ఎడారి కొలను 

ధారావాహికం – 42వ భాగం

(ఇప్పటివరకు : సుబ్బారావు తల్లి కేసు వాపసు తీసుకోమని చెబుతుంది. వసుంధర  తో  కేసు విషయమై మాట్లాడటానికి మైత్రేయి ప్రసాద్  ని తీసుకోని   వసుంధర ఇంటికి వెళుతుంది. వసుంధర మాటలతో ప్రభావితమవుతుంది మైత్రేయి. ప్రసాద్ వైవాహిక జీవితం గురించి అడుగుతాడు లాయర్ వెంకటేశ్వర్లు.  ఆ రాత్రి తన గతం తాలూకు  ఆలోచనలలో మునిగి పోతాడు ప్రసాద్.)

తనకి కొత్తగా పోస్టింగ్ వచ్చింది ఒక యం ఎన్ సి లో. చాలా సంతోషం గా ఉద్యోగం లో చేరాడు. ఇప్పటి కయిన తనకోక గౌరవ ప్రదమయిన ఆధారం దొరికిందని పించింది. తన పైనున్న మచ్చ చెరిగిపోతుంది అనుకున్నాడు. ఈ ప్రపంచానికి తన కు జన్మతా ఉన్న స్టూవర్ట్పురం మనిషన్న గుర్తింపు తొలిగిపోతుందన్న ఆశ తోటి  మనసు ఉరకలు వేసింది. 

అలాటి సమయంలో అపూర్వ పరిచయమయింది. ఆమె తనతో పాటు అదే యం ఎన్ సి లో కొత్త రిక్రూట్. ఇద్దరిది  ఒకే డిపార్ట్మెంట్. చాలా సార్లు ఆమెతో కలిసి కంపెనీ కార్లో వన్ డే కాంప్  లకూడ వెళుతుందే వాడు తాను. అలా వాళ్ళిద్దరి మధ్య చనువు తో కూడిన స్నేహం పెరిగింది.  

     ఏ  డ్రెస్సులోనేయిన ఇమిడిపోయి అందం గా కనిపించేది అపూర్వ.  ఆమె పేరెంట్స్ ది  ఇంటర్ స్టేట్ వివాహం. ఆమె నాన్న చంద్రమౌళి , తమిళనాడు గ్రామీణ బ్యాంక్ లో బ్రాంచ్ మానేజర్. అపూర్వ వాళ్ళ  అమ్మ సుమతీ హిందీ టీచర్ గా ప్రయివేట్ స్కూల్లో పని చేస్తుంది. వాళ్ళ ది ప్రేమ వివాహం. సుమతీ గారు ఆంధ్ర అమ్మాయి, చంద్రమౌళి గారు తమిళీయన్. కానీ అంతా తమిళియన్ సంప్రదాయమే వాళ్ళింట్లో అనుసరించబడుతుంది. చంద్రమౌళి గారికి తెలుగు వచ్చు. అలాగే సుమతీ కూడా కొంచం కొంచం తమిళమ్ మాట్లాడగలదు. వాళ్ళు చెన్నై లోనే ఒక అపార్ట్మెంట్ తీసుకొనిఉంటారు. చంద్రమౌళి  మాత్రమే బ్యాంక్ ట్రాన్స్ఫర్ లతో తమిళనాడు లోని గ్రామా లన్నీ తిరుగుతుంటాడు . అపూర్వ కి ఒక తమ్ము దూ కూడా ఉన్నాడు. అప్పడప్పుడు అపూర్వ , వాళ్ళ అమ్మ, చిన్న తమ్ముడు వాళ్ళ నాన్నని కలవ టానికి వెళుతుంటారు. ప్రతి వారం మాత్రం చంద్రమౌళి తన కుటుంబాన్ని  కలవ టానికి వస్తుంటాడు. కానీ అపూర్వ అంటే చాలా గారాబం.  ఆమె ఎం చేసిన కూడా వద్దనే వాళ్ళు కాదు . 

    అందుకే ఎప్పుడు తన మాటే నెగ్గాలని వాదిస్తుంటుంది. అలాటి అపూర్వ పైన కొన్ని వింత ప్రభావాలు పడ్డాయి. స్వేచ్ఛగా ఉండడం అంటే స్మోక్ చెయటం , ఫ్రెండ్స్ తోటి పబ్స్ కెళ్ళడం లాంటివి అని అర్ధం చేసుకుంది. అమ్మ నాన్నల గారాబం , సొంత సంపాదన వలన  అపూర్వ స్వేచ్ఛ కి పట్టా పగ్గాలు లేకుండా పోయాయి. పెంకి తనం , అహంకారం , పట్టుదల లాంటివి ఆభరణాలుగా  ఉన్న  అపూర్వ   ప్రసాద్ జీవితం లోకి ముందొక స్నేహితురాలిగా సరదాగా ప్రవేశించింది. ఆమె చేసే అల్లరి, సరదా  పనులు ప్రసాద్ ని ఎంతో ఆకర్షించాయి.  ఆమె చనువుకి సంబరపడి పోయాడు.

 హఠాత్తుగా  ఒక రోజు న అపూర్వ  అడిగింది ,  “ప్రసాద్ మనం ఎందుకు పెళ్లి 

చేసుకోకూడదు.”   ప్రసాద్ కాస్త తత్తర పడ్డాడు. ‘ఇలా అడిగేసిందేంటి. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా!’ అన్న సందేహం మొదలయింది. అదే మాట అపూర్వ కి చెప్పాడు. “చూడు  అపూర్వ, మరి చిన్న పిల్ల లాగా మాట్లాడొద్దు. పెళ్లి అనేది జీవితం తో టి ముడిపడిన  విషయం. నా  గురించి ఎం తెలుసని నువ్వలా అడిగావు. నాకు అమ్మ నాన్న లేరు. పైగా నేను పేదరికంలో పుట్టాను. కష్టమంటే తెలిసినంత బాగా సుఖం ఎట్లా ఉంటుందో తెలియని వాడిని. ఆలోచించుకో,” అన్నాడు . 

 ఒక వారం రోజుల దాక అపూర్వ ఆఫీస్ లో కూడా ప్రసాద్ తోటి ఎక్కువ మాట్లాడ లేదు. తాను ప్రసాద్ ముందు ఒక ముఖ్యమైన ప్రస్తావన తెచ్చిన విషయం మరిచి పోయినట్లే ప్రవర్తించింది.  

‘తాను మాట్లాడిన తీరు, తన పేదరికం ఇవన్నీ అర్ధమయి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను మార్చుకుందేమో. లేక చంద్రమౌళి గారే వొప్పుకోలేదో?’ అని అనుకోని. ఏమి జరగనట్లే ప్రసాద్ నిర్లిప్తంగ ఉండి  పోయాడు.   

***************             

ఆ రోజు ఆదివారం. తాను తన అపార్ట్మెంట్ లోనే కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటున్నాడు.  బయటికి వెళ్లాలన్న మూడ్ లో అయితే లేడు. తనకు నచ్చిన హిందీ పాటలను యూట్యూబ్ లో వింటు, మంచి కాఫీ తాగుతు న్నాడు. ఫోన్ రింగయింది.

 “హలో !”

“ హాయ్ డియర్! నేను మీ అపూర్వ ని. బిజి నా బాస్ . ఈ రోజు మీ తో టి బయటికెళ్ళా లని చాల స్ట్రాంగ్ ఫీలింగ్. ఏమంటారు దొర గారు. నన్ను తీసు కెళ్తారా ? లేదా?” 

 “ ఎన్నింటికి అపూర్వ,”

 ఇప్పుడే మీరు బయలు దేరి మా ఇంటికొస్తే , అప్పుడు నేను చెబుతాను మనం ఎక్కడి కెళ్ళలో. ”

“ మీ అమ్మ నాన్న కి చెప్పా వ? నువ్వు నాతో రావడానికి  వాళ్ళు ఒప్పుకున్నారా?”

“అంత భయపడితే ఎలా బేబీ !  నేను చూసుకుంటాను కదా ?”

“అంటే ?”

“అంటే అంటే అంతే! కమ్ ఫాస్ట్!” అంటూ ఫోన్ పెట్టేసింది. 

ఆమె  అల్లరి తనకి ఇష్టం. అందుకే చక చక రెడీ అయ్యి బైక్  మీద అపూర్వ వాళ్ళింటి కెళ్ళాడు. 

తాను బైకు కింద నే పార్కింగ్ లో పెట్టి , లిఫ్ట్ ద్వారా మూడవ ఫ్లోర్ లో ఉన్న అపూర్వ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి చేరు కొని, కాలింగ్ బెల్ నొక్కాడు. 

“కమిన్ ,” అన్న అపూర్వ గొంతు మధురంగ వినిపించింది ప్రసాద్ కి. తలుపు కి లాక్ లేకపోవటంతో సులభంగానే తెరుచుకుంది. 

కొంచం తడబడుతూనే లోపలకి వెళ్ళాడు తాను. ఆశ్చర్యం . అపూర్వ వాళ్ళ నాన్నమెడ  చుట్టూ చేతులేసి గారాబంగా కూర్చొని ఉన్నది. అప్పటికే అపూర్వ చక్కటి అనార్కలి మోడల్  ఫ్లోరల్ కుర్తి , వైట్  చుడిదార్  వేసుకొనిమరి మరి చూడాలనిపించే ల  సిద్ధం గ ఉన్నది.  చంద్రమౌళి గారు చిరునవ్వుతో “  రా ! రా 1 ప్రసాద్ !” అంటూ సాదరం గ ఆహ్వానించి, తన పక్కనే ఉన్న సింగల్ సోఫా చైర్ చూపెట్టారు కూర్చోమని.

అపూర్వ వాళ్ళ అమ్మ పోహా పెట్టిన టిఫిన్ ప్లేట్స్ ని తీసుకొని అక్కడి కొచ్చి ,” ఓకే. ప్రసాద్ కూడా వచ్చాడన్న మాట. టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాము.,” అంటూ అతని కూడా ప్లేట్ అందించింది. 

“ ఒరేయ్ బుజ్జి! నువ్వింకా గ్రౌండ్ కి వేళ్ళ లేదా ! త్వరగా తెములు. మీ సార్ ఫోన్ వచ్చింది ,” అని పెద్దగా కొడుక్కి చెప్పింది. 

ఆమె పిలుపుకి అపూర్వ తమ్ముడు అనురాగ్ క్రికెట్ సెట్ తీసుకొని వచ్చి ,” బాయ్ మామ్, బాయ్ నాన్న,”  అంటూ  బయటికి వెళ్లి పోయాడు. 

అప్పటివరకు తన కిచ్చిన పోహా తింటూ వాళ్ళ ఇంటిని గమనిస్తూ కూర్చున్నాడు ప్రసాద్. 

అది త్రీ బెడ్ రూమ్స్ ఉన్న అపార్ట్మెంట్. గదులు బాగా వి శాలంగా ఉన్నాయ్.

 మూడు గదులకు బాల్కానీస్ కూడా ఉన్నాయ్. కిచెన్ ,డైనింగ్ కలిసున్నాయి, తరువాత వాళ్ళందరూ కూర్చున్నదే లివింగ్ రూమ్. చాలా చక్కగా పొందికగా అమర్చబడి ఉన్నది ఇల్లంతా.

“ ఏంటి ప్రసాద్, అంతలా ఆలోచనలో పడిపోయావు,” అంటూ మాట కలిపారు చంద్రమౌళి గారు. 

“ఎం లేదు సార్, చెప్పండి,” అన్నాడు.

 “ నేను చెప్పడానికేముంది, నీకు మా అమ్మయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా,” సూటిగా పాయింట్ లోకి వచ్చేసాడాయన. కొద్దీ సేపు ప్రసాద్ కి ఎం చెప్పాలో అర్ధం కాలేదు.

“ అలా అడిగితె ఎలాగండి,” అంటూ “ ప్రసాద్, మా అపూర్వ కి నువ్వు బాగా నచ్చా వంట , నిన్ను పెళ్లిచేసుకోమని అడిగిందట కూడా, మరింక నీ అభిప్రాయం చెప్పావ లేదా?” అ న్నది  సుమతి. 

“ మేడం, మీకు నా గురించేమయిన అపూర్వ చెప్పిందా,” అడిగాడు ప్రసాద్. 

“నువ్వు చెప్పు నీ గురించి. నాకేమి అభ్యంతరం లేదు,” అంది కొంటెగా అపూర్వ. 

“ చెప్పు బాబు ,” అంటూ భరోసా ఇచ్చారు వాళ్ళు. 

“ నేనిప్పుడు ఒక అనాధలాంటి వాడిని సార్, మా అమ్మ నాన్న చనిపోయి చాల సంవత్సరాలయింది. నాకంటూ ఒక కుటుంబం లేదు, నేను కూడా అపూర్వతో టే  సేమ్ ఎం ఎన్  సీ  లో చేస్తున్నాను.  నెలకి  జీతం 90,000/- మాత్రమే. మీది వెల్ టు డు ఫ్యామిలీ. నాకిచ్చి పెళ్లి చేయ డా నికి మీ రే ఆలోచించాలి. ఇదే విషయం అపూర్వ కి కూడా చెప్పా ను ఆలోచించుకోమని.,” అన్నాడు. 

“ అలా అంటా  వెంటి ప్రసాద్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే  మీ కొక కుటుంబం ఏర్పడదా! అలాగే మేమందరం నీ వాళ్ళం కామ ?” అంది సుమతి.  

“ చూడు ప్రసాద్ మనకెన్ని అభ్యంతరాలున్న , మా అపూర్వ కి అవేమి పట్టవు. దాని గురించి నీకు బాగా అర్ధమయిందనుకుంటాను. నీకేం అభ్యంతరం లేక పోతే మాక్కూడా ఏమి అభ్యంతరం లేదు మీ కుపెళ్లి చేయడానికి.” 

“ఓకే ,ఓకే డాడ్1 ఒప్పేసుకున్నారుకదా! అమ్మ నీక్కూడా  ప్రసాద్ నచ్చేసాడు కదా!”

అంటూ ,   “లే లే ప్రసాద్ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి పద!” అంటూ ప్రసాద్ చేయి పట్టు కొని లాగుతూ ,” బాయ్ , బాయ్ ,” అంటూ ప్రసాద్ ని లాక్కొని పోయింది బయటికి. 

“ముందు అన్న బీచ్ కి వెళదాం, ఆ తరువాత  మంచి హోటల్ కెళ్ళి మీల్స్ చేద్దాం. తరువాత ఒక మంచి పిక్చర్ చూద్దాం, అప్పటి కింకా మనం అలసి పోలేదంటే  అలసిపోయే పని చేద్దాం,” అంటూ చెప్పుకు పోతున్నది అపూర్వ, ప్రసాద్ ఆలోచిస్తూ బండి నడుపుతున్నాడు. అన్నబీచ్ చేరుకున్నారు.  

అన్నా  బీచ్ లో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న అపూర్వ చిన్న పిల్లలాగా అనిపించింది. ప్రసాద్ కి అనిపించింది ఈ అమ్మాయి  తనను తన వ్యక్తిత్వం చూసి  నిజం గ ప్రేమించిందా లేక ఆకర్షణ మాత్రమేనా ? ఏమో తనకింకా  అర్ధం కావటం లేదు. తను చాల త్వరగా నిర్ణయాలను తీసుకోవడం మాత్రం నిజం. అమ్మయిని ఆమె తల్లి తండ్రులయిన సరిగా అర్ధం చేసుకున్నారో లేదో? ఇలా ఆలోచనలలో ఉన్న ప్రసాద్ ని పరిగెత్తు కుంటూ వచ్చిన అపూర్వ చుట్టేసింది. ఆ ఊపులో అతను కింద పడిపోయాడు తీరం లో వస్తున్నా అలల మీద.  ఆమె అతని మీద పడింది. అలల ఊపుకి ఇద్దరు పొర్లిగింతలు పెట్టారు. ప్రసాద్ అపూర్వ ను పైకి లేప బోయాడు. “ 

“ఉహు! నేను లేవనుగా! నిన్ను లేవనియ్యను. ఇలాగె చాల బాగుంది. మన ఇద్దరికి మా మామ్ డాడ్ ల అంగీకారం కూడా దొరికింది కాబట్టి, మనమింకా స్వేచ్ఛ గ ఉండొచ్చు. అలా ఇబ్బంది పడతావేంటి. నేనెప్పుడూ నీ దాన్నే. నువ్వెప్పుడూ నా వాడివే,” అంటూ అతన్నీ ముద్దులతో ముంచేసింది. ప్రసాద్ కి తనని ఆపడం కష్టమే అయింది. ఇలా ఆ సముద్రపు అలల్లో చాలా  సేపు తేలియాడారు ఇద్దరు. ప్రసాద్ కనిపించింది అపూర్వ నిజంగా  నే తనని ప్రేమిస్తున్నదని.

అపూర్వ అంది,” నాకు పిచ్చి ఆకలిగా ఉన్నది. నేను నిన్నిలా తినలేను కదా! నాకు మంచి భోజనం పెట్టించు , ఆ తరువాత నిన్ను తినేస్తాను,” అంటూ కన్ను గీటింది.  

   అక్కడి నుండి అన్న నగర్ లో ఉన్న  నగేష్ అయ్యంగార్ మెస్ కొచ్చారు. అయన ఆ  మెస్ స్వయం గా నడుపుకుంటారు. కొద్దీ మంది వంటవాళ్ల సాయంతో ప్రతి రోజు మీల్స్ ఆయనే తయారు చేస్తాడు. అయన చేతి వంట అమ్మను, అమ్మొమ్మ ను మరిపించే ఇంటి భోజనం లా  ఉంటుందని అంటారు. అందుకే అయన కస్టమర్స్ అందరు బ్యాచిలర్స్. ఇక్కడికే వచ్చి తినేసి పోతుంటారు. రాత్రి పూట  కేవలం టిఫిన్ మాత్రమే పెడతాడు  ఆయన.  ప్రసాద్ రోజు మీల్స్ కి అయన మెస్ కె వెళ్తాడు. మీల్స్ కూడా చాల రిజనబుల్  రేటు లోనే ఉంటుంది. అయినా సాఫ్ట్ వెర్ ఎంప్లాయిస్ నుండి సేల్స్ పర్సన్స్ వరకు అందరు అయన మెస్ కె వస్తుంటారు. 

మీల్స్ కానించి, “ ప్రసాద్ పద మంచి థియేటర్ చూడు సినిమాకి వెళదాము ,” అంది. 

సరే పద అంటూ అన్న నగర్ లోనే ఉన్న  పి వి ఆర్  థియేటర్స్ కి తీసుకెళ్లాడు. ఒక థియేటర్ లో పాత  తెలుగు సినిమా  ఒకటి ఉంటె “దానికెళదాం,” అంది. “అంత పా త సినిమాక ,” అన్నాడు కాస్త ఆశ్చర్యం గా. అలాటి సినిమాకి జనం ఎక్కువుండరు. మనం ఏసీలో పుష్ బ్యాక్ కుర్చీల్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూస్తూ మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు,” అంది.  నేను భవ్య ,ఎప్పుడు బోరుకొట్టిన ఇలా ఏదొక పాత  సినిమా చూసుకొని వస్తాము. చాలా ఎంజాయ్ చేస్తాము,” అంటూ చెప్పుకుపోయింది.   

భవ్య తోటి అంటే ఫ్రెండ్ కాబట్టి కబుర్లతోటి , పాప్కాన్  తింటూ, ఇంటర్వెల్ లో  కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజయ్ చేస్తారేమో.  తనతోటి ఎలాటి ఎంజాయ్ మెంటో  అర్ధమయిన కూడా తనలా అపూర్వ తో ప్రవర్తించాలనుకోవడం లేదు.  పవిత్రమయిన బంధం ఏర్పడాలను కున్నాడు.

 “పద టికెట్స్ తీసుకో, ఎప్పుడు ఏదొక ఆలోచనలో పడి పోతావు,” అంటూ తొందర చేసింది.  టికెట్స్ తీసుకొని హల్లో  కి ప్రవేశించారు. నిజం గానే హాల్ చాల ఖాళిగా ఉన్నది. ఒక కార్నర్ సీట్స్ చూసుకొని కూర్చున్నారు. పాత దే  అయినా చాల మంచి సినిమా ,  “ ప్రేమనగర్,”  తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమా రంగం లో ఉన్న ప్రముఖ యాక్టర్స్ అందరు  ఈ సినిమా చేసారు.  ‘ఆత్మాభిమానం ఉన్న కధానాయిక, స్వేచ్ఛగా  ఏ  బాదర బంది  లేని  సంపన్నుడయినా యువకుడి మధ్య జరిగిన ప్రేమ కధ . ఇలా ప్రేమ కధ లు మన నిజ జీతంలో   కూడా ఉంటాయి.  కాకపోతే కొద్దీ తేడాతో. నా జీవితం లో ఈ కాంబినేషన్ మారిందంటే,’ అనుకున్నాడు ప్రసాద్. 

 అలా సినిమా చూట్టం లో తన కంత మజా  రాలేదని , ఇంటర్వెల్ లోనే వెళ్లి పోదామని ,” లేచేసింది అపూర్వ. అప్పటికే నాలుగయింది. “అలాగే అపూర్వ, నేను నిన్ను ఇంటి దగ్గర దిగ బెడతాను,” అన్నాడు ప్రసాద్. అప్పుడే ఇంటికెళ్లాలని లేదు, నన్ను నా ఫ్రెండ్ భవ్య ఫ్లాట్ దగ్గర దిగ బెట్టు, ” అన్నది.  “అలాగే,” అంటూ  ప్రసాద్ అపూర్వ ను భవ్య ఫ్లాట్  దగ్గర దిగ బెట్టి తాను వెళ్ళిపోయాడు. 

“ హాయ్ , అపూర్వ !వాట్ ఏ సర్ప్రైజ్ , ఈ రోజు మొత్తం నీ ఫియాన్సీ తోటి గడిపేస్తానన్నావు. ,” అంది భవ్య. 

“ ఓహో! ప్రసాద్ , మంచి మొగుడిగా పనికొస్తాడే తప్ప ఎంజాయిమెంట్ కి కాదు, వొట్టి ముద్ద పప్పు. నేనెంత చనువిచ్చిన మడికట్టుకు కూర్చుంటే నేనేం చేస్తాను. అందుకే బోర్  కొట్టి నీ దగ్గరికొచ్చాను,” అంది.  

మత్తుగా బెడ్ మీద వాలిపోయిన అపూర్వ అంగ సౌష్టంవం ముందు ఏ  అప్సరస సరిరాదేమో అన్నట్టుగా అనిపించింది. భవ్య తనని తానూ ఆపుకోలేక పోయింది, అపూర్వ పక్కన చేరింది తమకంగా,  ఇద్దరి మధ్య గాలికూడా చోరనంత బిగి కౌగిలిలో ఇమిడి పోయారిద్దరు. అలా ఎంత సేపు గడిచిందో అపూర్వ కి తెలియలేదు. 

రాత్రి తొమ్మిది అవుతుండగా భవ్య ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. భవ్య విసుగ్గా లేచి తలుపు తీసింది, ఎదురుగ ప్రసాద్. 

“ప్రసాద్  గారు మీరా ,” అంది తత్తరపాటుగా. 

“ ఓహో ! అప్పుడే తొమ్మిదయిందా.  అపూర్వ కి చెబుతాను, మీరు కూర్చోండి,” అని ఫ్రంట్ రూమ్ లో సోఫా లో కూర్చోబెట్టి  బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.  

     అపూర్వ ని లేపి , “కాస్త ఫ్రెష్ అవవే! ప్రసాద్ వచ్చాడు నిన్ను తీసుకెళ్లడానికి,”  చెప్పింది.  అపూర్వ కాస్త కంగారుగా లేచి బాత్రూం లోకి దూరి ఫ్రెష్ అయి భవ్య  వెనకాలే ఫ్రంట్ రూమ్ లోకి వచ్చేసింది. మొబైల్ చుస్తే అమ్మ మిస్డ్  కాల్స్ కనిపించాయి. 

“ ఓహో ! ప్రసాద్ అప్పుడొచ్చి దీనితో కబుర్లు చెబుతూ పడుకున్నాను. ఎప్పుడు నిద్దర పట్టిందో నాకు తెలియలేదు. ఇది కూడా లేప లేదు.” 

 “ అపూర్వ , మీ మామ్ డాడ్ కి నువ్వు ఫోన్ చేసి చెప్పలేదా? మీ మాం ఫోన్ చేసింది , మీరిద్దరూ ఎక్కడ ఉన్నారు అని,” అన్నాడు. 

“ఉంటామండీ, తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్లి పోతాను,” అంటూ అపూర్వ చేయి పట్టు కొని తీసుకెళుతున్న ప్రసాద్ ని చూస్తూ ఉండి  పోయింది భవ్య. 

( ఇంకా ఉన్నది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మా ఇంట దీపావళి

నోముల పంట దీపావళి