Bhairava Josyula
నా పేరు రోహిణి భైరవజోశ్యులు. మా ఊరు అనంతపురం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. నేను M.Com., M.A ( ఇంగ్లీష్) చేశాను. పెళ్ళయ్యాక చేసినవి. 20 సంవత్సరాలు కామర్స్ లెక్చరర్ గా వివిధ కళాశాలల్లో పని చేశాను. మా వారు బ్యాంక్ లో Assistant General manager గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ రీత్యా మేము Asansol (West Bengal), Faridabad (Haryana) near Delhi, Kannur ( Kerala) తిరిగాము. అలాగే ఆదోని ( కర్నూలు), నిజామాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్ళాము. కొడుకులు, కోడళ్లు , ముగ్గురు మనవళ్ళు ఉన్నారు. నేను 3 1/2 సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నాను. నేను ఎక్కువగా కుటుంబ కథలు రాస్తుంటాను. అప్పుడప్పుడు హారర్ కథలు, హాస్య కథలు కూడా రాస్తుంటాను. ఈనాడు ఆదివారం పత్రికలో రెండుకథలు పబ్లిష్ అయ్యాయి. సంచిక, విశాలాక్షి, విశాఖ, ఉషా, సుమతి, సహరి, తిరుపతి రచయితల పోటీ, విజయనగరం జిల్లా రచయితల సంఘం మొదలగు పత్రికలు నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. ఇప్పుడు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఇదీ నా పరిచయం