Nila Madala
హాయ్ అండీ నాన్న పెట్టిన పేరు నిర్మల! చిన్ని గ్రామం నుండి విజయవాడ నగరం కి చదువుకోసం వచ్చి సైన్స్ పట్టభధ్రురాలినయ్యా! బాధ్యతల బంధాలలో ఏడు పదుల జీవితం అనుభవం! అమ్మ వియోగం మర్చిపోటానికి రెండు దశాబ్దాలుగా నా అంతరంగ బావోద్వేగాలను అక్షరాల్లోకి అనువదించడం అలవాటుగా మారింది! జ్ఞాపకాలను, వర్తమాన వాస్తవాలను స్వగతంలా , సరళంగా రాయటంలో నాకుఁ సాంత్వన దొరికింది! జీవితం పట్ల అవగాహన, ఉత్సాహం పెరిగింది! 13 ఇయర్స్ నుండీ FB లో Nila Madala Id తో లలితాంజలి శీర్షిక లో నిత్యం నా వివిధ భావనలు సంక్షిప్తంగా స్నేహితులతో పంచుకోవటం ఒక మంచి వ్యసనంగా మారింది! మిత్రులకు నచ్చి నన్నో ఇన్స్పిరేషనల్ వుమన్ స్థానంలో నిలబెట్టారు! ఎన్నో ప్రతిభల సముద్రంలో నేనో నీటి బొట్టు! మంచి బుక్స్ చదవటం, మంచి సినిమాలు చూడటం, గుడికి వెళ్ళి దేవునికి నమస్కార కృతజ్ఞతలు తెలుపుకోవటం ఇప్పటి ప్రాజెక్ట్! ఫ్యాషన్స్, రాజకీయాల నుండీ ఫిలాసఫీ వరకు అన్నీ ఇష్టమైన సబ్జక్ట్స్ నాకు! ఎప్పుడూ నిజాయితీగ, నిగర్వంగా ఉండటమే ఇష్టం! అదే నా సంపద!