నదీమతల్లి- 7వ భాగం

జరిగిన కథ

రాధ భర్త మరణంతో కృంగిపోకుండా ధైర్యంతో ఉన్నది అంతా ఖర్చు పెట్టి. కూతురు రాగిణికి పెళ్లి చేస్తుంది.పెళ్లయిన తర్వాత రాగిణి అత్త వారు తీసుకెళ్లకుండా జాప్యం చేయటంతో మంచి రోజు చూసి అన్నవదినలను కూడాతీసుకొని రాగిణి ని అత్తవారింట్లో దింపుతుంది.‌ కొడుకు ఊళ్లో లేడని వియ్యపురాల అబద్ధం చెప్పిందని ఆ పిల్లవాడిని తాను చూసానని వదిన చెప్పటంతో ఆశ్చర్య పోతుంది.
రాగిణి క్షేమసమాచారాలని తెలుసుకోరామని సన్నిహితుడైన రామారావుని రాగిణి దగ్గరకి స్వీట్స్ తో పంపుతుంది రాధ. వెళ్లి వచ్చిన రామారావు అక్కడ వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని పోలీసు కంప్లైంట్ ఇవ్వటం మంచిదని సూచిస్తాడు అదే రోజు అర్ధరాత్రి రాగిణి వచ్చి తలుపు తట్టడంతో రాధ రాగి నిన్ను చూసి ఆశ్చర్య పోతుంది రాగిణి అత్తమామల ప్రవర్తన భర్త ప్రవర్తన తనని గదిలో బంధించి హింసించటం తాను ఏ విధంగా పారిపోయి వచ్చిందో తల్లికి చెప్పుకొని ఏడుస్తుంది

ఇక చదవండి…

పంజా దెబ్బలు తిని తప్పించుకు వచ్చిన లేడిపిల్లలా, తల్లి గూటికి చేరిన పక్షిలా ప్రశాంతంగా ముడుచుకు పడుకుంది రాగిణి.

రాధ మెదడు చురుగ్గా పని చేయసాగింది.వెంటనే రెండో అన్నకి మూడో అన్నకి కాల్ చేసి విషయమంతా క్లుప్తంగా చెప్పింది.రికార్డెడ్ మేటర్ ఫార్వార్డ్ చేసింది.వెంటనే కేశవరెడ్డి, శ్రీనివాస రెడ్డి ఎఫ్ ఐ .ఆర్ ఫైల్ చేసారు.అప్పటికి టైము తెల్లవారు ఝాము నాలుగు గంటలైంది .తిరుమల నించీ శ్రీనివాసరెడ్డి ఐదు గంటలకల్లా చెల్లిలింట్లో ఉన్నాడు.
రాధని తీసుకొని సర్కల్ ఇన్స్పైక్టరు ధర్మారావు దగ్గరకి వెళ్ళాడు. మంచి పేరున్నవ్యక్తి ధర్మారావు.శ్రీ నివాసరెడ్డి, ధర్మారావు పోలీస్ ట్రైనింగ్లో మంచి ఫ్రైండ్స్ .
ధర్మారావు ఉదయమే ఎమర్జెన్సీగా ఆ ఇంటిని సరౌండు చేయాలని పోలీసులకి ఉత్తరువు జారీ చేసాడు.
రాధ ఈలోగా అక్కకి పెద్దన్నకి పద్మావతికి ఫోన్చేసి జరిగింది చెప్పింది.
★★★

తెల్లవారుఝామున ఏడు గంటలకల్లా ఆరుగురు పోలీసులు ఇద్దరు ఎస్ఐ లు రాగిణి అత్తవారిల్లుని చుట్టు ముట్టారు.

ఇంటినించీ ఏ అలికిడీ లేదు.గేటు తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళబోతే ఇంటికి తాళంవేసి ఉంది.ఇంటి చుట్టూ తిరిగిచూస్తే దొడ్డి తలుపు తెరిచుంది.లోపలికి వెళ్ళిచూడగా విలువైన సామాన్లు తీసుకుని ముగ్గురూ పరారయ్యారు.

పోలీసులు ఇంటిని సీల్ చేసారు. ఇరుగు పొరుగుని వారి గురించి అడగగా మాకు తెలియదన్నారు.

“వాళ్ళు మీ మేనకోడలు తప్పించుకోగానే పోలీసుకేసు అవుతుందని ముందే ఊహించారు.” అన్నాడు ధర్మారావు .

“డోంట్వర్రీ! వాళ్ళు బయలుదేరి మూడు నాలుగు గంటలైంది .ఎంతో దూరం వెళ్ళి ఉండరు .పట్టుకోవడం పెద్దకష్టం కాదు.పిల్ల పెళ్ళిఫోటోలనించీ వాళ్ళముగ్గురూ ఉన్న ఫోటో ఒకటి ఇవ్వండి.ఎటొచ్చీ వాళ్ళు ఏడైరక్షన్లో వెళ్ళారన్నది కరెక్టుగా ఎసెస్ చేయగలిస్తే పట్టుకోవటం తేలికవుతుంది.నా అంచనా వాళ్ళు బెంగుళూరు,చెన్నై వెళ్ళరు.వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఇచ్చేవాళ్ళుండరు. వాళ్ళ నేటివ్ విజయనగరం వైపే వెళ్ళుండవచ్చు.మీకు వాళ్ళు పట్టుబడంగానే ఇన్ఫార్మ్ చేస్తాం.”అంటూ షేక్హాండ్ ఇచ్చాడు ధర్మారావు రాధ అన్నకి.

ఈదురో దేముడా అంటూఇంటికివచ్చారు శ్రీనివాసరెడ్డి ,రాధ.

అలసిన రాగిణి వళ్ళుతెలియని గాఢ నిద్రలో ఉంది .
.
“ప్రణవ్ ఏడి?” అని అడిగాడు శ్రీనివాస రెడ్డి.

“బెంగుళూరువెళ్ళాడు శ్రీఅన్నా! రోహన్,రోహిత్ తో ఏ బిజినెస్ బాగుంటుందో డిస్కస్స్ చేయడానికి.” అంటూ ప్రణవ్ గురించి అంతా చెప్పింది.

రాధకి శ్రీ నివాసరెడ్డి అంటే చనువు ఎక్కువ.పెద్దన్న అంటే గౌరవం.చిన్నన్న అంటే భయం.శ్రీనివాసరెడ్డికి అక్కతోకంటె చెల్లి రాధ తో అటాచ్మైంటెక్కువ.
చిక్కుముడుల విషవలయంలో మరింత మరింత కూరుకుపోతున్నరాధ అంటే విపరీతమైన ఆందోళన చెందుతాడు.
“అన్నా ఏం చేద్దాం? బావకి వచ్చిన ప్రావిడెంట్ ఫండ్, సేవింగ్స్ అంతా ఖర్చు పెట్టి పెళ్ళి చేసా.నా దగ్గరున్న బంగారమంతా అమ్ముకి పెట్టా! వాళ్ళు దాని వంటి మీద బంగారం వలుచుకున్నారు.కట్నం లాంఛనాలపేరుతో పదిహేను లక్షలవరకూ తీసుకున్నారు. ఇప్పుడేంచేయాలి.” అంటూ రోదించింది రాధ.

భర్త పోయినప్పటికంటె ఎక్కువ దుఃఖ మొస్తోంది రాధకి.

“ఏమీ దిగులుపడకు ధర్మారావు దగ్గరకి కంప్లైంట్ వెళ్ళిందంటే రేపీపాటికి వాళ్ళే కలుగుల్లోఎలకల్లా బయటకు వస్తారు.నువ్వు జ్యోత్స్నకి జరిగింది చెప్పు.వాళ్ళమీద కేసు వేస్తే డబ్బులు.నగలు అన్నీ కక్కుతారు. అమ్మూకి కొద్దిరోజులాగి సంబంధం చూద్దాం.ప్రణవ్ వస్తే వాడిని నాలుగు ఉతకాలని ఉంది.ఇట్లా తయారయ్యాడేంటి?”అంటూ చెల్లిని ఓదార్చి నాలుగు రోజులు సెలవుపెట్టి రాధ దగ్గరే ఉన్నాడు.

ప్రణవ్ రావాలని వాడితో జరిగిందంతా చెప్పుకోవాలని ఎంతో తహతహలాడింది కొడుకునిగన్నతల్లి రాధమనస్సు.

తల్లిద్వారా విషయం విని ఎటువంటి రియాక్షను
చూపెట్టలేదు సరికదా!రాగిణిని చూసి ,”అమ్మూ! ఝాన్సీరాణి లాగా ఎడ్వెన్చర్ చేసావుట.”అంటూ తనకంటె చిన్నదని చూడకుండా ఎగతాళిఎక్కిరింతతో మాట్లాడాడు ప్రణవ్.

‘నాన్న ఉన్నప్పుడు అన్న ఏమన్నా అంటే,నాన్నా!అంటూ గారంగా చెప్పకునేదాన్ని.ఇప్పుడు తండ్రిలేని ఆడపిల్లని.రాజ్యంలేని యువరాణిని .’అనుకుంది మనస్సులో రాగిణి.

శ్రీనివాసరెడ్డి అంటించాల్సిన చురకలు అంటించాడు మేనల్లుడికి.మావయ్య భయంతో ఇంట్లో ముళ్ళమీదకూర్చున్నట్లున్నాడు ప్రణవ్.

శ్రీ నివాసరెడ్డి అన్నట్లు ధర్మారావు నాలుగు రోజుల్లో ఆముగ్గుర్నీ వైజాగ్ స్టేషన్లో ఎరెస్ట్ చేసారు.స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళచేతనే నిజం కక్కించి రికార్డ చేసి పెట్టుకొని ,వాళ్ళని రిమైండ్లో ఉంచారు.

జ్యోత్స్న కేస్ టేకప్ చేసింది.పూర్తి సాక్ష్యాధారాలుండటంతో విడాకులు, పెళ్ళిఖర్చులు. కట్నం, దోచుకున్న నగలు వాళ్ళదగ్గరనించీ రాబట్టేటట్టు గట్టి పట్టుదలగా ఉంది జ్యోత్స్న.

జ్యోత్స్న కి మంచి లాయర్గా ఎంతపేరుందో డబ్బు చేతిలో పడందే కేస్ టేకప్ చేయదన్న పేరుకూడా బాగానే ఉంది.

“జ్యోత్స్న! స్నేహితురాలవని నీ ఫీజు ఎగకొట్టను. అందరిదగ్గర ఎంత తీసుకుంటావో అంత ఫీజు ఇస్తా.అమ్మూకి న్యాయం చేయి.” అంటూ జ్యోత్స్న చేతులు పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టకుంది రాధ.

“ఊరుకోవే రాధా! నీ కూతురు నా కూతురు కాదా! నీకు ధైర్యంచెప్పాగాని దానికిలాగ జరిగిందని నీతో సమానంగా బాధపడుతున్నా! దాని జీవితంలో ఈసంఘటన చెరపలేను.కాని దానికి న్యాయం జరిగేదాకా ఆరాక్షసులకి కఠినంగా శిక్షపడేదాక నేను పోరాడుతా! నేను డబ్బుమనిషినేకాదు అవసరమైతే మానవతావాదిని.ఇవాల్టినించీ అమ్మూ నా బిడ్డ. నాబిడ్డగురించి నేను ఫీజు తీసుకుంటానా!నిశ్చింతగా ఉండు.నువ్వేమీ ఆలోచించకు.నీ ఆరోగ్యం
పాడవుతుంది.నీకిప్పుడు బాధ్యత పెరిగింది. ” అంటూ రాధని కౌగలించుకుని ధైర్యం చెప్పింది జ్యోత్స్న.

నాకేంకాదు జ్యోత్స్న! నేనో పాషాణాన్ని కాబట్టే ఆ స్వామి దెబ్బ మీద దెబ్బ వేస్తున్నాడు.కాని ఆయనిచ్చిన కష్టం ఆయనే తొలగించాలి.నాకు ఇవన్నీ తట్టుకునే శక్తిని,ముందడుగు వేయగలశక్తిని ఇస్తేచాలు.” అంటూ శుష్క మందహాసం చేసింది రాధ.
★★★

రాగిణి వచ్చి నాలుగు రోజులైంది. మాట్లాడదు. ఏడవదు.నవ్వదు.గదిలోంచి బయటకు రాదు.తండ్రిపటాన్ని చూస్తూ ఉంటుంది.

“అమ్మూ!నువ్వదృష్టవంతురాలివి తల్లీ.మనం నమ్మిన ఆశ్రీనివాసుడు నీకు ఏప్రమాదం జరగకుండా కాపాడాడు.నేనుండగా నువ్వుదిగులుపడాల్సిన అవసరంలేదు.నీజీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాదిరా తల్లీ.
ప్రశాంతంగా ప్రవహించేనది ఆనదీ రూపం రావటానికి ఎన్ని కొండలు ఎన్ని గుట్టలూ ఎన్నికోనలూ ఎంత చెత్త చెదారాలని దాటుకొని ఈ పవిత్ర రూపాన్ని సంతరించుకుని ఎన్నిసుగుండాలని గుండెల్లో మోస్తోందో తెలుసా అమ్మూ.ఆడదాని జీవితం అంతే.ఓడిపోరాదు.ప్రవహించే నది మనం.సాగరాన్ని చేరేవరకూ ఈప్రవాహం ఆగకూడదు.
ఎంతో మంది అమ్మాయిలని పెట్రోలుపోసి నిప్పంటించిన అత్త,మామ,భర్తల ఉదంతాలున్నాయి.
పసిపిల్లలని సైతం బలి తీసుకున్న కామాంధులున్నారు. వాటితో పోల్చుకుంటే నువ్వెంతో అదృష్టవంతురాలివి.ఎటువంటి ప్రమాదం జరగకుండా ధైర్యంగా బయటపడ్డావు.నువ్వలాఉంటే ఈ అమ్మని ఎవరు చూసుకుంటారు అమ్మూ.” అంటూ వీలయినప్పుడల్లా రాగిణికి ధైర్యంచెపుతూ ఓదార్చింది.
“ఏవిధంగా నన్ను అదృష్టవంతురాలివి అంటున్నావమ్మా? దైవం కాపాడిందంటున్నావు. ఇలా జరుగుతుందని తెలిసి నాకెందుకీ పెళ్ళి నిర్ణయించాడు?” అన్న ప్రశ్నలకి రాధ ధగ్గిర సమాధానం లేదు.

సరిగ్గా ఐదవరోజున ధర్మారావు ఫోన్చేసి “రేపు వాళ్ళని కోర్టులో హాజరు పరుస్తున్నాము.”అని చెప్పాడు.

రాధ జ్యోత్స్న కు ఫోనుచేసి విషయం చెప్పింది.
“అవసరమైనప్పుడు మీరు కోర్టుకు రావలసి ఉంటుంది.నేను సాధ్యమైనంత తక్కువసార్లు కోర్టలో అమ్మూ ప్రెజెన్స్కి ప్రయత్నిస్తా.తప్పని సరి పరిస్థితి లో తప్పదు మరి.అమ్మూని కోర్ట్ కి ప్రిపేర్ చేయి.”అంటూ జ్యోత్స్న చెప్పింది.

★★★
రోజులు గడుస్తున్నాయి నిస్సారంగా రాధా రాగిణి లకు.
బుధ్ధి పుట్టినప్పుడు ఇంటికి వస్తాడు ప్రణవ్.రాధ ఎంతో ప్రేమగా పలకరించినా చీదరించుకుంటాడు తప్ప మాట్లాడటానికి అవకాశం ఇవ్వడు.

రాగిణి వచ్చి రెండునెలలైంది. కోర్టులో కేసు నడుస్తోంది.తొందరలోనే ముగింపుకొస్తుందని,గిఫ్ట్ పేరిట తీసుకున్న కట్నం,డబ్బులు,పిల్లవంటిమీద బంగారంఅంతా తిరిగివస్తుందని నమ్మకంగా చెప్పింది జ్యోత్స్న.

ప్రణవ్ భోజనంచేస్తున్నప్పుడు నెమ్మదిగా జ్యోత్స్న చెప్పిన విషయం చెప్పింది.
“అవునా అమ్మా!”అన్నాడు ప్రణవ్.
ప్రణవ్ నించీవచ్చిన రెస్పాన్స్ కి చాలా సంతోషించింది
రాధ .

“అయితే పదిహేను ఇరవైలక్షలమీదే ఉండొచ్చుకదా!” అన్నాడుప్రణవ్.
“ఉండొచ్చు. ” అంది రాధ.
నా బిజినెస్కి లోన్ సేంక్షన్అయింది.ప్రొక్లైనర్స్ కొని బిజినెస్ చేద్దామనుకుంటున్నా బెంగుళూరులో. నీకు తెలియనిదేముంది?ముందు కొంత డిపాజిట్ కట్టమంటున్నారు.కోర్టు వాళ్ళు డబ్బివంగానే చెప్పు.నేను బ్యాంక్ లోనుకు డిపాజిట్చేస్తా. సరిపోదనుకో.మిగతాదివడ్డీ కి నాఫ్రెండ్ ఎరేంజ్చేస్తానన్నాడు.ఇక ఆడబ్బుతో దానికి పనేముంది.”అన్నాడు ప్రణవ్.

మాట ముగిసేలోపల చెంప ఛళ్ళుమనిపించిందిరాధ.

“దరిద్రుడా! నువ్వెలా పుట్టావురా మాకడుపున.అది నీ చెల్లెలురా.ఇవాళ్టివరకూ నాఅన్నలు నాకు కష్టమొస్తే నాప్రక్కన ఉంటున్నారు.ఇంకా. ఆడబ్బుతో దాని జీవనోపాధి గురించి ఆలోచిస్తా వనుకున్నా.లే!లేచి వెళ్ళిపో!”అంటూ తలబాదుకుని ఏడ్చింది రాధ హిస్టారికల్గా.

“ఆఁ వెళ్తా! మగదిక్కులేకుండా మీరిద్దరూ ఎలా ఉంటారో అదీ చూస్తా!”అంటూ చరచరా వెళ్ళిపోయాడు ప్రణవ్.

“అమ్మా! “అంటూ తల్లి తలనిగుండెలకి అదిమి పెట్టింది రాగిణి.
“అమ్మూ! చూడవే మీఅన్న ఎలా మాట్లాడుతున్నాడో!నీకంటే వాడినే నేనెక్కువ ముద్దుచేసానే.ఇవాళ ఎంతెంత మాటలంటున్నాడో!”అంటూ ఒక్కక్షణం నిస్సహాయంగా రోదించింది.
★★★

ప్రణవ్ ఇంట్లోంచి వెళ్ళిపోయి వారం రోజులైంది.తల్లి ప్రాణం తహతహలాడింది.
‘వాడికి మాట్లాడటం చేతకాదు .అంతమాత్రాన తనబుధ్ధి ఏమైంది.వాడికి బిజినెస్ మీద పిచ్చి.సరె!అని ఉంటే?అమ్మో!ఇంకేమైనాఉందా! అమ్మూకి ఆ డబ్బు చాలా అవసరం.’ఇలాతనలోతనే మధనపడసాగింది రాధ.

బేంక్ లో సీరియస్గా పనిచేసుకుంటోంది రాధకి టేబిల్మీద ఫోను మ్రోగటంతో కష్టమర్ అనుకొని ఫోనెత్తి “చెప్పండి!”అంది.
“అమ్మా! నేను ప్రణవ్ ని ఒక ముఖ్యవిషయం.” అన్నాడు.
“కొంచెం బిజీగా ఉన్నా.ఒక వన్ అవర్ తరువాత చేయి.”అంటూ ఫోన్ పెట్టేసి భళ్ళీ తనపనిలో మునిగిపోయిందిరాధ.
“పది నిమిషాలు కాకుండానే మళ్ళీ ఫోను మ్రోగింది అటునించీ”
“అమ్మా!ఫోను పెట్టేయకు.చెప్పేది విను.నేను అర్జెంటుగా పెళ్ళి చేసుకోవలసివచ్చింది. తిరుమలగుళ్ళో పెళ్ళిచేసుకున్నాం నేను సమీర.సమీర నీకుతెలుసుగా. సమీర వాళ్ళనాన్నగారు నన్ను తన్నటానికి వస్తున్నారు. మేము ఇంకొక గంటన్నరలోఇంటికి వస్తాం అమ్మా! ప్లీజ్ రిసీవ్ చేసికో.లేకపోతే వాళ్ళు నన్ను చంపేసేట్టున్నారు.అంతే ఉంటా! మేంవచ్చేసరికి ఇంట్లో ఉంటావుకదా!”అంటూ ఫోన్ పెట్టసాడు ప్రణవ్.
‘తల తిరిగి పోతోంది.కాళ్ళక్రింద భూమి జారి పోతున్నట్టు,ఊబిలో మెడలోతు కూరుకు పోయిన ఫీలింగు.’ వెంటనే తేరుకుందిరాధ.

చీఫ్ మేనేజర్ రూమ్ లోకి వెళ్ళి సడన్ గా తలతిరుగుతోంది వెళ్తున్నానని చెప్పి హుటాహుటీగా ఇంటికివచ్చి విషయం రాగిణికి చెప్పి పెద్దన్నకి శ్రీ అన్నకి వెంటనే బయలుదేరి రమ్మనమని ఫోనుచేసి చెప్పింది
తల్లీ!రాధా ఏమాలోచించకు.గుళ్ళో పెళ్ళిచేసుకున్నాడంటున్నావు.వాళ్ళుతరుముతున్నారంటున్నారు కాబట్టి విళ్ళిద్దరికీ ఆరతిచ్చిఇంట్లోకి తీసికెళ్ళు నేను సాయంత్రానికల్లా వస్తా.”అంటూ సలహా ఇచ్చాడు రాజారెడ్డి.

సశేషం

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పసిదనంతో ప్రయాణం (కాలమ్)

హరి చందన- 7వ భాగం