The Cruise – ఓ దృశ్య ప్రయాణం -Part 5

యాత్రా విశేషాలు

సిట్కా (Sitka)

మా క్రూజ్ ప్రయాణంలో ఆరవ రోజు “సిట్కా” చేరుకున్నాం. అలస్కాలోని అన్ని ప్రాంతాలలో సిట్కాకి ఒక ప్రత్యేకత ఉంది .ఒక మర్చిపోలేని చరిత్ర ఉంది. రష్యాలోని ఔత్సాహిక నావికులు, బిజినెస్ వాళ్లు, వాళ్ల బిజినెస్ విస్తరించడానికి ఇంకొన్ని కొత్త ప్రదేశాలను వెతుకుతున్న క్రమంలో, చాలా సంవత్సరాల తర్వాత సిట్కాను కనుగొన్నారు. 1861 సంవత్సరం వరకు సిట్కా రష్యా ఆధీనంలో ఉండేది .ఆ తర్వాత 1867లో రష్యా సిట్కాను అమెరికాకు 7.2 మిలియన్ డాలర్ల కు అమ్మేసింది. 1867లో” Sitka Castle Hill “అధికారికంగా సిట్కా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వశమైంది .
సిట్కా పైన సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేసి చివరకు “వన్ లంగ్ ఆఫ్ నార్త్ అమెరికా “అన్నారు. అంటే ఇది పర్యావరణంలో ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా పచ్చని చెట్లతో నిండి ఉన్న పర్వతాలు, అహర్నిశలు ఫ్రెష్ గాలి అందించడానికి శ్రమిస్తాయి . సైంటిస్టులు “వన్ లంగ్ ఆఫ్ నార్త్ అమెరికా” అని ఊరికే అనలేదని అనిపించింది.

క్రూజ్ పోర్టు నుండి దాదాపు 5 miles డిస్టెన్స్ లో డౌన్ టౌన్ ఉంది. ఇక్కడి నుంచి క్రుజ్ వాళ్ళు ఏర్పాటుచేసిన ఫ్రీ షటిల్ bus ప్రతి పది నిమిషాలకు ఒకసారి బయలుదేరుతుంది. క్రూజ్ లో నుండి బయటకు వెళుతుంటే ఎడమ ప్రక్క షాప్స్ ఉంటాయి. బట్టలు, చిన్న చిన్న బొమ్మలు, సావినీర్స్, ఫుడ్ కోర్ట్, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ బోర్డ్ ల తో ఈ ప్రాంతమంతా చాలా లైవ్లీగా ఉంటుంది .అలా నడుస్తూ నడుస్తూ అక్కడే ఉన్న సెంటెనెల్ హాల్ (విజిటింగ్ సెంటర్) కు చేరుకున్నాం .అక్కడ ఒక పెద్ద బోర్డు పైన రూట్ మ్యాప్ ఉంది .రోడ్డు మ్యాప్ ను ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకున్నాం. విజిటింగ్ సెంటర్ బయట ఒక పెద్ద బోటు ఉంది. ఇంకా ఇక్కడ మెటల్తో చేసిన టోటెంలు ఉన్నాయి. మామూలుగా అయితే టోటమ్స్ చెక్కతో ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళితే సిట్కా పబ్లిక్ లైబ్రరీ ఉంది మేము సమయాభావం వల్ల లోపలికి వెళ్ళలేదు.

పబ్లిక్ లైబ్రరీ నుండి ఒక 15 నిమిషాలు ముందుకు వెళితే దారిలో” సైన్స్ సెంటర్” ఉంది. అక్కడనే” Salmon Hatcheries ” కూడా ఉన్నాయి. కానీ మేము లోపలికి వెళ్లలేదు ఇంకా 15 నిమిషాలు నడిచిన తర్వాత” సిట్కా నేషనల్ హిస్టారికల్ పార్కు” ఉంది. దీని లోపలికి వెళ్లి మొత్తం కలియతిరిగాం. ఇక్కడ చాలా “Totems” ఉన్నాయి. ఇక్కడ చిన్నవి పెద్దవి కలిపి చాలా ‘బేర్స్’ బొమ్మలు కూడా ఉన్నాయి. బయటికి వచ్చి కిందికి వెళితే సముద్రం మరియు క్రూజ్ కనిపిస్తుంది. టోటెమ్ పార్క్, నేషనల్ హిస్టారికల్ పార్క్” లను ఆనుకొని ఒక చిన్న ఫారెస్ట్ ఉంది. దాన్ని దాటితే ‘ఇండియన్ రివర్’ కనిపిస్తుంది ఇండియన్ రివర్ పైన ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ పై నుండి చూస్తే సాల్మన్ ఫిషెస్ కనిపిస్తాయి వాటి కోసం బేర్స్ తిరుగుతూ ఉంటాయి.

అందుకని అక్కడ ఎక్కువసేపు గడపలేక త్వర త్వరగా Rapter సెంటర్ కు వెళ్ళాము. అక్కడి నుంచి రాప్టర్ సెంటర్ కొంచెం దూరంలో ఉంది. అక్కడ గాయపడిన బాల్డ్ eagle ఇంకా మరియు ఇతర పక్షులకు చికిత్స చేసి అవి మామూలుగా అయ్యాక వాటిని మళ్ళీ బయటికి వదులుతారు. అక్కడనే కొద్ది దూరాన స్పాన్ lake ఉంది. ఇక్కడ వింటర్లో ఐస్ తయారయ్యాక కాలిఫోర్నియాకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవ్వన్నీ చూసాక మళ్లీ షటిల్ సర్వీస్ దగ్గరికి వచ్చే దారిలో రష్యన్ మిషన్ హౌస్ ఉంది. అక్కడ 5 డాలర్స్ పే చేస్తే లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్లి కొంచెం సేపు గడిపి shuttle సర్వీస్ ఎక్కి పోర్టుకు తిరిగి చేరుకున్నాము. ఈ టూర్ అంతా పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదాన్ని కలిగించింది.

కొద్ది సేపు విశ్రాంతి అనంతరం, “Fortess of Bear” ప్రాంతానికి uber లో వెళ్ళాం. దాదాపు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పట్టింది. ఇది బేర్స్ రిహాబిలిటేషన్ సెంటర్. ఇక్కడ గాయపడిన bears ని తీసుకొచ్చి మెరుగైన చికిత్సను అందిస్తారు. ఇక్కడ బోర్డుపై వాటికి సంబంధించిన వివరాలు అంటే ఎప్పుడు పుట్టింది, సెక్స్, fortess of bear కి ఎప్పుడు వచ్చింది ఇటువంటి వివరాలు ఉంటాయి. ఇక్కడ దాదాపు 7,8 bears కనిపించాయి .ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన ప్రకారం 15, 17 ఉంటాయన్నారు. ఒక అరగంట అక్కడ గడిపి మళ్లీ పోర్టుకు చేరుకున్నాం. దారంతా కూడా కొండలు వాటిపైన మబ్బులతో అత్యంత మనోహరంగా ఉంది. దారిలో ఒక ప్రక్కన ‘వేల్స్ ‘ బొమ్మలు ఉన్నాయి. వాటిని చూస్తూ ఎంజాయ్ చేశాము. అసలు ఈ రోజంతా వాతావరణం చాలా బాగుంది. ఉదయం కొద్దిగా ఆకాశం మేఘావృతంగా ఉంది . కానీ మధ్యాహ్నం వరకు కొంచెం ఎండ వచ్చి అనుకూలంగా మారింది.

వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల పోర్టులోనే కొద్ది సేపు సముద్రాన్ని చూసుకుంటూ నడుస్తున్నాం. ఎండ ఎక్కువగా ఉంటే ‘సీల్స్’ సముద్రాల నుండి బయటకు వస్తాయి .ఈరోజు అంతా ఎండగానే ఉంది. సీల్స్ కనిపిస్తాయేమోనని ఆసక్తిగా “Peir ” వైపు చూస్తూ గమనిస్తూ నడుస్తున్నాం. కొంచెం దూరంలో ఒక చిన్న “క్రేన్” లాంటిది ఉంది .ఆ క్రేన్ పైన ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. ఇంకొంచెం దగ్గరగా వెళ్లి చూస్తే అక్కడ సీల్స్ ఉన్నాయి. వాటిని చూడడానికి జనాలు అప్పటికే గుమి గుడారు . అక్కడ నాలుగైదు సీల్స్ కనిపించాయి. ఒకటి చాలా పెద్దగా ఉంది. వెల్లికిలా పడుకొని ఎండను ఎంజాయ్ చేస్తుంది. పక్కన రెండు సీల్స్ ఆ పెద్ద సేల్స్ మీదుగా పైకి ఎక్కుతూ ఆడుతున్నాయి. ఆ పెద్ద సీల్ వాటికి “అమ్మ” అని మేమే డిసైడ్ అయ్యాం. అమ్మ ఎవరికైనా అమ్మేగా అనుకోని నవ్వుకున్నాం .ఆ రెండు పిల్ల సీల్స్ ఆమెను పడుకోనివ్వకుండా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. సీల్స్ చాలా లేజీగా ఉంటాయి. వాటి స్కిన్ చాలా మెరుస్తుంది. ఇవి చాలా ఫ్యాట్ ని కలిగి ఉంటాయి. ఉత్తర ధ్రువంలోని ఎస్కిమోలు సీల్ చర్మంతో “జాకెట్స్” తయారు చేసుకుని చలి నుండి రక్షించుకుంటారు. అప్పుడప్పుడు ఇవి పోలార్ బేర్స్ కి కూడా ఆహారం అవుతాయి .వీటి అరుపులు ప్రత్యేకంగా ఉంటాయి . వీటి శరీరాకృతికి వీటి అరుపులకు సంబంధం లేనట్టుగా ఉంటుంది. చిన్నగా కీచు గొంతుతో అరుస్తాయి . చాలా దగ్గరగా వెళ్ళలేము. వాసన కూడా అనిపిస్తుంది.

అంతా తిరిగేసి ఇక క్రూజ్ లోపలికి వచ్చాం. ప్రతిసారి బయటకు వెళ్లి మళ్లీ లోపలికి వచ్చినప్పుడల్లా క్రూజ్ సిబ్బంది చూపే స్వాగతం చాలా ఉద్వేగ భరితంగా ఉంటుంది .పాపం వర్షం ఉన్నా కూడా గొడుగులు పట్టుకొని మరీ నిలబడతారు. లోపలికి వచ్చాక వెల్కమ్ డ్రింక్స్ తో “వార్మ్ వెల్కం.” రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుని ,ఎయిట్ డెక్ క్రాస్ వర్డ్ పజిల్ చూడడానికి వెళ్ళాము. దీనికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది .మేము రిజిస్టర్ చేసుకోలేదు . వెళ్లేసరికి థియేటర్ అంతా దాదాపు నిండిపోయింది. అక్కడక్కడ కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. లక్కీగా గేమ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ గేమ్ లో నలుగురు పాల్గొన్నారు. అందులో ఒక ఇండియన్ కూడా ఉన్నాడు. ఈ అబ్బాయి పేరు ప్రణవ్. ప్రణవ్ టెక్సాస్ నుంచి వచ్చాడు. వాళ్లు పార్టిసిపెంట్స్ నేమ్స్ ప్రకటిస్తే ఇండియన్ పేరు ఉంది అనుకున్నా. నలుగురు వాళ్ళు అనుకున్న లెటర్స్ చెప్పాలి . ఇది కొంచెం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ గేమ్ లాగా ఉంటుంది.వాళ్లు ఆ గేమ్ లో ఇచ్చిన వర్డ్ కు మ్యాచ్ అయ్యి ఆ స్పెల్లింగ్ కరెక్ట్ గా అయితే ప్రైజ్ ఇస్తారు. ఉదాహరణకు ” హేరీపాటర్” అనే ఒక word ఉంది .ఇది బాక్స్ లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెటర్ ఓపెన్ చేసి చెప్తే అది వాళ్ళు ఓపెన్ చేస్తారు .అలా మ్యాచ్ అయ్యి వాళ్ళు గెలిస్తే ప్రైజ్ మనీ ఇస్తారు. కొంత ఓపెన్ అయ్యేసరికి తెలిసిపోతుంది. ఆ word ఏమిటో చెప్పొచ్చు. ఇందులో ప్రణవ్ కు 200 డాలర్స్ వచ్చాయి .అలా ఆ గేమ్ 45 మినిట్స్ లో అయిపోయింది. అక్కడనే ఇంకోపక్క మ్యాజిక్ షో ఉంటే దాన్ని చూడ్డానికి వెళ్ళాము. మ్యాజిక్ ఈజ్ మ్యాజిక్ రైట్ ! .కనురెప్ప ఆర్పక ముందే ఏదో జరిగిపోయి ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఈ మ్యాజిక్ షో జరిగే హాల్ కి వెళ్లేసరికి హాలంతా నిండిపోయింది. మ్యాజిక్ చేసే అతను చాలా యంగ్. ఇతను చైనా దేశస్థుడు. అతని అసిస్టెంట్ ముందే వచ్చి ఆమె పేరు మ్యాజిక్ చేసే అతని పేరు చెప్పింది. కానీ ఆ రెండు పేర్లు అంత గుర్తు పెట్టుకునేటివిగా లేవు. మ్యాజిక్ లో భాగంగా ముందుగా కంటిన్యూగా పెద్ద పెద్ద హ్యాండ్ కర్చీప్స్ తీశాడు. ఇది కొంచెం కామన్ గా అనిపించింది. తర్వాత ఆ ప్రేక్షకుల్లో ఒకరిని స్టేజి మీదకి పిలిచి ప్లేయింగ్ కార్డ్స్ చూపించి అందులో నుండి ఒక కార్డు తీసుకోమని చెప్పి, అతని వద్ద కార్డ్స్ అన్ని కలిపి ప్రేక్షకుడి వద్ద ఉన్న సేమ్ కార్డు తీశాడు. అలా ఇంకొకతను పిలిచి “ఉనో “కార్డ్స్ లో నుండి ఒక కార్డు తీయమని చెప్పి మిగతా కార్డ్స్ అన్ని కలిపి మళ్ళీ అలాగే సేమ్ నెంబర్ తో తీశాడు. ఈ షోలో భాగంగా ఒక అమ్మాయిని ఒక టేబుల్ వెనుక నిలబెట్టి తల బాడీ సపరేట్ చేసినట్టుగా చూపించాడు. ఈ సంఘటన నేను కరెక్ట్ గా రాయలేకపోతున్నాను. అన్ని రెప్పపాటులో జరిగిపోయాయి .ఇది ఎక్స్పీరియన్స్ చేయవలసిందే, చెప్పలేము అని నా అభిప్రాయం. అక్కడ ఏమీ జరగదు కానీ జరిగినట్టు చూపించాడు. వావ్ ఏం మ్యాజిక్ చేసాడు అనుకున్నాం. హర్షద్వానాలు, కరతాళాల మధ్య అలా మ్యాజిక్ షో చూసి డిన్నర్ చేయడానికి 16 డెక్ లో ఉన్న గార్డెన్ cafe చేరుకున్నాం.

డిన్నర్ హాల్లోకి వచ్చేసరికి చాలా సందడి సందడిగా ఉంది. గుజరాతీ అమ్మాయిలు (ప్రయాణికులు )చాలా ట్రాడిషనల్ గా తయారై ఒక ఐదు ,ఆరుగురు కలిసి “Garbha “చేస్తూ డిన్నర్ టేబుల్స్ వద్దకు వచ్చారు. వారి డాన్స్ చూస్తూ అందరం ఎంజాయ్ చేశాము. చాలా సరదాగా అనిపించింది. ఎంతైనా యూత్ యూతే. “Young”పిల్లలు తయారైనా, కాకున్నా అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఈ అమ్మాయిలు చాలా బాగా తయారయి డాన్స్ చేయడం కనుల పండుగగా అనిపించింది. ఇక్కడ ఇంకొక ప్రక్క అమెరికన్ అబ్బాయిలు , అమ్మాయిలు కలిసి “Pictionery” ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది చిన్నపిల్లలు ఫుడ్డు తింటూ “Scrabble”ఆడుతూ కనిపించారు .అలా అందరి ఆటపాటలతో ఆ హాలంతా సందడిగా అనిపించింది .డిన్నర్ చాలా రుచిగా ఉంది. కడీ పకోడీ, ఇంకా జీరా రైస్ తిని కొంచెం “డెసెర్ట్ “కూడా తిని అలా నడుచుకుంటూ అబ్జర్వేషన్ డెక్ లో కాసేపు కూర్చున్నాం. అక్కడికి ఒక రోజు పరిచయమైన తెలుగు ఫ్రెండ్స్ వచ్చారు. వారు మాలాగే రిటైర్ అయి తిరుగుతూ ఉన్నారట. వాళ్ళు నెక్స్ట్ క్రూజ్ ప్లాన్ చేస్తున్నారు .అది ఫ్లోరిడా నుంచి బయలుదేరి అట్లాంటిక్ ఓషన్ పై ప్రయాణం చేస్తూ పోర్చుగల్, ఇటలీలోని కొన్ని ప్రాంతాలను టచ్ చేసి మళ్లీ ఫ్లోరిడా చేరుతుంది. ఇది 10 డేస్ టూర్ మమ్ములను” వస్తారా”. అని అడిగారు. మేము ఆలోచిస్తామని చెప్పాను. గుడ్ నైట్ చెప్పుకొని రూమ్ కి వెళ్ళాము…..

(ఇంకా ఉంది)…

Written by Nellutla Indrani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్త్రీ తత్త్వచింతన శిఖరం వాగాంభృణి

అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day