Rohini Satya
రోహిణి సత్య పరిచయం _______ పేరు రోహిణి సత్య, జననం విద్యాభ్యాసం ఆంద్రప్రదేశ్ లో అనంతపురం. ప్రస్తుత నివాసం బెంగళూరు. గృహిణి, ప్రవృత్తి సాహిత్య రచన. తెలుగు కన్నడ భాషలలో వివిధ పత్రికలలో కథలు కవితలు వ్యాసాలు ప్రచురించ బడ్డాయి. అనేక తెలుగు ప్రముఖ కవుల కవితలను (దాదాపు నలభై యాభై దాకా) కన్నడ భాషలోకి అనువదించారు. ఈ అనువాద కవితలు వివిధ కన్నడ దిన,వార,మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. అలాగే కొన్ని కన్నడ కవితల అనువాదాలు తెలుగు పత్రికలలో ప్రచురించబడ్డాయి. బెంగళూరు ఆకాశవాణి స్నేహభారతి కార్యక్రమాలలో దాదాపు ముప్పై పైదాకా స్వీయ రచనలైన తెలుగు కథలు ప్రసారమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కార్యక్రమాలలో కవితా పఠనం చేసారు. బెంగళూరు వచ్చిన తరువాత కన్నడ భాషను నేర్చుకుని కన్నడ భాషలో నేరుగా కథలు, కవితలు, వ్యాసాలూ, పాటలు రాసి అవి అన్ని కన్నడ పత్రికలలో ప్రచురించబడ్డాయి. అనేక కన్నడ సాహిత్య సంఘాల కవితా గోష్ఠి కార్యక్రమాలలో సత్కారాలు అందుకున్నారు. తెలుగు, కన్నడ రెండు భాషలలో కథల సంపుటి, అనువాద కవితల సంపుటి వెలువరించాలన్న ప్రయత్నం కార్యరూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నవి.