“దారిపట్టిన న్యాయం”

కథ

నాగమణి స్కూల్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యింది ఈ మధ్యనే.
పిల్లలిద్దరికీ పెళ్లి చేసి అత్తవారింటికి పంపించింది.
కాస్త వీలు చిక్కిందని స్నేహితురాలు ప్రమీలను చూడడానికి మచిలీపట్నం వెళ్ళింది.
“నాగమణిని చూడగానే రారా ఎంత కాలానికి వచ్చావు. ఇప్పుడు తీరిక దొరికింది అన్నమాట అంటూ లోపలికి తీసుకుని వెళ్లి మంచినీళ్లు కాఫీలతో మర్యాదలు చేసి ముచ్చట్లు ప్రారంభించింది.
“, స్నేహితురాలిద్దరూ చాలా కాలం తర్వాత కలుసుకున్నందుకు కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఇంతలో పదేళ్ల మనవరాలు వచ్చి అమ్మమ్మ నాకు పండక్కి అమ్మ డ్రెస్ కొనిచ్చింది చూడమంటూ చూపించింది.
“ఆ డ్రెస్సు ఆ పిల్లకి వేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకొంది ప్రమీల.
మోకాళ్ల పైకి ఉన్న నిక్కర్ లాగా ఉంది దానిపైన చేతులు లేని జాకెట్టు.
ఎదిగి వస్తున్న ఆడపిల్ల ఇలాంటి బట్టలు వేసుకుంటే బయట ప్రపంచం చూసేవాళ్ళు ఏమనుకుంటారు.
“, చక్కగా గౌను తీసుకోక పోయావా లేకపోతే లంగా జాకెట్ అయితే బాగుండేది నీకు ఇలాంటి డ్రెస్సులు మీ అమ్మ ఎందుకు కొంటుందో నాకు తెలియడం లేదు. ఇలాంటివి వేసుకొని బజారుకెళ్తే ఎలా ఉంటుందో చెప్పు నువ్వే అన్నది ప్రమీల.
ఇది వద్దంటే అమ్మ కావాలనే తీసుకున్నది. నాకు ఈ డ్రెస్ నచ్చలేదమ్మ నువ్వేనా అమ్మకు చెప్పు అని తల్లి మీద ఫిర్యాదు చేసింది.
“ఏమిటో ఈ కాలం పిల్లలు. వాళ్లకి తెలియదు ఒకరు చెబితే వినరు.
బయట ప్రపంచం ఎలా ఉందో చూస్తూ ఉన్నాంగా. అర్థనగ్నంగా బట్టలు వేసుకుని తిరుగుతుంటే మగ పిల్లలు కామెంట్స్ ఎలా చేస్తున్నారో.
“ప్రమీల కూతురు పల్లవి అక్కడికి వచ్చింది.
“నాగమణి పల్లవిని చూసి ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ పలకరించింది.
“నా గురించి అమ్మ మీకు చెప్పలేదా! నేను పిల్లలుని తీసుకుని వచ్చేసాను. ఉద్యోగం కూడా చేస్తున్నాను.
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు దాకా దారితీసింది. అమ్మకి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. నా అత్తవారింటికి వెళ్ళమంటుంది. ఆయనకి నాకు సరిపడటం లేదు. అలాంటప్పుడు ఎలా వెళ్తాను మీరైనా చెప్పండి ఆంటీ అన్నది ప్రమీల కూతురు.
“కూతురు పిల్లలు లోపలికి వెళ్ళాక ఇది నా కూతురు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. భర్తతో గొడవపడి ఇంటికి వచ్చేసింది.
అతను చాలా మంచివాడు.
“అలాంటప్పుడు ఎందుకు వచ్చింది. సర్ది చెప్పి పంపలేకపోయావా!
“అన్ని విధాల చెప్పి చూశాను. అయినా లాభం లేదు. విడాకులు ఇస్తానంటున్నది.
నువ్వైనా కాస్త చెప్పు మారుతుందేమో.
రాత్రి భోజనాలైనాయి. పిల్లలిద్దరూ సెల్ఫోన్ చూస్తూ కూర్చున్నారు. రాత్రి పది గంటల వరకు ఫోన్ పట్టుకుని చూడకపోతే చదువుకోకూడదా అంటూ ప్రమీల అరిచింది. పిల్లల్ని ఇప్పటినుంచి క్రమశిక్షణతో పెంచకపోతే పెద్దయ్యాక మన మాట అసలే వినరు.
పల్లవికి నచ్చ చెప్పాలని చూసింది నాగమణి. రెండు రోజులు ప్రమీలతో హాయిగా గడపాలని వచ్చింది. స్నేహితురాలికి వచ్చిన సమస్య మనసును తొలచి వేస్తున్నది. ఈ వయసులో పిల్లలు సమస్య గా మిగిలిపోతే ఎలా?
“నాగమణి వెళ్ళబోయే ముందు పల్లవిని కలిసింది. ఏమీ అనుకోకపోతే ఒకటి అడుగుతాను చెప్తావా! అన్నది.
అడగండి ఆంటీ. మీరు అమ్మకి మంచి ఫ్రెండ్. మీరు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఏం అడగదలుచుకున్నారు అడగండి అన్నది.
“, పిల్లల్ని తీసుకుని అమ్మ దగ్గరకు వచ్చేసావు. భర్తకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావుట ఎందుకు?
ఎందుకే మున్నది. ఈనాటి సమాజం ఎలా ఉన్నదో మీరు చూస్తున్నారు కదా. పిల్లల్ని పెద్దపెద్ద కాన్వెంట్లలో చదవాలంటే డబ్బు కావాలి. ఆయన చేసే ఉద్యోగం చిన్నది. డబ్బు వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించడం లేదు. పిల్లల్ని చిన్నచిన్న కాన్వెంట్లలో చదివిస్తున్నారు. కాలంతో మనము పోటీ పడాలి. మన పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలి. అందుకే నేను ఆఫీసులో అధిక సంపాదన చేయడంలో తప్పులేదు. పని పూర్తి చేశాక వాళ్ళిచ్చే డబ్బు తీసుకోమంటున్నాను. ఆయనకు అలా లంచం తీసుకోవడం ఇష్టం లేదు. అవకాశం ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించాలి. వాళ్ల కోసమే ఆ పని చేయమన్నాను. ఇది తప్పేలా అవుతుంది మీరే చెప్పండి అన్నది పల్లవి.
“నాగమణి నిర్గాంత పోయింది. భర్త ఎక్కడైనా తప్పు చేస్తుంటే భార్య వద్దని వారించాలి. అలాంటిది భర్తని తప్పు చేయడానికి ప్రోత్సహిస్తున్నది. అధిక రాబడి కోసం లంచాలు తీసుకోవడం నేరం. ఇవ్వడం కూడా నేరమే.
“నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ పల్లవి.ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించావా! నీ భర్తని నువ్వే అడ్డదారి తొక్క మని ప్రోత్సహిస్తున్నావు. ఇవాళ పిల్లల చదువు రేపు కారు కొనాలి ఇల్లు కొనాలి వాటి కోసం కూడా ఇలాగే లంచాలు తీసుకోమంటావు. పట్టుపడితే ఏమవుతుందో తెలుసా! ఉన్న ఉద్యోగం కూడా పోయి జైలు పాలు కావాల్సి వస్తుంది. అయినా ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది.
“ఎంతకాలం చాలీచాలని సంపాదనతో బతకమంటారు. నేను ఉద్యోగం చేసి నా పిల్లల్ని బ్రతికించుకుంటాను.
డబ్బు సంపాదించడం లేదని పిల్లలకు తండ్రిని దూరం చేస్తావా?
ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా. ఇవాళ నీకు చిన్నపిల్లలుగా కనిపించవచ్చు. పదేళ్లు పోయాక వాళ్లు ఎలా మారిపోతారో నువ్వు ఊహించగలవా. ఆడపిల్ల కి ఇప్పటినుంచి చాలీచాలని బట్టలు సెలక్షన్ చేశావు. సెల్ఫోన్ చూస్తుంటే ఇది తప్పు అని చెప్పలేకపోయావు.
నీ కొడుకు పెద్దయ్యాక నీ మాట వింటాడని అనుకుంటున్నావా. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ మీద తిరగబడతాడు. చెడు వ్యసనాలుకు బానిస అవుతాడు. తల్లి తండ్రి విడిపోయాక వాళ్లకు మరింత స్వేచ్ఛ దొరుకుతుంది.
వాళ్లని మొక్కనుంచే వంచుకొని రావాలి. తల్లిదండ్రులు అదుపు ఆజ్ఞాలతో పెంచాలి. వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు నీ భర్త నుంచి వచ్చేసావు. నీకు ఇప్పుడు తెలియటం లేదు.
నా మాట విని విడాకులు మానుకో. పిల్లలకి తండ్రిని దూరం చేయకు అని చెప్పి చూసింది నాగమణి.
“మా అమ్మ రోజు ఇలాగే చెప్పి నన్ను విసిగిస్తున్నది. మీరు కూడా ఇదే మాట చెప్తున్నారా ఆంటీ. ఏమైనా సరే నేను అక్కడికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. ఉద్యోగం చేసుకొని నా కాళ్ళ మీద నేను బ్రతకగలను.
“సరే నీ ఇష్టం. నేను చెప్పాలనుకున్న చెప్పాను. మరొకసారి ఆలోచించు. కుటుంబం కలిసిమెలిసి ఉంటేనే అందరికీ గౌరవం. ఒక్కొక్కరు విడిపోతే పిల్లలు కూడా దారి తప్పుతారు. అది నీకు ఇష్టమేనా!
నాగమణి మాటలు పల్లవి చెవికి ఎక్కలేదు.
పల్లవి కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నది. కాలం పదేళ్లు ముందుకు సాగిపోయింది.
పల్లవి భర్త వెంకటరమణ ఆఫీసులో నిజాయితీగా వర్క్ చేయటం వల్ల ప్రమోషన్ వచ్చి మంచి హోదాలో ఉన్నాడు.
అతని మంచితనమే అతన్ని కాపాడింది.
పల్లవి పిల్లలిద్దరూ డిగ్రీ పూర్తి చేశారు. కొడుకు ఈమధ్య మత్తుమందుకు బానిసై డ్రగ్స్ అమ్ముతున్న కేసులో పట్టుపడ్డాడు.
కూతురు పబ్బులు క్లబ్బులు అంటూ బాయ్ ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకొని వెళ్ళి పోయింది.
పల్లవి ఇలా జరుగుతుంది అని అనుకో లేదు.
“ఇప్పటికైనా కళ్ళు తెరుస్తావా. పిల్లలిద్దరూ అడ్డదారి తొక్కారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నీకు ఇవే మీ పట్టినట్టు లేదు. ఇదేదో ఫ్యాషన్ అనుకుంటున్నావు. ఇలా ఆడపిల్లను పెంచడం తప్పని తెలియడం లేదా! పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలి. నీ కొడుకు చూస్తే జైల్లో కూర్చున్నాడు.
ఒక తల్లిగా నీవు చేయవలసిన పని ఇదేనా? ఇప్పటికైనా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టు లేకపోతే మరింత బ్రష్టు పట్టి పోతారు అంటూ పల్లవికి తల్లి ఎంతగానో చెప్పి చూసింది.
జరగవలసినంత జరిగిపోయింది. కొడుకు జైల్లో కూర్చున్నాడు. ఇటు కాలేజీలోనూ ఇటు బయట ప్రపంచంలోనే పల్లవి తలెత్తుకొని తిరగలేకపోతున్నది.
“నేను తప్పు చేశానా? పిల్లల్ని సరిగా పెంచలేకపోయానా. ఇంటిని సరిదిద్దాల్సిన ఆడదాన్ని ఆ ఇంటినే వదిలేసి ఇచ్చాను. చాలా తప్పు చేశాను. ఈ రోజుల్లో ఇది ఒక ఫ్యాషన్ అనుకున్నాను. ఆడపిల్ల అర్ధ నగ్నంగా బయటికి తిరుగుతుంటే ఇది తప్పు అని చెప్పలేకపోయాను. స్వేచ్ఛనిచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది అని బాధపడింది.
ఆరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కాలేజీలో. మహిళలందరూ తమ పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేశారని వాళ్ళు ఎలాంటి ఉన్నత స్థానంలో ఉన్నారని ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు. పల్లవి వంతు వచ్చింది. కాలేజీ విద్యార్థిని విద్యార్థుల వైపు ఒకసారి చూసింది.
ఒక మహిళాగా నేను చాలా పొరపాటు చేశాను. ఒక మహిళను. ఇంటికి దీపం ఇల్లాలుగా ఉండాల్సిన దాన్ని ఆడంబరాల కోసం పై అంతస్తుకు ఎదిగి పిల్లల్ని ఉన్నత స్థానంలో చూడాలని ఎన్నో కలలు కన్నాను. ఫలితంగా భర్త నుంచి విడిపోయాను. పిల్లలు ఇద్దరు తప్పుదారి పట్టారు. నా పెంపకం లోటు వలనే చేజేతులారా నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నేను చేసిన తప్పు మీరు ఎవ్వరు చేయకూదడు. ఇలా మీకు ఎవ్వరికి జరగకూడదు.
మహిళా ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ అవినీతిపరురాలు కాకూడదు.
మీ ఆడపిల్లలందరూ చక్కగా చదువుకొని క్రమశిక్షణలో పెరిగి మంచి విద్యావంతులుగా ఉద్యోగవంతులుగా మెలగాలని ఆశిస్తున్నాను అంటూ సెలవు తీసుకుంది పల్లవి.
ఆరోజు ఆదివారం అని తెలుసు. వెంకటరమణ ఇంట్లోనే ఉన్నారు. సూట్ కేస్ చేత పట్టుకొని ఇంట్లో కడుగు పెట్టింది పల్లవి.
ఆశ్చర్యంగా చూశాడు భర్త.
సారీ రమణ, నేను పొరపాటు చేశాను. నా పిల్లల్ని కూడా సరిగా పెంచలేకపోయాను. నేను అనుకున్నది వేరు, చివరికి జరిగింది వేరు. నీ మంచి తనాన్ని అలుసుగా తీసుకున్నాను, అదే నేను చేసిన తప్పు. ఈ రోజుల్లో సోసైటీలో యూత్ చేస్తున్న పొరపాట్లు పసికట్టలేకపోయాను. “నేను ఏమైనావాళ్ళకి నేర్పించానా”? ఒక మహిళా గా నేను చేయవలసినది కాదు అన్నది.
నీ నిజాయితీ మిమ్మల్ని గెలిపించింది.
“నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని తెలుసు. పిల్లలు మన పెంపకమే కాదు సమాజాన్ని చూసి కూడా నేర్చుకుంటారు. నీలో మార్పు వచ్చినట్లే వాళ్లు కూడా ఏదో ఒక రోజు మారుతారు. నాకు నీ పట్ల ఎటువంటి కోపం లేదు అన్నాడు వెంకటరమణ.
వెంకటరమణ భార్య చేసిన తప్పుని క్షమించటం కాదు సరిదిద్దాలనుకున్నాడు.
జైల్లో ఉన్న కొడుకుని విడిపించి తీసుకువచ్చారు. కూతురు, భర్త మోసం చేశాడని తిరిగి వచ్చింది.
తప్పులు అందరూ చేస్తారు వాటిని సరిదిద్దుకోవటంలోనే మానవత్వం ఉంటుంది.
“ఒకసారి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాక పశ్చాత్తాపమే మిగిలేది.
“నేటి మహిళ అంటే కుటుంబంతో పాటు సమాజాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తుంది. అందర్నీ క్షేమంగా చూసుకుంటుంది. అలాగే తన భర్త పిల్లలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.
ఇదే పల్లవిలో వచ్చిన మార్పు.
“తిరిగి మళ్లీ ఆ కుటుంబం అంతా ఒక్కటైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ మహిళా! నిరూపించుకో

“చరమాంకపుస్నేహాలయం”