ఉషోదయం

న్యూసెన్స్…

     మాధవపెద్ది ఉషా

అవి పరీక్షల రోజులు. సమయం రాత్రి ఎనిమిది గంటలవుతోంది. రాకేశ్ ఇంజనీరింగ్ సెకండియర్ పరీక్షలకు శ్రద్ధగా ప్రిపేరవుతున్నాడు. మోహన్, శైలజా భోజనాలు ముగించారు. వారు రాకేష్ తల్లిదండ్రులు డెబ్భైయేళ్ల మాయమ్మగారు ఏడున్నరకి భోజనం చేసి తన గదిలో పడుకున్నారు. ఆవిడ రాకేశ్ కు బామ్మ. ఇంతలో పక్క ప్లాట్ లోంచి మ్యూజిక్ వినిపించింది. రానురానూ వినవస్తోంది. పక్కింట్లో ఏదో పార్టీ జరుగుతున్నట్టుంది. బహుశా ఉండొచ్చు. మ్యూజిక్తో పాటు పిల్లల కేరింతలూ వినిపిస్తున్నాయి. దాంతో రాకేష్ కు తను చదివేది బుర్రకు ఎక్కడంలేదు. కాసేపు మనం ఇటూ ఇటూ కదిలాడు. తర్వాత చెవులు మూసుకుని చదివే ప్రయత్నం ఫలించలేదు. దాంతో విసుగొచ్చేసింది. చికాగ్గా తన గదిలోంచి ఉడికొచ్చాడు. హాల్లో కూర్చుని వీక్లీ తిరగేస్తున్న తల్లిని ఉద్దేశించి “ఏంటమ్మా * అయితే ఎలా? నా చదువు సాగడం లేదు., చాలా డిస్టెరెన్గా ఉంది. ఆ కొద్దిగా మెల్లిగా పెట్టుకోమని వాళ్లకు చెప్పమ్మా” అని బతిమాలాడు.

ఇంతలో అనసూయమ్మగారే కళ్లు నులుముకుంటూ వచ్చారు. చుటకా.. ఆ పాటలేంటీ, అంత పెద్దగా పెట్టడమేంటీ? ఇరుగు పొరుగుడు బండిగా ఉంటుందన్న ఆలోచన కూడా లేకుండా అదేంట్రా అలా పెట్టారు. ఎప్పయినా వెళ్లి కాస్త చెప్పరా. ఓ పక్క రాకేష్ కు పరీక్షలు దగ్గరపడుతున్నాయి. బా అయితే వాడి చదువు సాగినట్లే” దీర్ఘం తీశారు.

వెంటనే శైలజ అందుకుని “అవునండీ ఈ గోల ఇలాగే ఉంటే మనం | రాత్రిపూట నిద్రపోయినట్లే. పైగా రాకేష్ చదువు.. అందుకే పక్కింటి వాళ్లకు చెప్పిరండి. అప్పటికీ వినకపోతే న్యూసెన్స్ కేసుపెట్టి పోలీసులను పిలుస్తామని

బెదిరించండి.” అంది అత్తగారి మాటలకు వంతపాడుతూ. ఇలా లాభం- లేదనుకుని మోహన్ మెల్లిగా లేచి వెళ్లాడు పక్కింటికి డోర్ బెల్ రింగ్చేశాడు. అది లోపలున్నవాళ్లకు వినిపించలేదు. కాబోలు ఎవరూ తలుపు తీయలేదు. తిరిగి బెల్ రింగ్ చేశాడు. ఈసారి కొంచెం ఎక్కువసేపు నొక్కి ఉంచాడు. అప్పుడు తలుపు తెరుచుకుంది. హాలంతా పిల్లలో నిండి ఉంది. వాళ్లు మ్యూజిక్ కు తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వాళ్లు ఈ లోకంలో లేరు. ఓ పెద్దాయన ఇంటి యజమాని కామోసు దగ్గరకు వచ్చి ‘ఏంకావాలి?’ అని అడిగాడు. దానికి . .మోహన్ “ఏం లేదండీ మా వాడికి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మీ ఇంట్లోంచి వచ్చే మ్యూజిక్ సౌండ్ వల్ల వాడికి ఏకాగ్రత కుదురటం లేదట. మీరు వాల్యూమ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది.” అని రికెస్టు చేశాడు. దానికాయన ఎంతో నొచ్చుకుంటూ “అయ్యో అలాగా! సారీ అండీ ఏదో పార్టీ మూడ్ లో ఉండి గమనించలేదు. మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించమని మావాళ్లకు చెప్తాన్హెండీ వన్స్ ఎగైన్ సారీ ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ” అనీ చెప్పాడు. సరేనని మోహన్ వెనుదిరిగాడు.

“ఆయన సారీ చెప్పాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే వీళ్ల మీద పోలీసు కంప్లెయిట్ ఇచ్చేవాణ్ణి. అసలు రాత్రి పదిగంటల తరువాత పెద్దగా మ్యూజిక్ పెట్టడం, లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు పెట్టడం నేరమని చాలామందికి తెలియదు. ఈ ఒక్కవిషయంలోనే కాదు, కొంతమంది తమ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే (ఒడుగులు; బారసాలలు, గృహప్రవేశాలు) రోడ్డంతా బ్లాక్ అయ్యేటట్లు చేస్తారు. అలా • రోడ్డుకు షామియానాలు వేసి రోడ్డు బ్లాక్ చేయడం నేరం. అందుకే ఇలా కామన్ సెన్సు లేకుండా ఇతరులను ఇబ్బందికి గురిచేసే వాళ్లను ఊరికే వదిలేయకూడదు. పోలీసు కంప్లెయింట్ ఇవ్వాల్సిందే” అనుకున్నాడు. మోహన్.

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కృష్ణలీలలు

కన్నీటి చుక్క