Anusri Gauroju
పేరు.. అనూశ్రీ గౌరోజు ఊరు గోదావరిఖని.. గృహిణి, కవయిత్రి, రచయిత్రి. ఇప్పటివరకు మూడు వచన కవితా సంపుటాలు..( కెరటం, గగనం, దోసిట్లో చందమామ,) రెండు నవలలు.. (వేద, జగతి) ఆవిష్కరణ జరిగాయి. నా రెండు నవలలు స్త్రీవాద రచనలు అని చెప్పడం సంతోషం. శ్రీపద సౌరభం పేరుతో నేను రూపొందించిన ‘శ్రీపదాలుప్రక్రియలో ‘ వెలువడిన శ్రీపద సౌరభం అనే సంకలనానికి, "కవనపూదోట* అనే సంకలనానికి సంపాదకత్వం వహించడం జరిగింది. సాహిత్యంతో సహవాసం నాకెంతో ఇష్టం.. అక్షరాలతో కలిసి నడవడం అంటే మనల్ని మనం విజ్ఞానం వైపుకు నడిపించుకోవడమే అని నమ్ముతాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన నీహారిణి గారి కి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్సులు