మహిళా !ఓ మహిళా..

కవిత

అమ్మా! మహిళా 

నీకు భూదేవి అంత ఓర్పు

ఆకాశమంత మనసు,

దాని నిండా ప్రేమను నింపుకొని

అందరికీ పంచుతూ ఉంటావు

నీకు ఈర్ష్యా ద్వేషాలు ఉండవు

కోపం అసలే ఎరుగవు

ఆనందమైనా, సంతోషమైనా పదిమందికి పంచుతావు

బాధను నీలోనే దిగమింగుకుంటావు

పుట్టినింట్లో అన్నదమ్ములకన్నా

తక్కువ చేసిన ఓర్చుకుంటావు

మెట్టిని ఇంట్లో ఆడపడుచులకంటే ఓర్పుగా ఉంటావు

ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు

అలసట అనే మాట నీకు వర్తిస్తుందా?

భర్త బాధించిన సహిస్తావు,

అత్తమామలు తిట్టినా పడతావు

నీ పిల్లలు సతాయించిన ప్రేమతో దగ్గరికి తీస్తావు

అసలు ఓపిక అనే పదం నీ నుంచే పుట్టినట్టుంది

నాన్నకు అమ్మై, అమ్మకు మరో అమ్మై, 

వాళ్ళు ఇచ్చే ఆప్యాయతలను ఆస్వాదిస్తూ

వారికి రెట్టింపు ప్రేమను ఇస్తావు

నీ జీవితంలో… పుట్టినప్పుడు కూతురిగా,

ఎదుగుతుంటే అక్క,చెల్లెలుగా, పెళ్లయ్యాక భార్యగా

తల్లయ్యాక అమ్మగా, వృద్ధాప్యం అయ్యాక అమ్మమ్మ, బామ్మగా

ఇన్ని పాత్రలు పోషించిన నీకు

తెలిసింది ఒక్కటే.. ప్రేమను పంచడం కదా !

ఇంట్లో ఎన్నో పనులు చేస్తావు,

ఉద్యోగానికి వెళ్లి బాధ్యతలు చూసుకుంటావు

గృహంలో నీ స్థానం నీదైనప్పుడు

ఈ ప్రపంచాన్నే మార్చేయగల శక్తి నీకు ఉంటుందని

అది తెలుసుకో!…

నువ్వు అనుకుంటే పెద్ద కొండనే పగల గొట్టి పొడి చేయగలవు

అలాంటిది….

ఆడదాని వైపు తప్పుగా చూసిన

మగువను పాడుచేసిన,

మృగ మగాడిని చీల్చి చెండాడే సత్తా నీకుంది

మహిళ అంటే ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి

అబల అనే పేరు వింటే మగాడికి వణుకు పుట్టాలి

నీకు తెలియని అద్భుతం నీలో దాగుంది

దానిని బయటకు రాని …

ఇదే నీ అబ్బుర శక్తి, జగతికే ఓ అద్భుత శక్తి… 

            

Written by J Bhavani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day

హరి చందన-11వ భాగం