కాటుక కంటి నీరు

వ్యాసం

ఈరోజు  ముచ్చటలన్నీ  మన తెలుగు భాషాభిమానం గురించే  .  చెప్పుకోడానికి అనేక సంగతులు ఉన్నాయి  .ఎందరో మాతృభాష గొప్పదనం గురించి ఎప్పుడో  ,ఎందరో మరెన్నో సార్లు చెప్పారు   .మన మూ వింటున్నాం  కానీ పాటించడంలో  ఇష్టం , ఓపిక ,ఆసక్తి  అనే విలేక అనే సంగతి  తెలిసినా  , చెప్పడం అలవాటైన వారు ఊరుకోరుగా . నేను ఆ బాపతే అనుకోండి .

ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి  ?అనేది చిక్కు ప్రశ్న . అయినా చీకట్లో బాణం వేస్తున్న .ఏ కొందరికైనా తగలకపోతుందా అనే అత్యాశతో మొదలెట్టా  . ఇందులో స్పృశించిన అంశాలలో ఒక క్రమం గురించి వెతకకండి  . కోతి కొమ్మచ్చి అనుకోండి తప్పులేదు  .బహుశా అదే సరైన మాటేమో కూడా .

భాష  అనేది అతి చిన్న మాట . రెండు అక్షరాల మాట కానీ  ,ఆ రెండక్షరాలలో మర్రి విత్తనంలా  విశ్వమం తా  దాగింది  .నేల నాలుగు చెరుగు ల పా కిం ది  .ఆకాశపుటంచులను  తాకింది ఎందుకంటే భావవ్యక్తీకరణకు పునాది భాష కదా .

ప్రతి మనిషికి తల్లి ఎలా అత్యంత సన్నిహితమో  ఆమె ఒడి అనే బడిలో నేర్చిన పలుకూ అంత సన్నిహితం . అయితే ఆధునిక కాలంలో అమ్మను , అమ్మ భాషను ఒద్దు  అనుకుంటున్నాం  .అసలు గలగల మాట్లాడమంటే ఒక సు హృద్భావ వాతావరణ అని సృష్టించడమే .  ఆ వాతావరణంలో అవసరానికి మించి , ఆడంబరాన్ని జోడించి  ,ఇతర భాషా పదాలను వాడడం నల్లేరుపై బండి నడకంత సులభం  .ఆ వ్యామోహం నుంచి బయటికి రావడానికి మనకు సుతరామూ  ఇష్టం లేదు .

ఎప్పటిది తెలుగు అంటే  ,మన ఊహకందనంత పాతది  .క్రీస్తు శకం 575లో కడప జిల్లా ఎర్రగుడిపాడు లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనం జయుడు తొలి తెలుగు శాసనం వేయించాడు  .

ఎంత చక్కని భాష అండి మన తెలుగు  .గుండ్రంగా ముత్యాల లాంటి అక్షరాలతో ముచ్చటైనది మన లిపి  . కొన్ని సరదా  సంగతులు గుర్తు చేస్తాను  .విసుక్కోక చదవండి  .చదివించండి . ఆపై ఆలోచించండి .

అనే ఏకాక్షర పదం లేదా వాక్యం ఉంది . దీన్ని ఆశ్చర్యంగా  ,ప్రశ్నగా  ,జవాబుగా  ,నీరసంగా , అనుమానంగా  ఇంకా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు .

మొన్ననే ఓ మంచి వాక్యం చదివాను  .మీరూ  చదవండి మరి .  సులువైనది . బరువైనది . గుర్తుపెట్టుకో తగ్గది కూడా. సముద్రమంత లోతైన అర్థమున్న వాక్యం ఇది. భూమ్మీదికి అరువు పై వచ్చాము  , కొంత కాలానికి భూమికి బరువై వెళ్ళిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతకాలి  .

చూడండి . అరువు -బరువు- పరువు ఒక అక్షరం తేడాతో ఎంత సొగసైన వాక్యం సిద్ధమైంది .

మరో చిన్న మాట   .

రెండెడ్ల  బండ్లు అంటే  ,రెండు అర్థాలు

రెండు ఎడ్లు గల బండ్లు

ఎడ్ల బండ్లు రెండు  .

ఎంత అందం ఉంది ఈ భాషలో  .ఇంకోటి ఇది రెండు పదాల ప్రశ్నా ర్ధక  వాక్యం  .

వాడొచ్చాడా ? నేను వివరించక్కర్లేదు .

మీరు పలికే విధాన్ని బట్టి అర్థం మారుతుంది ప్రయత్నించి , చూడండి.

ఇంకో సరదా వాక్యం .

నీ నూనె నా నూనె ని  నేనన్నానా, నీ నూనె నీ నూనె  .నా నూనె నా నూనె  .

నిదానంగా చదవండి ఒకే అక్షరంతో మూడు వాక్యాలు వచ్చాయి  .

ఒకే పదాన్ని సందర్భం బట్టి రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు . బొక్కలో వేస్తాను  .నాకు లక్ష బొక్క వచ్చింది వ్యాపారంలో. బొక్కలు కొట్టే మిషన్ ఉందా ?మొదటి బొక్కకు జైలు , రెండవ బొక్క నష్టం  ,మూడో మొక్కకు పంచింగ్ మిషన్ అని అర్ధాలు వచ్చాయి  .

పులిహోర మనకు ఇష్టమైన వంటకం  .ఇందులో పులి ఎక్కడుంది అని గాబరా పడకండి . ఇక్కడ  పులి అంటే పుల్లని పులిసినఓ గిరం అంటే ఆహారం  .పులిబొంగరాలు అనే మాట గుర్తుకు తెచ్చుకోండి .

వల్ల కాడు పూర్వరూపం ఒ ల్ల కాటు పనికిరాని అడవి . అదే పొల్లకాడై వల్లకాడుగా స్థిరపడింది  .భీమా అనే పదం తీసుకోండి ఇందులోని బీమా అనేది పారసీ పదం .ఆ భాషలోభీమా  అంటే భయం  .జీవితంలో భయాన్ని పోగొట్టే సంస్థ భీమా సంస్థ .

తద్దినంకు చావుకు  సంబంధం లేదు  .దాన్ని విడదీస్తే త త్ + దినం ఆ రోజు అని అసలు అర్థం .

మనం పాకీ  పనిని అసహ్యించుకుంటాం . పవిత్రత  ,శుభ్రత  అని అర్ధం దా నికి  .పాకిస్తాన్ అంటే పవిత్రమైన దేశం అని అర్థం  .

ఒకే పదం రకరకాలుగా వాడుతూ విభిన్నమైన అర్థాలను సాధిస్తాం  .నమ్మట్లేదా ? కింది ఉదాహరణ చూడండి

ఆకు _లోలాకు -విస్తరాకు_ విడాకులు . ఇతర భాషా  పదాలతోను  వేరు వేరు అర్థాలను సాధిస్తున్నాం .

ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకం  .తీరా సమయానికి వాడు హ్యాండ్ ఇచ్చాడు . రెండు హ్యాండ్లూ వేర్వేరు సుమా

తెలుగు జీవద్భాష వాడుకలో ఉంది  .సరిగా వాడకుంటే  నాచుపట్టే స్థితికి దగ్గరగా జరుగుతుంది. వాడక మనం చెడుతున్నాం . ప్రతి భాషలోనూ మార్పులు చేర్పులు సహజం  .పాత అర్థాలు పక్కకు జరిగి  ,కొత్త అర్ధాలను సంతరించుకుంటాయి మనకు తెలుగు వచ్చుఅంటే  సరిపోదు  .మన తర్వాతి  తరాల సంగతి ?

మళ్ళీ తెలుగు మనదే అన్న నిజం అప్పుడప్పుడు గుర్తుకొచ్చి    ,చమత్కారాలతో కూడా జవాబిస్తాం  .

ఏమండీ సుబ్బారావు గారిల్లెక్కడా ?

ఆయనకేం పని ఇల్లెక్కడానికి   .

అర్థం ఉన్నా  లేకున్నా , కొన్ని పదాలు జంటగా వాడితేనే మనకు అర్థమవుతాయి   .ఉదాహరణ

పిల్లా జెల్ల _ఇల్లుగి ల్లు_ నగానట్రా

ధ్వని అనుకరణ శబ్దాలున్నాయి  .అది మరో ముచ్చట .

డ్డా  మ్మని పడ్డాడు .పూలు జలజలా రాలే  .  పకపక నవ్వాడు  .

పద బంధాలు _నానుడులు_ సామెతలు _పొడుపు కథలు -జాతీయాలు -కథలు -కవితలు- నవలలు _కావ్యాలు ఇంత కాలం నుండి అని చెప్పడానికి వీలుకాని రోజు నుంచి కాచిన పాలపై తేరి న మీగడ ఇదంతా . ఆస్వాదించండి . ఆనందించండి మరోమాట అడుగు

దేని గురించి అని  అడగండి  .అదే అడుగు గురించి . అంటే ప్రశ్నించు అని అర్థం  .ఈ పదాన్ని ఎన్నో రకాలుగా వాడతాం. ప్రతి అడుగుకి అర్థం మారుతుంది .

అడుగు అంటే పాదం మూడు అడుగుల నే ల కావాలని వామనుడు బలిని అడిగాడుగా .

అడుగు తీసి అడుగు పెట్టలేనంత జనం వచ్చారు

ప్రయాణం అడుగు ఆమడగా సాగుతుందంటే చాలా కష్టంగా ఉంది అని అర్థం .

బాల్చీలో నీళ్లు అడుగంటాయి  .

రేపు పొద్దున ఆయన అడిగితే ఏం చెప్పను ?

ఇవాళ వాడిని అడిగేయాలి  .

నలుగురిని అడిగి చేయి .

ఒక్కొక్క పదం ఎన్నెన్ని వన్నెలతో మీ జీవితంలో చేరిపోయిందో మీ మనసునే అడగండి .

ఇవన్నీ మాకు తెలిసినవే  . కొత్తదనం ఏమీ లేదు పాత చింతకాయ పచ్చడే గా అంటున్నారా  .నిజమే  .నాకూ  తొలు త అలానే అనిపించింది  .అయినా పాత చింతకాయ పచ్చడి  పధ్యా నికి  పనికొస్తుంది . కొత్త చింతకాయ జలుబు చేస్తుంది .సమస్యలకు  పరిష్కారాలు తెలియక కాదు  .పాటించడం ఇష్టం లేక  , ఓపిక లేక. ఆలా వదిలేస్తే  పీట ముడి  పడిపోతాయి  .

ఈమధ్య సురవరం ప్రతాపరెడ్డి గారి తెలంగాణ వ్యాసాలు అనే పుస్తకం చదివాను . అందులో తెలుగు భాషా సేవ అని ఆలోచనాత్మక వ్యాసం  ఉంది  .అది చదివాక ఇది రాయాలనిపించింది .

దేశాభివృద్ధికి భాషాభివృద్ది ఒక గొప్ప సాధనమని అందరికీ తెలిసిన విషయమే . బెంగాలీ భాషతో సమానముగా మనదేశములో అభివృద్ధి చెందుచున్న రెండవ భాష మహారాష్ట్రము  .మీకే దేశ చరిత్ర కావలసిన ను ఈ భాష యందు దొరకగలదు .ప్రకృతి శాస్త్రవుల అనేకములు వ్రాయించబడినవి ఇట్లు మన ఇరుగుపొరుగు వారు తమ తమ దేశ భాషలను అభివృద్ధి చేసుకొని  ,అవిశ్రాంతముగా స్వార్ధమునందును దృష్టి ఉంచక , పాటుపడుచున్న మన తెలుగు సీమ వారు మాత్రము ఇతర అన్ని విషయములందువలె భాషాభివృద్ది విషయమునను గాఢ నిద్రపోవుచున్నారు .ఇది మిక్కిలి శోచనీయము .”

విద్య రాని  వాడు తోక కొమ్ములు లేని పసరమని మన పెద్దలన్నారు . మాతృభాషనేరుని వాడు  తెలివి లేని పసరమని చెప్పవలెను  .మనకు ఇంగ్లీషు , హిందీ భాషలపై కలవ్యామూహము మన మాతృభాష పై లేదు . పరభాషలన్ని నేర్చిన కులవిద్యకు సాటి లేదు గువ్వలచెన్న అని ఆ మహానుభావుడు ఆనాడే ఉర్దూ హిందీ ఇంగ్లీష్ వెలువలు మనలను ముంచుకొని పోకముందే బోధించి ఉండెను.”

మన ప్రాచీనాంధ్ర వీరుల గాధలను తెలుపు గ్రంథాలు మనము వ్రాయకున్నా , తందాన (జంగం) కథలు చెప్పు పిచ్చిగుంట వారిలో ఆ చరిత్ర లింక నిలిచి ఉన్నవి  .అవి అంతరించక ముందే వాటిని సమకూర్చి  ,ముద్రించ వలెను . సోమనాద్రి  ,రామేశ్వరరావు  ,సదాశివరెడ్డి , తిమ్మరాజు , కుంభం పుల్లారెడ్డి , మెదక్ శంకరమ్మ , కుంభం చెన్నయ్య , సర్వాయి పాపడు మొదలగు  వారి కథలు కొల్లలుగా అనాధృతమై , ఆముద్రిమై  ,విస్తృత పమందు లీనమై పోవుచున్నవి  .మనము మన జంగం కథలను సవరించి  ,సంస్కరించి  ,చారిత్రక పీఠికలతో ముద్రించి  ,ప్రచారం చేయుట అవసరము .”

మనకు ఏ విషయమైనా తెలుసుకొనే  అవసరము కలిగితే  , ఇంగ్లీషు వాంగ్మయాన్ని ఆశ్రయిస్తున్నాము . మన భాషలో వివిధ పరిశోధనలకును , విజ్ఞానానికి పనికి వచ్చు ఉద్ గ్రంథాలను వ్రాయించి ప్రచురింపవలెను .

ఇంగ్లీషు వారికి తమ భాషపై కల అభిమానములో సహస్రాంశము కూడా మనకు లేదు . ప్రతి జాతికిని తన మాతృభాషపై అభిమానం ఉన్నట్లు సర్వత్ర వ్యక్తమైనది  .అరబ్ తన భాష అమృతం అనియు తక్కిన భాషలంతా తన ఒంటె కాలి క్రింది దుమ్ముతో సమానమనియు అంటాడు . ఆర్యులు తమ భాష దేవ భాష అనేది తక్కినవి  భాషలనా గ రికము లు  ,తమదే నాగరిక భాష అన్నారు . ప్రాకృతము విజృంభించిన వాడు సంస్కృతాన్ని  గురించి కూడా  ఈ మాటలే అంటాడు .

మీ మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉన్నాని నాకు తెలుసు . నేను అలాగే అనుకున్నాను  .ఇంకా ఇంకా చాలా అనుకున్నాను . ఎందుకంటే ఈ మాటలు 80 సంవత్సరాల క్రితం చెప్పినవి  .

ఈ మాటలు శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఓరుగల్లు లో చేసిన అధ్యక్షపన్యాసం లోనివి .

                                                                                    ( 28 -12-1944)

ఎలా ఈ సమస్యను పరిష్కరించడం   ?

నాకు తోచిన కొన్ని సూచనలు   .మీ స్వబుద్ధితో మరికొన్నింటిని జోడించి , ప్రయత్నించండి  .మొదటగా మంచి పుస్తకాలు చదవండి  .ప్రముఖుల ప్రవచనాలను వినండి . చాలామంది ప్రవచన కారులు ఆంగ్ల పదాలు వాడకుండా , గంటల తరబడి  ,సులువైన సరళమైన భాషలో విషయాన్ని అందిస్తున్నారు . ఈనాడు పేపర్ చదవండి . అందులో నేను మొదట చదివేది సంపాదకీయాలు  ,హెడ్డింగులు .

రోజు ఓ పది నిమిషాలు ఇంగ్లీషు పదాలు వాడకుండా మాట్లాడే ప్రయత్నం చేయించండి పిల్లలతో  .పాత సినిమాలు చూడకున్నా పర్వాలేదు డైలాగులు వినండి  .కొత్త పదాలు -పదబంధాలు- సామెతలు-నానుడులు -జాతీయాలు తెలుస్తాయి  .మీ పనులను చేసుకుంటూనే ఈ పని చేయవచ్చు .

వివిధ పత్రికల్లో వచ్చే గళ్ళ నుడి కట్టు  సరదాగా    ప్రయత్నించండీ .  చివరగా ప్రస్తుతం వస్తున్న యాంకర్ల (వ్యాఖ్యాతల) మాటలు వినండి  .అయితే ఓ మాట . పై పనులన్నీ కొంతకాలం చేశాక , చివరిది ఆచరించండి  .చూడకండి  .మళ్లీ చెప్తున్నాను . వీళ్ళు గురువులే  .ఎలా పలకవచ్చో , ఎక్కడ ఒత్తులు అవసరమో ,ఎక్కడ అనవసరమో  ,తెలుసుకునే ప్రయత్నాలు చేయండి . .

కాటుక కంటినీరు చనుకట్టు పయిం బడనేల ….   త్రి శుద్ధి గ నమ్ము భారతీ  .తెలుగు సాహిత్యంలో

ఇది పోత నా మాత్యు ని ప్రసిద్ధ చాటువు .తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న  ఆణిముత్యం . ఇందులో శారదా దే వి   కవి కళ్ళముందర దీన వదనంతో ప్రత్యక్షమైంది . చలించి పోయాడు  పోతన . తన జీవితా వసరాలకోసం  అమ్మనమ్మనని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేశాడు .

మన కీనాడున్న   సమస్యలు అలాంటివి కావు . ఆకలి వే ళలు  లేవు . రాజ్యస్థానాల  అదలింపులు , బెదరింపులు కనుచూపు మెరలో లేవు . రావు . ఐనా తెలుగు భాషకు ఈ దుస్థితి ఏల ?

ప్రభుత్వాన్ని నిందించి మన భాధ్యతను వదిలించుకుందామా ?

మనవైపు నుంచి నిశ్శబ్దం సబబేన ?

మన నరనరాల్లో ,అణువు అణువున జీర్ణించిన జాతి సంపదను చేతు లా రా జా రవిడుచుకుందామ  ?

కొంతకాలానికి తరు వాతి తరా లు  తెలుగు గొప్పదనాన్ని ఇ తర దేశీయుల ద్వారణో  ,పర భాశీయుల ద్వారానో  తెలుసుకుని  మనల్ని క్ష మి స్తారా

మనమేం చేద్దాం

ఆలోచించండి .

తెలుగు భాష గొప్పదని మనం కొత్తగా చెప్పనక్కరలేదు  .వెనకటి వారెందరో ఎప్పుడో చెప్పేశారు .ఆ భాష గొప్పదనాన్ని తెలుసుకోండి  .తర్వాత తరాలకు దాని మీద ఆసక్తి కలిగేలా ప్రోత్సహించండి . ఇప్పటి తల్లిదండ్రులు మీకు ఆసక్తి కలిగితే  ,తప్పనిసరిగా అది మీ పిల్లలలో ప్రతిఫలిస్తుంది . చదవడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మన భాషా జ్ఞానం పెరుగుతుంది . వేగంగా చదవడం అలవాటు అవుతుంది  .మన ఆలోచన పరిధి విస్తరిస్తుంది .

మన మనసులోని భావాలను ఇతరులకు అందించడానికి ఇతరులు చెప్పిందాన్ని గ్రహించడమే భాషకు పరమావధి . అది చేతగానప్పుడు తెలుగువారు అని చెప్పుకోవడం సమంజసమేనా ?నాకు జవాబు అవసరం లేదు మీ మనసును మీరే ప్రశ్నించండి  .సమాధానం మీకే తెలుస్తుంది .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు -25 వ భాగం

వందేమాతరం!