ఎడారి కొలను 

 ( 49వ భాగం )

(ఇప్పటివరకు:  పెద్దక్క చనిపోతుంది. వసుంధరని  కలుస్తాడు సుబ్బారావు. పెద్దక్క సంతాపసభలో పెద్దక్క ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. మహిళలకోసం ఒక కౌన్సెలింగ్ సెల్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. కోర్ట్ కేసు వాయిదాకి రెండు రోజులు ఉన్నదనంగా మైత్రేయి ఎక్కినా ఆటో ని ఒక బైక్ వ్యక్తి గుద్దేసి వెళ్తాడు. ఆ ప్రమాదంలో చిన్న గాయాలతో మైత్రేయి బయట పడుతుంది. ఇది కావాలనే చేసిన యాక్సిడెంట్ అన్న అనుమానం అందరికి వస్తుంది.)

దెబ్బలు తగలడంతో మైత్రేయికి కొంచం ఫీవర్ రావడంతో కోర్ట్ డేట్ కంటే ముందే లీవ్ పెట్టి ఇంట్లో ఉండిపోయింది. 

యాక్సిడెంట్ జరిగిన మరునాడే  సుబ్బారావు మైత్రేయి కాలేజీ కెళ్ళి ఆరా తీస్తాడు మైత్రేయి  కాలేజీ కి వచ్చిందా రాలేదా అని. వాచ్మాన్ చెబుతాడు ఆమె రాలేదని, ఆమెకి ఫీవర్ వచ్చి లివ్ పెట్టిందని. “అమ్మయ్య తన పని సుళువవు తుంది. మైత్రేయి కోర్ట్ కి రాక పోతే కేసు మళ్ళి  వాయిదా పడుతుంది, తనకు కొంత సమయ దొరుకుతుంది మైత్రేయి ని ఏదోవిధం గా ఒప్పించి ఈ కేసు నుండి బయటపడటానికి,” అనుకుంటూ రిలాక్స్  అవుతాడు. 

జులై 15 నాడు లాయర్ కోదండపాణి, అయన అసిస్టెంట్,  సుబ్బారావు కోర్ట్ కి హాజరయ్యారు. వాళ్ళొచ్చిన కొద్దిసేపటికల్లా మైత్రేయి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ కలిసి కోర్ట్ కొచ్చారు. ఇంకొద్దిసేపటికల్లా వసుంధర  సుమంత్  వచ్చి వీళ్ళను  కలిశారు. మైత్రేయి రావడంతో సుబ్బారావు కి గతుక్కుమన్నది.

కోర్ట్ ప్రాంగణ మంతా  కాస్త సందడిగా ఉంది. నల్ల కోట్లు వేసుకున్న లాయర్ల వెనకాతల పరిగెడుతూ,  “అయ్యా , ఈ రోజు మాకేసు అయిపోతుందా ,” “వాయిదా దొరుకుతుందా,”  “రాజి చేయిస్తారా” అంటూ క్లైంట్స్ అడుగుతున్నారు. పోలీసులు  కొందరిని వాళ్లతోటి తీసుకొస్తున్నారు.మైత్రేయి పెట్టిన  గృహ హింస కేసు ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో ప్రవేశపెట్టబడింది. వసుంధర , కోదండపాణి ఒకరి నొకరు విష్ చేసుకొని లాయర్లు రూమ్ వైపుకి వెళ్లారు. వాళ్ళ అసిస్టెంట్స్ మాత్రం వాళ్ళ  క్లైంట్స్ దగ్గరే కోర్ట్ బయట ఆవరణ లో నిలబడి ఎదురు చూస్తున్నారు. 

9:30 కల్లా  జస్టిస్ జయమ్మ గారి అంబాసిడర్ కార్ వచ్చి ఆగింది. బంట్రోత్ కిష్టయ్య దిగి, కొన్ని ఫైల్స్ పట్టుకొని, జయమ్మ గారిని అనుసరించాడు. నేరుగా జయమ్మ గారు, తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళింది. జస్టిస్ రావడం తో అప్పటి వరకు ఎదురు చూస్తున్న క్లయింట్స్, అసిస్టెంట్స్, లాయర్లు అందరూ కోర్ట్ హల్లో  కి వెళ్లి వాళ్ళ కి కేటాయించబడిన సీట్లలో కూర్చున్నారు. బంట్రోత్ కిష్టయ్య జస్టిస్ జయమ్మ గారు వస్తున్నారని, కోర్ట్ కారవాయి ప్రారంభించబోతున్నామని పెద్దగా చెప్పాడు, జడ్జి గారి పోడియం కి కిందన టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ , సిద్ధం గ కూర్చున్నారు. జయమ్మ గారు పోడియం దగ్గరికి చేరగానే అందరు గౌరవంగా లేచి నిలబడ్డారు నిశ్శబ్దంగా. ముందుగా ఎప్పుడో ప్రవేశ పెట్టిన కేసు విచారణ ముగియటంతో, ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మైత్రేయి గృహహింస చట్టం కింద పెట్టిన కేసు బెంచ్ దగ్గరకొచ్చింది. బంట్రోతు మైత్రేయి ని కుడి వైపున్న పోడియం కి దగ్గరగాను , సుబ్బారావు ని ఇంకో వైపు ఉన్న డాక్ దగ్గర  నిలబెట్టడం జరిగింది. 

డిఫెన్స్ లాయర్ కోదండపాణి  గారిని మాట్లాడమని జస్టిస్ జయమ్మ గారు ఆదేశించారు. 

ఎప్పటిలాగే కోదండ పాణి సుబ్బారావు ని సపోర్ట్ చేస్తూ, “వసుంధర ఊహించిన విధంగా గా మైత్రేయి కావాలనే అతన్ని కోర్ట్ కి లాగిందని, అందువల్ల తన క్లైంట్ కి  పరువు పోయిందని , దానికి ఎవరు బాధ్యత వహిస్తారు,”  అంటూ వాదించాడు.

ఆ తరువాత వసుంధర వంతు వచ్చింది. ఆమె  అంతే దీటు గ కోదండ పాణి గారిని తిప్పికోట్టింది. అయన క్లయింట్ రాజి కోసం ఎలాటి నీచమయిన ప్రయత్నాలు చేసాడో కూడా కోర్ట్ కి వివరించింది. అతని  నైతికత సరియైనది కాదని, నయానో భయానో తన క్లయింట్ ని లొంగదీసుకొని కేసు లేకుండా చేసుకోవాలని అందులో భాగంగా తన క్లయింట్ ఎక్కిన ఆటో ని గుద్ది , ఆమెకి హాని తలపెట్టాడని వివరించింది. దానికి కోదండ పాణి ఇవన్నీ లాయర్ వసుంధర కల్పించిన కట్టు కధ లని వాదించాడు.

వీళ్ళ వాదనలు పూర్తయిన తరువాత మైత్రేయి ని ప్రశ్నించింది జస్టిస్ జయమ్మ, “మైత్రేయి గారు మీకు దెబ్బలు తగిలినట్లుగా అనిపిస్తున్నది, అవి మీకెలా తగిలాయి?”

“ ఆటో లో ఇంటికెళుతుంటే ఒక వ్యక్తి వేగంగా నేను వెళుతున్న ఆటో ని గుద్దడం తో, నేను రోడ్ మీదకి పడిపోయాను, అప్పుడే నాకి దెబ్బలు తగిలాయి,” అంది.   

నాకు ఆమెను ప్రశ్నించటానికి అవకాశం ఇమ్మని కోదండ పాణి కోరాడు.

“ మైత్రేయి గారు, మీకు  నిజం గా ఆటో లోంచి పడడంతోనే దెబ్బలు తగిలాయి, లేక మీ లాయర్ అలా చెప్పమందా? అంటే మీరు హీల్స్  చెప్పులు  వేసుకొని రో డ్ మీద నడుస్తూ కూడా పడిపోవచ్చు కదా!” అన్నాడు.

“నేను హై హీల్స్ వేయను సార్, నాకి దెబ్బలు ఆటో లో నుండి పడటం తోనే తగిలాయి,” అంది.

“దానికి ఏంటి సాక్ష్యం. ఇలా అనుకుందాం ఆటో ని గుద్ది నప్పుడు, కేవలం మీకు మాత్రమే దెబ్బలేలా తగిలాయి? ఆటో డ్రైవర్ కి తగల లేదా? ఆటో కేమి కాలేదా? ఎందుకంటే యువర్ హానర్ , అలాటి కేసు ఏది ఎక్కడ రిపోర్ట్ చేయబడలేదు, అందుకని ఈమె అబద్దం చెబుతున్నదని నా నమ్మకం,” అన్నాడు.

వెంటనే వసుంధర లేచి “ సాక్షం ఉన్నది యువర్ హానర్,” అంది.

“అయితే ప్రవేశ పెట్టండి విందాము,” అన్నది జస్టిస్ జయమ్మ. 

వెంటనే సుమంత్ వెంకీ ని వెంటబెట్టుకొని వచ్చాడు పోడియం దగ్గరికి. అక్కడున్న కుర్చీలో కూర్చోమని చెప్పి ,” ఇప్పుడు చెప్పు,” అన్నది జస్టిస్ జయమ్మ.

వెంటనే వసుంధర లేచి, “ నీపేరు ,” అడిగింది.

“ నా పేరు వెంకీ .”  

“ఏంచేస్తుంటావు ?”

“ ఆటో నడుపుకుంటానమ్మా.”

“ ఈమె నీ ఆటో ఎక్కిందా?”

“ అవునండి.”

“ఆ రోజే యాక్సిడెంటయింది కదా ?”

“ అవును మేడం గారు, నా ఆటో కి డెంట్  కూడా    పడింది.” 

“ నీ ఆటో ని గుద్దింది ఎవరో నీకు తెలుసా?”

“తెలుసండి, కానీ బండి నంబర్ సూడలేకపోయానమ్మా.”  

“ ఎందుకని?”

“ ఆయన బండి గుద్దిన  స్పీడుకి నా ఆటో బాలన్స్ తప్పింది, ఆటో లో ఉన్న ఈ మేడం  కిందపడిపోయింది, ఆటో పూర్తిగా ఒరిగిపోకుండా ఆపటం లో నేను ఉండగా, కింద పడ్డ అతను లేచి చాలా వేగం గ తప్పించుకుపోయాడు, అదే బైక్ మీద.” 

“ అతన్ని చూసావా?”  

“ ఆవ్ ! అయన హెల్మెట్ పడిపోనాది, అప్పుడే సూసిన   ఆయన మొహం.”

“ ఇప్పడు చుస్తే గుర్తు పెడతావా?”

“ ఆయనే కదండీ, అలా ఎదురుమాల నిలుచుని ఉన్నాడు,” అన్నాడు వెంకీ అమాయకంగా.   “ఇంతే యూర్ హానర్,” అంటూ వసుంధర కూర్చుంది. 

  కోదండపాణి  గారి వంక చూసారు జయమ్మ గారు.

“ ఎంబాబు, నువ్వెక్కడ ఉంటావు?” వెంకీ దగ్గరికొచ్చి అడిగాడు కోదండపాణి.

“నేను యానాది గూడెం లో ఉంటానండీ. రోజు లో ఎంత మంది ఎక్కుతారు నీ ఆటో,” “ 

“కనీసం పది పదిహేను కిరాయలుఉంటాయండి.”

“ అయితే ఎక్కినా వాళ్ళందరిని నువ్వు గుర్తు పెట్టుకుంటావా?”

“ లేదండి. ఆలా అందరు గుర్తుండరండీ. ” 

“ ఆ నిలబడ్డాయనే నీ ఆటో గుద్దాడని అంత ఖచ్చితంగ  ఎలా చెప్పగలవు? పైగా హెల్మెట్ ఉన్నదని అన్నావు, పడిపోయింది  అన్నావు, వేగంగ పారిపోయాడన్నావు. అన్ని అంత వేగం గా జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి  మొహం  నీకెలా గుర్తుంది,” అన్నాడు.

“ నా ఆటో ని గుద్ది , నేనెక్కడ ఆపి డబ్బులడుగుతానో అన్న భయం తో పడిపోయిన హెల్మెట్ చేతిలో పట్టుకొని పోతున్న అతన్ని నేను బాగా సూసాను సార్, అందుకే బాగా గుర్తుంది,” అన్నాడు. 

“ మరి కేసేందుకు పెట్టలేదు?” 

“ సార్ మేము రెక్కాడితే కానీ డొక్కాడ ని వాళ్ళం నాకు కేసు పెట్టె ధైర్నం లేదు సార్.  నేను కేసు పెడితే మాత్రం, ఎం జరుగుతుంది సార్, మా మాట ఎవరింటారు. నేనే కాదు సార్, సాన మంది ఆటో వాళ్ళు కూడా పెట్టరు.  అప్పటికప్పుడు అక్కడే దొరికితే డబ్బులు వసూలు సేసుకుంటారు, లేదంటే గమ్మున ఉంటారు. మా కెవ్వరికి ధైర్నం లేదు సార్, పోలీస్ కేసు పెట్టడానికి,” అన్నాడు ఇంకా అమాయకంగా.  అడిగేదేమి లేక 

“ఇంతే  యువర్ ఆనర్,” అని చెప్పి కూర్చున్నాడు.

జయమ్మ గారు అడిగింది , “మీ క్లయింట్ సుబ్బారావు గారు ఏదయినా చెప్పాలనుకుంటున్నారు?”  . 

“ అవును మేడం, అతను ను చేసినదంతా పెద్ద తప్పేమి కాదు, అయినా కూడా పశ్చాత్తాప పడు తున్నాడు. అతని భార్య రాజి కొస్తే ఈ కేసులు గొడవలు లేకుండా గౌరవంగా ఉండాలనుకుంటున్నాడు,” అని అన్నాడు.

“ మీరేమనుకుంటున్నారు మైత్రేయి ,” అడిగింది .

కొద్దీ సేపు కోర్ట్ హాల్ అంత నిశ్శబ్దంగ మారింది. అందరు ఆమె ఎం మాట్లాడుతుందో వినాలన్నట్లు ఎదురుచూస్తున్నారు. ఆ నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ మైత్రేయి చెప్పడం మొదలెట్టింది.

“గౌరవ నీయు లయిన జడ్జి గారికి, మేడం ఇప్పటి వరకు డిఫెన్స్ లాయర్ గారు మాట్లాడేది వింటునప్పుడు, నా మీద నాకే అనుమానమొచ్చింది, నేనేమయినా తప్పుచేశాన అని. ఎందుకంటే తాగొచ్చి కొట్టటం అనేది మొదటి సారి జరిగిందా, లేక చాలా సార్లు జరిగిందా  అన్న విషయం పక్కన పెడితే, అతనెవరు నన్ను  హింసించటానికి? అతనికేం హక్కున్నది? పెళ్లి చేసుకున్నాను, సామజిక పరంగా నాకు నా భార్య అనే  స్త్రీ మీద సర్వహక్కులు ఉన్నాయి, ఆమెని నేను ఏ  రకంగానయినా  ఉపయోగించుకోవచ్చు, తిట్టొచ్చు, కొట్టచ్చు అన్న అభిప్రాయం లో ఉంటె ఇక ఏ స్త్రీ అయినా ఎలా బతకాలి మేడం? ఇది మొదటి  సారే కదా ! ఈ సమాజం, ఈ లాయర్ నాకు గ్యారంటీ ఇవ్వగలరా, అతనా తప్పు మళ్ళి  చేయడని. అతను  కొడుతుంటే నా శరీరంతో పాటు, నేను మానసికంగా ఎంత హింసను అనుభవించాను, దాని మాటేమిటి?  న్యాయం కోసం, రక్షణ కోసం నేను పోలీస్ ని, కోర్ట్ ని ఆశ్రయించినందుకు నేను సామాజిక తిరస్కారం, బహిష్కరణను  అనుభవిస్తునాను. దాని మాటేమిటి? నా  కుటుంబం నన్ను దూరం పెట్టింది, ఎందుకంటే నేను నా భర్త మీద పోలీస్ కంప్లైంట్ చేసానని, కానీ అతని వలన నా వివాహం అయిన తరువాత , ఇప్పటివరకు నేను అనుభవించిన మానసిక క్షోభ మాటేమిటి? ఇప్పుడు కూడా నాకు దెబ్బలు తగిలాయంటే నేను అబద్దం చెబుతున్ననేమొ నని అనుమానిస్తూ మాట్లాడితే నేను ఏ  ధైర్యం తో న్యాయం కోసం పోరాడతాను, నా అస్తిత్వం కోసం , నా సామాజిక గుర్తింపు కోసం ఎవరి ని అడగమంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమా ధానం దొరికితే నాలాంటి ఎంతో మంది స్త్రీ లకి కూడా న్యాయం జరుగుతుంది, యువర్ ఆనర్, న్యాయం దొరుకుతుంది.” అంటూ మొహం అరిచేతులమధ్య దాచుకొని ఏడుపుని బలవంతముగా ఆపుకొనే  ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె భుజాలు ఉద్వేగంతో ఎగురుతున్నాయి .

అందరు నిశ్శబ్దం గ చూస్తున్నారు. ముందుగా తేరుకుంది జస్టిస్ జయమ్మ, బంట్రోత్ ని పిలిచి ఆమెకి కొంచం మంచినీళ్లు ఇవ్వు,” అని చెప్పి, “వాదనలు అభిప్రాయాలూ విన్న తరువాత , ఇంకా ఈ కేసుని నాన్చడం మంచిదికాదన్న  అభిప్రాయం తో ఫైనల్ హియరింగ్ జులై 28 కి ఉంటుందని ,” ప్రకటిస్తూ, “డిఫెన్స్ లాయర్ , లాయర్ వసుంధర!  ఈ కేసుకి  సంబంధించిన వివరాలు ఇంకా ఏమయినా కోర్ట్ ముందుపెట్టాలనుకుంటే ఈ నెల 20 తారీకు లోపల సమర్పించాల్సివుంటుంది,” అని చెప్పి  కోర్ట్ సమావేశాన్ని డిస్మిస్ చేసి ఆమె తన సీట్లోంచి లేచింది. అందరు కూడా మౌనంగా నిష్క్రమించారు. 

రాజ్యలక్ష్మి మైత్రేయి ని పొదిగి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లింది. ప్రసాద్ మైత్రేయి ని బైక్ మీద ఎక్కించుకొని ఇంటికెళ్ళాడు. 

                                              ******************************

ఇంటికెళ్లగానే మైత్రేయి తలుపులేసుకొని లోపల కూర్చుండి  పోయింది. ప్రసాద్ వారండాలోనే తచ్చాడుతూ ఆమె ఎప్పుడు తలుపు తెరుస్తుందా అని ఎదురుచూస్తు న్నాడు. ఇంతలోకి ఒక ఆటో వచ్చి ఆగింది వాళ్ళ  ఇంటిముందు. ఆటో లోంచి ఒక పెద్దాయన దిగి ఇంటి వైపు విశదంగా చూసి ఆటో కి డబ్బులిచ్చి లోపలకివచ్చాడు. “ 

“బాబు! మైత్రేయి , కాలేజి  లెక్చరర్, ఏ  పోర్షన్ లో ఉంటుంది?” అడిగాడు ప్రసాద్ ని. 

ప్రసాద్ ఆయన్ని కొంచం వింతగా చూస్తూ , మైత్రేయి ఉంటున్న పోర్షన్ చూపించాడు. 

“ అమ్మ మైత్రేయి! నేనమ్మ నాన్నని, తలుపుతీయి,” అంటూ ఎంతో ఆప్యాయతతో పిలిచాడు. 

లోపలనుండి  నాన్న పిలుపు విన్న మైత్రేయి నమ్మలేనట్లు వచ్చి తలుపు తీసి ఎదురుగా నిలుచుని ఉన్న పరంధామయ్య గారిని చూసి  అవ్వాక్కయింది. 

“ ఎమ్మా మైత్రేయి, నాన్న ఎందుకొచ్చాడబ్బా అని ఆశ్చర్యపోతున్నవా తల్లి ,” అంటూ ఆమె తలనిమిరి లోపలకి వెళ్ళాడు. “ నాన్నగారు!” అంటూ మైత్రేయి ఆయనను చుట్టేసింది. 

ఆయన ఎంతో ప్రేమ  తో దగ్గరికి తీసుకున్నాడు. “ఎన్టీరా! లోపల కూర్చొని ఏడుస్తున్నావా? పిచ్చి పిల్ల! ఇప్పటివరకు అంతా ధైర్యం గా కొర్టు  లో మాట్లాడి, సమస్యకి ఎదురునిలిచిన నువ్వు ఇలా బేలగా ఎడవకూడదు. ఇంకా ధైర్యంగాను , నిబ్బరంగాను ఉండాలి. నేను కూడా వచ్చాను కదా, ఇంక దేనికి భయపడొద్దు. నేను ఈ కేసు పూర్తయ్యే వరకు నీకు అండగా ఉంటాను,” అని అన్నాడు. 

 “నాన్నగారు !” అంటూ మాటలు లేని దానిలాగా కళ్ళు  తుడుచుకుంటూ,” మీకు కాఫీ తెస్తాను” అని వంటగది లోకి వెళ్ళింది.

బయట అటు ఇటు తిరుగుతున్న ప్రసాద్ ని చూసి ఆయన,   “బాబు , లోపలకి రా, మైత్రేయి బాగానే ఉన్నది,” అన్నాడు నవ్వుతూ.

ప్రసాద్, “నమస్తే అంకుల్ ! మీ రేంటి  ఇంత సడన్ గా వచ్చారు,” అని అడిగాడు.

“ నేను పొద్దునే వచ్చాను బాబు, మన మైత్రేయి కేసు వాదనలన్నీ విన్నాను. ఆ తరువాత లాయర్ వసుంధరని కలిసి కొన్ని విషయాలు మాట్లాడి అమ్మాయిని చూసిపోదామని వచ్చాను,” అన్నాడు. 

“ చాలా మంచి పని చేశారు అంకుల్ . అస్సలే మైత్రేయి బాధలో ఉన్నది. మిమ్మల్ని చూడగానే కొండంత ధైర్యం వచ్చినట్లుగా ఉన్నది, “ అన్నాడు. 

“ మైత్రేయి గారు , హోటల్ నుండి మీల్స్  తీసుకురాన?” అడిగాడు. 

“ కాఫీ కప్పు అందిస్తూ ,” అయ్యో వద్దండీ , నాన్న గారు హోటల్ మీల్స్ చేయరు. నేనే వంట చేస్తాను, మీరు కూడా ఇక్కడే భోజనం చేయండి ” అన్నది. వెంటనే  మైత్రేయి బాత్రూంలోకెళ్ళి స్నానం చేసి వచ్చి , వంట చేసింది. రసం , దొండకాయ వేపుడు చేసి  భోజనం వడ్డించింది. 

ప్రసాద్ ఆయన పక్కన కూర్చోవటానికి తటపటాయిస్తుంటే  పరంధామయ్య గారే కల్పించుకొని,  “రావయ్యా , పక్కన కూర్చో, భోజనం చేద్దాము,” అన్నాడు చనువుగా. భోజనం చేశాక పరంధమయ్య గారికి ముందుగది లోనే పక్క ఏర్పాటు చేసి తాను దివాన్  కాట్ మీద పడుకుంది. నాన్న  రావడం కాస్త ఆశ్చర్యంగా ఉన్న మనసెంతో తే లికయి నట్లనిపించింది మైత్రేయికి. ఎంతో ధైర్యంగా కూడా అనిపించింది. నాన్న గారు నన్ను అర్ధం చేసుకున్నారు , ఇంకా నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాన్న గా రిని వొప్పించి తాను విడకులకి కూడా అప్లై చేయాలి వసుంధర  తో మాట్లాడి,” అని అనుకొంటూ నిద్దర లోకి ఒరిగి పోయింది ఒకింత నిశ్చింతగా. 

తెల్ల వారగానే పంతులుగారు కూడాగుంటూరు  కి  బయలుదేరుతున్న  పరంధమయ్య గారిని పలకరించి తామందరము మైత్రేయి కి అండగా ఉంటామని మాట  ఇచ్చాడు. 

ఆయన, “ ప్రసాద్, నన్ను బస్ స్టాండ్ దగ్గర దిగబెట్టు, నేను గుంటూర్ వెళ్ళాలి , మళ్ళీ హియరింగ్ రోజున వస్తాను,” అని అడిగాడు. 

బస్ స్టాండ్ లో దిగిన పరంధమయ్య గారు,  “ప్రసాద్, ఇప్పటివరకు నువ్వే మా మైత్రేయి కి చాలా అండగా ఉన్నవని తెలిసింది, నీ రుణం తీర్చుకోలేనిది. అలాగని మా మైత్రేయి మీద నీకున్న స్నేహ భావాన్ని కించపరచలేను. నా నుండి నీకెప్పుడు ఏ సహాయం కావాలన్న మోహమాటపడకు. నువ్వు కూడా నాకు బిడ్డలాంటి  వాడివే. మైత్రేయి ని కాస్త కనిపెట్టి ఉండు,” అంటూ బస్ ఎక్కాడు. 

ఈయన ఇంతలా  మారిపోవటానికి కారణం ఎంటబ్బా అన్న ఆలోచన అయితే ప్రసాద్ కి కలిగింది.  

(ఇంకావుంది) 

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నృత్యం

కాలం చెప్పే నిజం Time ‘s Fact