Sripathi Lalitha
నా పరిచయం నా కథలే పాఠకుల సమస్యలకి కౌన్సిలింగ్ చెయ్యాలి - ఇదే నా మోటో నా పేరు శ్రీపతి లలితకుమారి. నేను ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను. అరవై ఏళ్లకి, ఫేస్బుక్ లో కొన్ని సాహితీ గ్రూపులలో చేరాను. అక్కడ ప్రారంభమైంది నా సాహితీ ప్రయాణం. శ్రీపతి లలిత పేరుతో కథా రచన మొదలుపెట్టి, సుమారు తొంభై పైనే కథలు వ్రాసాను. ఈనాడు, సహరి, రవళి, సంచిక, మన తెలుగు కథలు, గోతెలుగు, సుమతి,తపస్వి మనోహరం, వార్త, తెలుగుతల్లి కెనడా పత్రికల లోనే కాక, TAGCA వారి వాహిని ఉగాది పత్రికలోనూ, సుధామగారు నిర్వహించిన ప్రసన్నభారతి వారి ఓసారిచూడండి అంతే, ఫేస్బుక్ గ్రూప్ లు అచ్చంగా తెలుగు, భావుక, బాపురమణీయం, పొన్నాడ వారి పున్నాగవనం లో నా కథలు వచ్చాయి. ఇరవైకి పైగా కథలకు బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన చాలా కథలు, టోరీ రేడియో ప్రోగ్రాం లోనూ, లక్ష్మి చెప్పే కథలు, మీ కృష్ణమ్మ కథలు, మీ కథల సమయం, మనతెలుగు కథలు వంటి యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు. సైకాలజీ అన్నా, కౌన్సిలింగ్ అన్నా, ఎంతో ఇష్టమున్న నాకు, నేను వ్రాసే కథలే, పాఠకులకు ఒక కౌన్సిలింగ్ గా ఉండాలని ఒక సమస్యతో కథ వ్రాస్తే దానిలోనే పరిష్కారం సూచిస్తూ కథలు వ్రాయడం మొదలుపెట్టాను. అదే నా ప్రత్యేకతగా అందరూ అభిమానిస్తారు.