ఇంతకీ
నీవు ఏ బొమ్మవో ఏమో!
తెలియడం అంతు చిక్కని ప్రశ్నే
కానీ సరిగ్గా వెతికితే నీలోనే సమాధానం
నీలోపలే ఉండే మనసు చెప్పే
చిన్నపాటి ఆనందాలను నెరవేర్చుకునే
మనసు బొమ్మవా?
సమాజం అనే ఎత్తిపొడుపు మాటలు విని
నిన్ను నువ్వు
సమాజానికనుగుణంగా మార్చుకోని
సమాజంచే ఆడిస్తున్న మర బొమ్మవా?
జీవితంలో చిన్న కష్టం వస్తే
నీ గుప్పెడు గుండె మోయలేక
ఆత్మహత్యకు పాల్పడే పిరికి బొమ్మవా ?
మత్తు మాయలో పడి
నీకే తెలియకుండా
నిన్ను మత్తు ఆడిస్తున్న
ఉత్త బొమ్మవా ?
ఆనందంగా ఉన్న నీ జీవితంలోకి
ఏదైనా వ్యాధిసోకితే
ఏ క్షణం ఊపిరి విడుస్తావోనని
గ్యారంటీ లేని గాజు బొమ్మవా?
ఆ దైవం చేత చేయబడి
ఆ దేవుడాడిస్తున్న మట్టి బొమ్మవా ?
ఇంతకీ నీవు ఏ బొమ్మవి ?