
“అలా దిష్టిబొమ్మల గుమ్మంలో కూర్చో కపోతేపొలిమేరల్లో తిరిగిఆగాకరకాయలో,పెసరకాయలో
ఏరుకురావచ్చుగా”.. కాలక్షేపం అవుతుందికడుపు నిండుతుంది,విసురుగా అంటోందికోడలు విమల.
“ అవునమ్మా !! ఆయనొక దిశ్టిబొమ్మ ,నేనొక దీపపుసెమ్మె ,తిని అరక్కఇంట్లోతీరికగా కూర్చు న్నారుగా!
“మరి,అరగాలంటేఅలా తిరిగిరావాలి అంటోందిగున్నమ్మ”..
ఓయబ్బో !పౌరుషానికిఏమి తక్కు వ లేదు.. పిల్లలకు ఆగాకరకాయలంటేఇష్టం..
ఆ తాటిపెండెలలో దొరుకుతాయి .24 గంటలు వీధిగుమ్మంలో ఆ అరుగు మీద పడిఅలా దొర్లకపోతేఅలా,
కాలారా తిరిగిరావొచ్చు కదా1 అన్నా ను. అదితప్పేనా?తీరిగ్గా కూర్చో బెట్టితిండిపెట్టడానికితప్ప
ఒక్క మాట అనేహక్కు కూడా మాకు లేదు…అనవలసిన మాటలు అంటూ,అర్ధాంతరంగా వచ్చి న సిరితో
అదిరిపోతోందివిమల..“ధనం దర్పా న్ని తీసుకొస్తుంది“అనుకున్నా ను గానీ ఇలా దయ జాలి లేకుండా,
మనుషుల్ని మార్చేసి మానవత్వం లేకుండా , మంచి చెడు విచక్షణ లేకుండా మదమెక్కి తిరిగేలా చేస్తుందని
కలలోకూడా అనుకోలేదు.అనుకున్నా రు ఈ సంభాషణ అంతా వింటున్న విమల మామగారువిశ్వనాధం గారు.
“కండువా దులిపిభుజాన వేసుకుని ఆగాకర కాయలుతేడానికి, అన్నంరాజు వారితోటవైపు బయలుదేరారు..
కర్రఊత పట్టుకుని నడుస్తున్నా రు, గానీ కన్నీ టితెరలడ్డుకొని తోవకూడా కనబడనివ్వడంలేదు..
“ఇంత బతుకు బతికి ఇంటివెనక చచ్చి నట్లు, అయ్యి ందితన పరిస్థితి”…
ఒక మూడు ।సంవత్సరాల క్రిం్రిదట వరకూ ,తను పేరుపడిన పెద్దఅకౌంటెంట్ . అకౌంట్స్ లో తన సాయం
కావాలని చెప్పమని వచ్చి న వారికిఇంట్లో పెట్టుకుని మరీబోధించేవాడు..తనకు అంత పట్టు ఉండేఅకౌంట్స్ లో.
తను సంపాదించినంత కాలం ఇల్లు నిత్య కళ్యా ణం, పచ్చ తోరణం గా ఉండేది.
తన భార్యగున్నమ్మ కూడా లక్ష్మీ దేవిలా కళకళలాడుతూ ఉండేది…” పూచిన తంగేడులా” ఉండేది.
ఆ పుణ్యా త్ము రాలు నిజంగా తనవలనేనేడు “దీపపు సెమ్మెలాగే” మిగిలింది.. తను ఇంటికి“దిష్టిబొమ్మలా”
మారిపోయాడు ఈ ఇంటిదీపం.. నా కంటివెలుగు.. కాంతులీనుతూ పక్రాశించి, వెలుగులు వేదజిమ్మే పున్నమి
రాత్రి లా ఉండేది..,మరిఇప్పు డు? కాయలు పండ్లు కొమ్మలు రెమ్మలు అన్ని అందరికీపంచి శిశిరంలో ఆకు
రాల్చి న చెట్టులా, ఎండిపోయిన మోడులా, మిగిలింది.. తన వల్లనే.. కేవలం తన వల్లనేఅనుకున్నా డు
విశ్వనాధం..
తను మాత్రం బాగున్నా డా? తనవాళ్లేసర్వస్వం అనుకొని, అంధ ప్రేమతోధృతరాష్ట్రవ్యా మోహంతో ,
సర్వం అర్పించి , చిగురులేని మొడులా , శిధిలమైన గూడులా మిగిలాడు..
“దాయాదులు పరాయివాళ్ళు మోసం చేస్తారని, అన్యా యంచేస్తారని తనకుతెలుసు. గానీ!
కడుపులో పుట్టిన పిల్లలే , కన్న వాళ్ళని ఇలామోసం చేస్తారని, అదీనమ్మి ంచి మోసం చేస్తారని,
జీవితంలో తెల్సు కోలేకపోయాడు…
.”అందరిలెక్కలు అంతా కచ్చి తంగా వేసేతనం తన లెక్కలో తప్పు టడికివేసాడు”..నీ పరాయి వాళ్ళచేతుల్లో
మోసపోయిన మోసపోయిన బాధ , మర్చిపోగలం..
కానీ తన వాళ్లేతనని మోసం చేసారు అన్న విషయం తలపుల్లో వచ్చి నప్పు డల్లా దహించి వేస్తూనే ఉంటుంది..
రిటైర్మెంట్ రోజు పిల్లలుచేసిన హడావిడిచూసిఈ పప్రంచంలో తన అంత అదృష్టవంతుడులేడని
మురిసిపోయాడు..ఉద్యోగం చేసినంతకాలం ఎంతో వైభవంగా బతికాడు!.ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ పెన్షన్ ఉండదు.
అంత పెద్దఉద్యోగం చేసిన బిఎఫ్ వాడిచ్చి న 1500 పింఛను. అయితేనేం ? రిటైర్మెంట్ వలన
వచ్చి న,డబ్బు తో,హాయిగా జీవితం గడిచిపోతుందనుకున్నా డు.ఈ విశ్రాంతి సమయంలో ధర్మబద్ధంగా ,పశ్రాంతంగా
జీవించాలని, పదిమందికిసాయపడాలని కలలుకన్నాడు. బాధ్యతల వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాడు.
ఇప్పు డు భార్యకోరికతో తీర్థయాతల్రు చేయాలనుకున్నా డు..
పిల్లపాపలతో చల్లగా సంతోషంగా గడపాలని అనుకున్నా డు ఎన్ని కలలు కన్నా డు?…
తన కలలన్నీ కల్లలయ్యా యి.. సంవత్సరం కాకుండా కోరికలన్నీ సజీవ సమాధిఅయ్యా యి..
రిటైర్ అయిన మూడేళ్లకే తన భార్య ముసలి ముత్తయిదువుగా మూసి వాయనము అందుకుంటుంటే,
నవనాడులు క్రుంగిపోయిన తను కర్రఊతపట్టుకుని కాలక్షేపం చేస్తున్నా డు..
ఇదంతా తన స్వయంకృత అపరాధం………………..
“ నాన్నా ! ప్రాణంమీదికివచ్చి ంది.అవసరానికిఆఫీసుడబ్బు వాడాను,అరెస్టు చేస్తారేమో? భయంగా ఉంది
అర్జంటుగా !నువ్వు సర్దకుపోతేనన్ను ఆదుకునేవారు లేరు. బేంకు వాళ్లిచ్చిన వడ్డీ డబ్బులు నేనే ఇస్తానని
పెద్దకొడుకు పాతికలక్షలు తీసుకున్నా డు..వ్యా పారంలో నష్టమొచ్చి ంది.ఇరవైలక్షలు ఇస్తే,,
బేంకువాల్లకంటే వడ్డీ ఎక్కువ ఇస్తానని మిగతాది తీసుకున్నాడు చిన్నకొడుకు..
పిల్లపెళ్లిచేయాలి నాన్నా !అని కూతురు అవసరానికిదాచుకున్నపదిలక్షలు తీసుకున్నాది..
భార్య పేరుని కొంత దాచాలన్న ఆలోచన కూడా తనకు రాలేదు.. ఆమెఅంటూనేఉందిబంగారము భాగ్యము ఏదో
ఒకటిమన దగ్గర ఉండకపోతే భవిష్యత్తు కష్టమవుతుంది ఆలోచించండి అని.
తనే మూర్ఖునిలా ఆమెమాట పెడచెవినిపెట్టాడు .
మన పిల్లలకు మనం చూడకపోతేఅవసరాలు ఎవరో ఆదుకుంటారు అన్నా డు.. మాకు ఇవ్వడం అమ్మకిఇష్టం
లేదు అసలే పెళ్లి అయినా ఇలా మాట్లాడుతుందా అని పిల్లలు ఆమెను ఆడిపోసుకున్నా రు. తన వలన పిల్లలదే
రామ చెడ్డఅయింది.. తను ఆనక చెడ్డపేరు మాత్రమే మిగిల్చా డు.
సంవత్సరము వరకూ వడ్డీఅప్పు డప్పు డు ఇచ్చి యిచ్చి ఆపైమీ భారమంతా ,మాదేకదా ?
మీకు ఖర్చేమిటని వడ్డీకూడా ఇవ్వడం ఆపేసారు పిల్లలు..అసలు సంగతి ఆలోచించలేదు కూడా..;
కోడళ్ళు .మీకు పెద్దకొడుకు కోడలు అంటేఇష్టమని చిన్నవాళ్లు, . మీకు చిన్న కొడుకు భార్య అంటేఇష్టమని
పెద్దవాళ్లు ,దెప్పడం మొదలుపెట్టారు.వారిసాధింపులతో పాటు ,.తము శక్తిఉన్నంతవరకూ చాకిరీచేయాలని
నిర్ణయించారు ,,కూతురు అంతా కొడుకులకు ఇచ్చేసారు . అవసరానికిమనమా అని అంటున్నా రు
,మీఅల్లుడుఅంది..వైద్యకోసం వారింటికెల్తే !ఇప్పు డు తమ పరిస్థితి అద్వా న్నం అల్లోచిస్తూ నడుస్తున్న
విశ్వనాధంగారు. ..ఒక కారు అత్యంత వేగంగా తన నా పక్కనుండేదూసుకుపోవడంతో ఆ కంగారులో తూలి
తుప్పల్లో పడిపోయారు.. వెళ్లినంత వేగంగా వెనక్కి వచ్చిందా కారు..
డ్రైవర్ వచ్చి రోడ్డుమీదనడుస్తున్నప్పు డు చూసుకోనక్కర్లేదా ? నేనుతప్పించాను, కాబట్టిసరిపోయింది.
లేకపోతేనా కారు కిందపడిపోయి నన్ను జైలుపాలు చేసేవాడివి, అనివిసుకుంటూనేలేపాడు.
.ఇదంతా చూసిన కారులోఉన్న వ్యక్తివచ్చి ,విశ్వనాథంగారిని చూస్తూ నేవిస్తుపోయాడు..
క్షమించండిగురువుగారూ,. నేను మీపత్రాప్ ని . మీరేనా ?నేను మీ దగ్గరికేవస్తున్నా ను.
నేను ఇప్పు డు హైదరాబాదులోచార్టర్ అకౌంటెంట్ గా స్థిరపడ్డాను..
మీ దగ్గర అకౌంటింగ్ నేర్చు కున్న నేను, పట్టుదలతో సి.ఎ..చేసిఈ స్థితికిచేరాను…కాలేజీ పెట్టాను.
నాకూతురుపెళ్లికివచ్చి న మన సుదర్శన్ ,మీరు ఈ ఊర్లోఉంటున్నా రు రిటైర్ అయిపోయారు అని
చెప్పాడు….వాళ్లచెల్లెలు ఈ ఊరిలో ఉంటుందిట కదా! మీ పరిస్థితి మొత్తం అంతా చెప్పా డు..
రండికార్లోకూర్చు ని మాట్లాడుకుందాం అని,కార్లకూర్చో బెట్టి,,తనేఫస్ట్ ఎయిడ్ చేసి, సేద తీర్చా క,
మంచినీళ్లు ,బిస్కెట్లుఇచ్చి ,,డ్రిం్రిక్ ఇచ్చి సేద తీశాడు .
.మేమిద్దరం ఈ చెట్టు కూర్చు ని మాట్లాడుకుంటాం..నువ్వు అక్కడ ఎవరిరైనా అడిగి,వారితో పాటు వెళ్ళు
.వాళ్ళింట్లో మాస్టర్ ఇలా పడిపోయారనిదెబ్బలు తగిలాయని చెప్పు ..నువ్వు డ్రైవర్ అని చెప్పకు.. కారు దూరంగా ఆపి అమ్మగారిని కార్ల తీసుకురా అన్నా డు పత్రాప్..
అలాగేసార్ అని వెళ్లాడు ఆ యువకుడు…వద్దు నాయనా! తను చాలా కంగారు పడుతుంది..
నా మాట విను నేను వెళ్ళి పోతాను ఇంటికిఅన్న మాస్టారుతో..మాస్టారు. మిమ్మల్ని అమ్మగారిని తీసుకెళ్ళి
నాతో పాటు ఉంచుకుందామని నేను వచ్చా ను.ఇదినేను మీకు ఉపకారం చేస్తున్నట్టు కాదు నా పరిస్థితులు బట్టి
మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా ను.. భగవంతుని దయవల్లమీరుపడిపోవడంకూడా మేలేజరిగింది.
మీ వాళ్ళు ఎవరైనా వస్తే, కొన్నా ళ్ళు వైద్యం చేయించి పంపుతాననిచెప్తాను..
నా భార్య తల్లిదండ్రులు ఇద్దరు యాక్సిడెంట్ లో పోవడంతో నా భార్య మంచం పట్టిందిబెంగతో..
డాక్టర్లు తనను ప్రేమగా చూసుకునేపెద్దవాళ్ళు ఉంటేకోలుకుంటుందిఅన్నా రు. మా అమ్మ కూడా ఆరు నెలల క్రితం
చనిపోయింది.. నా శ్రేయ్రే స్సు కోరేవారు నాకు మీరు అమ్మగారు తప్ప ఎవరూ లేరు. అందుకేఅభ్యర్థించడానికి
వచ్చా ను అన్నా డు చేతులు పట్టుకుని.. భగవంతుడేపత్రాపను పంపాడేమో అనుకుని తండ్రిని్రి లీలలు
అనుకున్నా డు విశ్వం . నా పిల్లలు కూడా చిన్నవాళ్లు. మీరు నాకు సలహాదారుగా కూడా ఉండొచ్చు .
నా ఇంటిపక్కనేఒక చిన్న ఇల్లు పెద్దవాళ్లకోసం కట్టించాను. అందులో మీరు హాయిగా ఉండొచ్చు నా మాట
కాదంటేనాపైఒట్టేఅని పత్రాప్ పట్టుపట్టాడు. అన్ని ఆలోచించేసరేనన్నా రువిశ్వంగారు.
……………………………………….
వీధిలో మంచం పైఒడియాలు ఎండపెడుతున్న గున్నమ్మ , పక్కింటి పంతులుగారిఅబ్బా యి పరిగెత్తుకుంటూ
వచ్చి , అత్తయ్యా , మామయ్యగారు పొలం దగ్గర కారు గుద్దితేపడిపోయారట.మిమ్మల్ని తీసుకురమ్మని అదిగో
కారు పంపారు అర్జెంటుగా రండిఅని చెప్పా డు..
అయ్యో , భగవంతుడా! ఏమైందని ,?నీరసంగా ఉన్నా రు వెళ్ళొ ద్దనేఅంటున్నా ను .పౌరుషం పడివెళ్లారు.
ఏం జరిగిందయ్యా ? అని ఏడుస్తూ ,నెత్తి కొట్టుకుంటున్నా రు గున్నమ్మ.,
సీరియస్ గా సీరియల్ చూసుకుంటున్న కోడలు విమల వచ్చి ., మీరు ఎక్కు వ మాట్లాడకండి.. ఈ సోదంతా
చెప్పకండి?.. యాక్సిడెంట్ అంటున్నా రు. పోలీసులు కేసులు. నాకు అసలే ఒంట్లో బాగాలేదు.
నాలుగు అడుగులు కూడా వేయలేను.. మీ కొడుకు ఊర్లోలేడు.నా కొడుకుచిన్నవాడు. పోలీసులు చూస్తే
బాడీభవిష్యత్తు పాడైపోతుంది.. ఆ కార్లో మీరెల్లి ,ఆ డ్రైవర్ ఇదేతప్పని, నెత్తి నోరుమొత్తుకుఅక్కడ ఏడవండి.
బాగా డబ్బు లగుంజండి..ఆసుపత్రి ఖర్చు వారినేభరించమనండి.. మీకొడుకులకు ఫోన్లు చేయకండి…
నేను మీ చిన్న కొడుక్కి కోడలికిఫోన్ కూడా చేస్తాను..మీ అబ్బా యి వచ్చా క, మీరు ఫోను ఎక్కడున్నా రో నాకు చెప్తే
వస్తాము. .మీ ఆయనకు ఎలా ఉన్నా మీరు ఇక్కడికేరావాలి . జాగత్ర్తా! నేను పంపినట్లు ఎవరితోనైనా
చెప్పవద్దు.అని దుర్మా ర్గంగా హెచ్చరించింది..కనీసం గదిలోంచి బయటకు కూడా రాకుండా.విమల….
ఏమీ చేయలేని,అసక్త తో, అసహ్యంగాకోడల్ని చూసి, ఆయనకేమీ కాదమ్మా !నువ్వు భయపడకు..
బాగున్నా లేకపోయినా మేము తిరిగిఇక్కడికిరాము. ఇకపైమీకు ఎవరికీభారం కాదల్చు కోలేదు..
భగవంతుని నమ్ము కుని, మా బతుకేదోమేము ఎలాగోలా బతికేస్తాం. . నీ పేరు చెప్పను.
సరికదా! మీరందరూ ఉన్నా రన్న విషయంకూడా మరిచిపోతాము. సరేనా !అని ఏడుస్తూ ,
వెళ్లి ,కారులో కూర్చు ందిగున్నమ్మ.చాగా నిల్చనిఅంతా విన్న డ్రైవర్ ఆశ్చర్యపోయాడు..స్త్రీలలో
ఇంతటిదుర్మా ర్గులు ఉంటారా? అనుకున్నా డు.సార్ గారికిఏమీ కాలేదమ్మా మీరు ఏడవకండి. సారీమిమ్మల్ని
తీసుకురమ్మన్నా రు అన్నా డు డ్రైవర్ మాస్టర్ ని చూసిబోరున ఏడుస్తున్న గున్నమ్మ గారిపరిస్థితి తను చూసింది
పత్రాపకు జరిగిందంతా”పూసగుచ్చి నట్లు “చెప్పాడు డ్రైవర్..
వెక్కివెక్కి ఏడుస్తున్న గున్నమ్మ గారితో, అమ్మా ! ఏడవకండిమాస్టారికిఏమీ కాలేదు. మీ పరిస్థితి అంతా తెలిసి,
మిమ్మల్ని అలా తీసుకురమ్మని నేనేచెప్పా ను క్షమించండి.. ఇప్పు డు మనం మా ఇంటికివెళ్ళి పోతున్నా ం.
మీకు గుర్తుందా లేదో? గానీ!నాకు బాగా గుర్తుంది.. మీ చేత్తోపెట్టిన అన్నం తిని, మీ వరండాలో నిద్రపోయి
బీకాం మూడు సంవత్సరాలు మాస్టారు చేత అకౌంట్స్ చెప్పించుకుని, ఈరోజు ఎంత ఉన్నత స్థితిలో నిలబడ్డాను…
నా తండ్రిచిన్నప్పు డేచనిపోయాడు. అమ్మ చనిపోయి ఆరు నెలలు అయింది.
మా అమ్మ స్థానంలో మిమ్మల్ని చూసుకుంటాను. తల్లి తండ్రిని్రి కోల్పో యిన నాభార్య కూడా తల్లిగామారి
.నా ఇంటిజ్యో తిని నిలబెట్టండి. అందుకుమీ సాయం కావాలి. .నా మాట కాదనవద్దు..
నేను ఏదోమిమ్మల్ని ఉద్ధరించడానికితీసుకెళ్తున్నా నని నేను భావించడం లేదు.. మీరు తప్ప నా ఆదుకునేది
ఎవరు లేదని ఉద్దేశంతో మిమ్మల్ని వెతుక్కు ని వచ్చి తీసుకెళ్తున్నా ను. ఇప్పటికీమీరు సాయం చేసేస్థితిలో
ఉన్నా రు నేను అభ్యర్థించేస్థితిలోనేఉన్నా ను. అన్నా డు అనుకోవుగా పత్రాప్
కారు కదిలిపోయింది.. ఊరిపొలిమేరలతో పాటు తమ కష్టాలు కూడా కనుమరుగైపోయాయి అనుకున్నా రు విశ్వం దంపతులు…..
ఇప్పు డు ఆ “దీపపు సెమ్మె” తళతళలాడుతూ , పత్రాప్ ఇంట జ్యో తి వెలిగించడానికి,
ఆ “దిష్టిబొమ్మ” దిశా నిర్దేశం చేసే, మార్గదర్శి అవ్వడానికి నిశ్చయించుకున్నా యి….