పదిహేడవ శతాబ్దంలో వెలుగొందిన మహిళా కవితా శిరోమణులెందరో ఉన్నారు. విజయనగర చక్రవర్తుల కాలంలో లానే, తంజావూరు, నాయక రాజుల కాలంలో కూడా లలిత కళలన్నీ ఎంతో ప్రాముఖ్యత చెందాయి. తెలుగు సాహిత్యం, సంగీతం నాట్యం, శిల్పం, యక్షగాన వాగ్మయం ఒక మహోన్నత స్థానాన్ని అలంకరించాయి. వీటికి చారిత్రక సాక్ష్యాదారాలు లభించాయి.
ఆనాటి నాయక రాజుల కాలంలో మధుర తంజావూరులో ఉన్న సంసృత, తెలుగు కవులు గురించి 1975 సంవత్సరంలో జరిగిన మొదటి తెలుగు మహా సభల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిచే, తిమ్మావజ్జల కోదండ రామయ్య గారు రచించిన పుస్తకాన్ని అవిష్కరించారు. అందులో వివరించిన మన మహిళా సాహిత్యకారులైన ఆనాటి కావ్య నాయికలే రామభద్రాంబ, మధురవాణి, రంగరాజమ్మ, ముద్దుఫళని.
నాయక రాజులలో రఘునాథనాయకుని అనంతరం విజయరాఘవ నాయకుడు రాజ్యానికి వచ్చి 1663 నుండి 1673 వారకూ పరిపాలించాడు. రఘునాథనాయకుని వలెనే ఈయన కూడా సంగీత, సాహిత్య నాట్యకళలను పోషించాడు. మువ్వగోపాల పదకర్తయైన క్షేత్రయ్య విజయరాఘవనాయకుని ఆస్థానంలో చాల సన్మానాలందుకున్నాడు. ఈ క్షేత్రయ్య పదాలు ఈ నాటికి దక్షిణాపథమంతటా బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇంకా కళాకారులైన పురుషోత్తమ దీక్షితుడు, పసుపులేటి రంగాజమ్మ, కోనేటి దీక్షితుడు, కావరసు వెంకటపతి సోమయాజి, మన్నారుదేవుడు, మొదలైన వారెందరో యక్షగాన రచయితలు గాను, ప్రదర్శకులు గాను ప్రసిద్ధి పొందారు. నాయకరాజుల కాలంలో 54 మంది కవి పండితులు సంస్కృతాంధ్ర భాషల వ్వాప్తికి తోడ్పడ్డారు. నాయక రాజులు ఎంతోమంది కళాకారులకు మణులు, మాన్యాలు, అగ్రహారాలు ఇచ్చి సన్మానించారు. దేవాలయాలకూ, మఠాలకు, సత్రాలకూ, దేవదాసీలకూ మాన్యాలిచ్చారు. ఈయన హయాములో యక్షగాన వాజ్మయం బహుముఖాల విజృంభించింది. ఈయన రాజ దర్బారులో ఒక నాట్య మందిరాన్ని భవ్వంగా నిర్మించి, ఆ రంగస్థలంపై ప్రత్యక్ష్యంగా యక్షగాన ప్రదర్శనాలను ప్రదర్శింప జేశాడు. అనేక ప్రయోగాలను చేయించాడు. రఘునాధాభ్యుదయం అనే విజయరాఘవ నాయకుని నాటకంలో రాజ ప్రాసాదంలోని మనోహర చిత్ర దృశ్యాలూ, అనేక చారిత్రిక ఘట్టాలు వర్ణించబడ్డాయి. ఆంధ్ర తమిళ భాషలను రెంటినీ, కన్నబిడ్డల వలె సమంగా ఆదరించి పోషించారు. ఈ విధంగా దక్షిణ దేశంలో ఆంధ్ర నాయకరాజులు ఒక ఉజ్వలోజ్యల చరిత్రను స్థాపించారు.
ఆనాటి విజయరాఘవ నాయకుని కాలంలోని కవియిత్రి, యక్షగాన రచయిత్రిగా పేరుగాంచినది పసుపులేటి రంగాజమ్మ. తెలుగు సాహిత్య చరిత్రలో స్త్రీలలో మొట్టమొదట కనకాభిషేక సత్కారం పొందిన కవియిత్రి. దేవదాసి కుటుంభానికి చెందిన వెంకటాద్రి, మంగళాంబ దంపతుల కుమార్తె. రంగాజీ అని పిలిచేవారు. ఆమె తంజావూరు నాయక రాజు విజయరాఘవ నాయకునికి భోగపత్ని (1633-1673), ఆమె భర్తగా విజయరాఘవ నాయకుడు ఉన్నాడు. రంగాజమ్మ ఆ తిరుమణికి చెందిన ఆస్థాన కవయిత్రిగా ఉండింది. అతని ఆస్థానంలోని ఆమె ప్రముఖ కవియిత్రి, పండితురాలు. ఆమె రచనల ద్వారా గొప్ప సాహిత్యకారిణిగా ఎంతో పేరుగాంచింది. ఆమె కూడా శతలేఖిని, రాజనీతి, రాజకీయాలలో నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, శృంగార కవిత్వం ఆమె బలం.
స్త్రీ రత్నములు ఆస్థాన కవయిత్రులుగా వెలుగొందారనటానికి రంగాజమ్మగారి మన్నారుదాస విలాసములోని (ప్ర. ఆ. ప-18.) యీ పద్యం మనకు స్పష్టంగా చెప్తుంది.
తే.గీ. అయ్య(దినముల) రామభద్రమ్మ మధుర
వాణికాంబయు సరసగీర్వాణభాష
నిట్టి కృతులను రచియించి యిలను గీర్తిఁ
జాలఁ గాంచిరి సుకవులు సన్నుతింప.
ఆమె రాసిన రెండు తెలుగు కృతులు మన్నారుదాసవిలాసం (విజయరాఘవ నాయకు రాజుకి మన్నారు దాసు అనే మరో పేరు), ఉషా పరిణయం.
ఆమె రామాయణ సారం, భరత సారం, భాగవత సంగ్రహము, యక్షగాన నాటకాన్ని కూడా రాసింది. ఉషా పరిణయం బహుశా ఆమె రచనలలో గొప్పది. తెలుగు భాషలోని గొప్ప ‘ప్రబంధాల’లో స్థానం సంపాదించుకుంది. ఆమె తన యక్షగాన రచనలో విజయరాఘవ సాహిత్య పద్ధతులను అనుసరించింది. ఆమె కవిత్వం చాలా సహజత్వానికి దగ్గరగా సాధారణ స్థాయిలో అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మన్నార్గుడిలోని పీఠాధిపతి రాజగోపాలదేవుని అనుగ్రహంతో ఆమె కవితా రచనలో నైపుణ్యాన్ని సంపాదించిందని ఆమె తన రచనల గద్యలో తెలిపింది.
రంగరాజమ్మగారు నిపుణురాలైన శతావధాని. ఎనిమిది భాషలలో పద్యాలను కూర్చగలరు. ఆమె భరతనాట్య ప్రదర్శనలలో పాడటానికి అనేక పాదాల (శృంగార భావాల పాటలు) రచయిత. ఆమె రాజనీతిని కూడా చదివింది. విజయరాఘవ నాయక రాజు, ఆమె అందచందాలకు, ప్రతిభకు ఆకర్షితుడై ఆమె సాంగత్యంలో ఎక్కువ సమయం గడిపే వాడు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె కవితా నైపుణ్యానికి మెచ్చి తన ఆస్థానంలో కనకాభిషేకం (బంగారు నాణేలతో అభిషేకం) చేసి ఆమెను సత్కరించాడు. ఒక కవయిత్రికి లభించే అరుదైన గౌరవం. ఒక కవయిత్రికి ఈ సన్మానం జరగడం, ఆమె కవితా రచనలో ఆమె నైపుణ్యానికి, రాజుకు, ప్రజలకు ఆమె పట్ల ఉన్న అభిమానానికి రుజువు.
ఆమె ప్రబంద రచనలు 1. మన్నారుదాసవిలాసము 2. ఉషాపరిణయము 3. మన్నారుదాసవిలాసము నాటక రూపం 4. రామాయణ సంగ్రాహము 5. భారత సంగ్రాహము. ఇవేకాక ఆమె అనేక పాద రచనలు చేసారని ప్రాచుర్యంలో ఉంది. కానీ మన్నారు దాసవిలాసము, ఉషాపరిణయము రాత ప్రతులు తప్ప మిగిలినవి లభ్యం కాలేదు. 1926 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారు మన్నారుదాస విలాసము నాటక రూపం పుస్తకంగా ప్రచురించారు. విజయరాఘవ రాజు, రాజకుమారి కాంతిమతి యొక్క వివాహపు వేడుకల సందర్భమే ఈ నాటకపు ప్రధానాంశం. ప్రచురించని ఉషా పరిణయంలో మూడు ఖండాలు, నాలుగవది కొంత భాగం లభ్యమైనది. ఈ రచనకు నాంది విజయరాఘవ నాయక్ నుండి నాయక్ రాజవంశం యొక్క వివరణాత్మక గణనను రచింపబడింది.
మన్నార్గుడిలోని ప్రధాన దైవం అయిన మున్నరుదేవునికి విజయరాఘవ భక్తి, అక్కడ ఉన్న ఆలయానికి విజయరాఘవ ఆర్థిక సహాయం, కానుకలు, మన్నార్గుడిలో ఫాల్గుణ మాసంలో జరిగే మహోత్సవం (తిరునాల్) యొక్క వివరణాత్మక వర్ణన ఈ కృతిలో చోటు చేసుకుంది. ఇది రాజగోపాలస్వామికి అంకితం చేయబడింది. దీనిలో విజయరాఘవ రాజును కీర్తిస్తూ రంగరాజమ్మ దండకాలు రాసినట్టుగా వివరించారు.
ఇవికాక కొన్ని విచ్చలవిడి శృంగార పద్యాలు (కాటుపద్యములు) రంగారాజమ్మ కూర్పుగా అందుబాటులో ఉన్నాయి. అప్పటి ఆమె పరిస్థితుల వల్ల ఆ విధంగా రాయటం జరిగిందని విశ్లేషకుల అభిప్రాయం. రంగారాజమ్మ దేవదాసీ వర్గానికి చెందిన మహిళ. ఆమె వివిధ కళలను అభ్యసించి, వాటిలో నైపుణ్యం సాధించింది. విజయరాఘవ మహారాజు ఆమెపట్ల సన్మోహితుడై, ఎల్లప్పుడూ ఆమె సాంగత్యాన్ని కోరుతూ ఆమెతోనే గడుపుతూ మహారాణిని పూర్తిగా నిర్లక్షంచేసాడు. ఆమె కోపగించుకుని ‘మహారాజుని అన్నివేళలా ఆమె ఇంటిలో ఉంచుకోవటం మర్యాద కాదని‘ దాసీల చేత రంగరాజమ్మకి కబురు చేసింది. ఈ రకమైన అభియోగానికి ఆమె పద్యరూపకంగా తిరుగు జవాబు ఇచ్చింది.
ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగా
రో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి బల్మిచే,
దీవరకత్తెనై,పెనగి తీసుకవచ్చితినా తలోదరీ
‘‘ఏ స్త్రీ అయినా మనలో ఎందుకు తప్పు వెతకాలి? వారు స్త్రీలు కాదా? తమ భర్తలు తమ సొంత సహవాసంలో ఉండేలా వారిని ప్రేమించేలా చేసే నైపుణ్యం వారికి లేదా? రాజు రాణి కౌగిలిలో ఉన్నప్పుడు, నేనేమీ మీగృహంలోకి అన్యాయంగా చొరబడి లాక్కొని వస్తూ ‘ఓహ్! నువ్వు నా ఇంటికి ఎందుకు రాలేదని, అతన్ని తీసుకు వెళ్ళానా?‘
ఇదే విషయంగా మరో సందర్భంలో తన దాసితో సంభాషణల రూపంలోని కొన్ని పద్యాలను రాసినట్టుగా ఉన్నాయి. ‘ఓ అందమైన చంద్రముఖి! నీకు ఇలాంటి సమయాలలో ఎలాంటి పద్దతులు ఉండాలో తెలిసిన మంచి స్త్రీవి నీవు! మరి నా శిరోజాలను మరీ ఇంత వదులుగా జడ వేశావు? అన్న దానికి బదులుగా ఆ చెలికత్తె జడను ఇంతకంటే బిగుతుగా వేయమంటారా అని అడిగిందట. రంగరాజమ్మగారు అవునని నర్మగర్భంగా నవ్వుతూ దానికి ప్రత్యేక ఉపయోగం ఉందని చెప్పింది. పరిచారికకి ఆ ఉపయోగమేమిటో అర్థమై వద్దని వారిస్తూ మహారాజుగారి శరీరం చిగురువలె కోమలమైనది, సున్నితమైనదని ఆయన సుకుమారులని చెప్పిందట. మహారాజు విజయరాఘవ తో ఇలాంటి శృంగార చతురోక్తులతో కూడిన పద్య బాగాలు సంభాషణ రూపకంగా ఆమె రచించినవి దొరికాయని చెబుతున్నారు.
ఆమె రాసిన ఉషాపరిణయము లోని కొన్ని పద్యాలలో ఆమె నైపుణ్యాన్ని తెలియచేస్తుందని సాహిత్య విశ్లేషకుల వివరణ .
చందనారుణ కాంతులు విరిసెడి ముద్దుగొలిపి ఉదయమున,
చంద్రముఖి ఉషా మణిమాలికయై తేజోవిలాసమున.
వసంతముకులిత హృదయము వనితలో వనమాలలా విరిసె,
కనకమయ మయూరపిఛ నృత్యమున రమ్యమై కాంతులె.
అర్థం: ఉషోదయం అప్పుడు ఆకాశం చందనపు రంగులో మెరిసిపోతుంది. ఆ తేజస్సులో ఉషాదేవి మణిమాలలా కనబడుతుంది. వసంతకాలంలా ఆమెలో ప్రేమ వికసిస్తుంది, మయూరాలు నృత్యం చేయగానే సౌందర్యం పరమోన్నతమౌతుంది.
మన్మథుని విల్లు విరిసె, మధుర వాక్యము విరజిల్లె,
హృదయవనమున దహనమయ్యె ప్రేమవిహంగమము.
దివ్యభవనమున గానము వినగ గగనమున సుధా కురిసె,
దయతో మధుకరసమున కురిపె ప్రేమవనితా.
అర్థం: మన్మథుని బాణాలు విరబూశాయి; మధురమైన మాటలు విరజిల్లాయి. హృదయం ప్రేమవనంలా దహిస్తుంది, కానీ దివ్యగానముతో ఆత్మ సేదతీరుతుంది.
రమణముని రూపము రమ్యమై, రమణీహృదయమున చేరె,
కామసుఖమున నిండెదా యమునా తీరమున సుందరముగా.
అర్థం: రమణుడు రమ్యంగా కనబడగా, ప్రియురాలి హృదయంలో ప్రవేశించి, ఆనందసుఖమున యమునాతీరంలా నిండిపోతుంది.
ఈ పద్యాలు పసుపులేటి రంగరాజమ్మ కవిత్వంలోని సౌందర్యభావం, శృంగారరసప్రధానం, సంగీత ప్రకృతి స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఉషాపరిణయము ఒక ప్రేమకావ్యం — ఇది ఉషాదేవి (భానుని కుమార్తె), అనిరుద్ధుని ప్రేమకథను ఆధారంగా చేసుకుంది. ఇది శృంగారరస ప్రధానమైన కావ్యం; మధ్యలో భక్తి, కరుణ, హాస్య వంటి ఉపరసాలు కూడా కనిపిస్తాయి.
ఉషాపరిణయము యొక్క హృదయం శృంగారరసం. ఇది రెండు భాగాలుగా ప్రతిఫలిస్తుంది. సాంప్రోక్త శృంగారము – ఉషా అనిరుద్ధుల ప్రేమ, కాంక్ష, కలయిక. సంజ్ఞాన శృంగారము – విరహం, మనోవేదన, కలల రూపకల్పన.
ఉదాహరణ: మన్మథుని విల్లు విరిసె, మధుర వాక్యము విరజిల్లె. ఇది ప్రేమలోని మొదటి ఉత్కంఠను, ఆకర్షణను తెలుపుతుంది.
ప్రతీకాలు: పద్మము, చంద్రుడు, వసంతము, మయూరం, సుధా — ఇవన్నీ శృంగారప్రతీకాలుగా వాడింది. భాష మాధుర్యభరితంగా, సౌందర్యాన్వితంగా ఉంటుంది. తెలుగు కవిత్వంలో మధ్యయుగ “పద్యకావ్య” పద్ధతికి అనుగుణంగా సమాసాల సమృద్ధి కనిపిస్తుంది. అనుప్రాస, యమక, ఉపమా అలంకారాలు విరివిగా ఉన్నాయి.
ఉదాహరణలు: చందనారుణ కాంతులు విరిసెడి ముద్దుగొలిపి ఉదయమున (అనుప్రాస & దృశ్యరూపకాలు). ఆమె ప్రధానంగా శార్దూలవిక్రీడితము, మందాక్రాంత, సార్దూలిక వంటి ప్రాచీన ఛందోబంధాలను ఉపయోగించింది. ఇది ఆ కాలపు యక్షగాన, కావ్య ప్రదర్శనా రూపకాలుకి దగ్గరగా ఉంటుంది.
ఉదాహరణ: దివ్యభవనమున గానము వినగ గగనమున సుధా కురిసె (ఇది మందాక్రాంత ఛందానికి అనుగుణంగా ఉంటుంది).
రంగరాజమ్మగారు స్త్రీ కవయిత్రులలో మొదటి యక్షగాన రచయిత్రిగా గుర్తింపు పొందింది. ఆమె కవిత్వం స్త్రీ ప్రతినిధిగా, స్త్రీ భావనలను స్వతంత్రంగా వ్యక్తం చేసింది. ప్రేమను కేవలం భౌతిక రసంగా కాక, దివ్య సాన్నిధ్యంగా చూపింది.
రంగరాజమ్మ గారి కవిత్వంలో ప్రకృతి ఉపమాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఉషోదయం, చంద్రము, వసంతము, మయూరాలు, పుష్పాలు — ఇవన్నీ ప్రేమభావానికి ప్రతీకలుగా వాడబడ్డాయి.
ఉదాహరణ: వసంతముకులిత హృదయము వనితలో వనమాలలా విరిసె. ఇక్కడ మనసులో వికసించే ప్రేమను పుష్పవనంతో పోల్చింది.
ఇవి రంగరాజమ్మగారి ఆణిముత్యాల్లో కొన్ని మచ్చుతునకలు. ప్రముఖ కవియిత్రిగా ఆమె గొప్ప సాహిత్య స్థానాన్ని పొందారు. ఆమె తంజావూరు నాయకుల ఆస్థానంలో జీవించారు. ఆమె రచనలు 17వ శతాబ్దపు భక్తిశృంగార యుగ ప్రతిబింబాలు. స్త్రీ కవయిత్రుల చరిత్రలో ఆమెను మొదటి స్వతంత్ర ప్రేమకవయిత్రిగా పరిగణిస్తారు.