Lalitha Ram
లలితా రామ్ రచయిత్రి లలితా రామ్ గారి పేరు మరో పేరు రేవతి. వీరు ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు, ఆర్టిస్ట్ శ్రీ బుజ్జాయి సుబ్బరాయ శాస్త్రి గారి కుమార్తె. ఫైనాన్స్ లో ఎంబీఏ చేసి, వైస్ ట్రెజరర్ గా ఉద్యోగం చేసిన తర్వాత వారి అన్నగారి పేరుతో, "అవంతి కళ్యాణం" తెలుగు నవలతో కలం చేపట్టారు. "మేఘ" ఇంగ్లీష్ నవల రచించారు. తెలుగు, ఇంగ్లీష్ల్ భాషల లో కథలు కవితలు, వ్యాసాలు ఎన్నో రాశారు. 2023లో దేవులపల్లి వారి శ్రవ్య నాటిక "తిరుప్పావై" ను ఇంగ్లీషుభాషలోకి "The Champaca Enchantment" అనే పేరుతో అనువదించారు. ఎన్నో పురస్కారాలు బిరుదులను పొందారు. తాత గారి పేరున ఫౌండేషన్ స్థాపించి పిల్లలకు, పెద్దలకు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో సాహిత్య సేవ పురస్కారాలు ఇచ్చారు. 240 మంది అంతర్జాతీయ కవయిత్రుల కవితల కవిత "మేఘమాల", 102 అంతర్జాతీయ రచయితలు రాసిన "నవ్యవ్యాస మాలిక" అనే పుస్తకాల ప్రచురణకు సంపాదకురాలుగా పనిచేసారు. కృష్ణశాస్త్రి గారు రచించిన లలిత గీతాల ఆల్బమ్ ప్రొడ్యూస్ చేశారు. పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహాభారతంలో కొన్ని పాత్రలపై విశ్లేషణ చేశారు. అమెరికాలో "రైజింగ్ స్టార్ అవార్డ్స్" కు జడ్జిగా పనిచేశారు. ప్రపంచ తెలుగు సమితి వ్యవస్థాపకులలో ఒకరు. ఎన్నో తెలుగు సాహిత్య సమావేశాలను ఏర్పాటు చేశారు,చేస్తున్నారు. "సెలయేటిలో మొగ్గ సంపెంగలు" అనే ఈ వైవిధ్య భరితమైన కథలను రచించారు, పుస్తకంగా ప్రచురించారు. ఈ కథలు ఈ పుస్తకంలోనివే! ___***___