో మాట్లాడి,తిరికి ఇంటికి వెళ్ళేటప్పుడు
ఎక్కడ తప్పు జరిగిన అక్కడ వికాస్,సంధ్యలు ఉంటారనే ధైర్యంతో తిరిగి వెళ్ళాడు.
ఉద్యోగం ఒకరిదైనా గెలుపు మాత్రం ఇద్దరిది.