ఆమె ఒక లెక్చెరర్ మాత్రమే కాదు ఈత,టేబుల్ టెన్నిస్,యోగ సంగీతం సాహిత్యంలో రాణించిన ఆల్ రౌండర్.ఆమెయే మంథా భానుమతిగారు.అన్నిట్లో ప్రవేశంకి వయసుతో సంబంధం లేదు అంటారామె.కానీ సాహిత్యంలో సాధన కృషి ఆసక్తితో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.56వ ఏట ఈత,40దాటాక టేబుల్ టెన్నిస్,యోగ రిటైరైనాక సంగీతంలో డిప్లమా చిన్న చిన్న కచేరీలు చేయటం అందరికీ స్ఫూర్తిదాతగా నిలవటం కదూ? రసాయన శాస్త్రంలో అమెరికాలో యూనివర్శిటీ ఆఫ్ డెన్వర్ లో ఎం.ఎస్.చేశారు.పిల్లలని భర్త చూసుకున్నారు ఓఏడాది పాటు.
ఉస్మానియాలో పి.హెచ్.డి చేసిన ఆమె 20ఏళ్లు కెమిస్ట్రీ లెక్చెరర్ గా పనిచేశారు. 9_10 ఏళ్ల వయసు లో లైబ్రరీకెళ్లి పుస్తకాలలో మునిగిపోయి డిటెక్టివ్స్ ఇంగ్లీష్ నవలలు కూడా ఆపోసన పట్టారు.పెళ్లయిన 10ఏళ్లకి ఎం.ఎస్సీ.చదివారు.
11 జనవరి1946లో అమలాపురం లో వడ్లమాని సుభద్ర, సత్యనారాయణ మూర్తి గార్ల పుత్రిక గా చదువులో రాణిస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు.తండ్రి పుస్తక ప్రియుడు,తల్లి భాగవతపద్యాలు రామాయణ గానం వింటూ పెరిగిన భానుమతి తండ్రి రిటైరైనప్పుడు 4వక్లాస్ చదువుతున్నరోజులవి.ఎసెల్సీ స్కూల్ ఫస్ట్ బి.ఎస్సీ ఫస్ట్ క్లాస్, డిమాన్ స్ట్రేటర్ ఉద్యోగం,పెళ్లి పిల్లలు ముఖ్య ఘట్టాలు.
2000 లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆమె కుటుంబ బాధ్యతలు పూర్తవటంతో రచనావ్యాసంగం,విహారయాత్రలతో పరిపూర్ణమైన జీవితం గడిపారు.2004నుంచి సాహిత్యం ఆమె జీవితంలో భాగమై 25నవలలు,100కి పైగా కథలు రాశారు.”అగ్గిపెట్టెలో ఆరుగజాలు” ఆంధ్రభూమి వారపత్రిక లో 5నెలలు సీరియల్ గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చింది.6నెలలు మంగళగిరి,బండార్లంక,పోచంపల్లి,సేలం మొదలైన ప్రాంతాలకెళ్లి మగ్గాల దగ్గర పనిచేసేవారిని కల్సి రాసిన నవల అది.వారి జీవన శైలి వారిపూజలు ఆచార్య ఆచారవ్యవహారాలు అన్నీ రంగరించు రాసిన నవల అది.ఇక “జనని” లో ఎరువుల గూర్చి, రామాయణం మామయ్య లో వితంతువివాహసమస్య, మాయపండు నవలలోకృత్రిమరసాయనాలగూర్చి రాయడం ఈమె రచనల్లో ప్రత్యేకత అని చెప్పొచ్చు.”మౌనంగానే ఎదగమనీ” స్వాతిమాసపత్రికలో అనిల్ అవార్డ్ గెలుచుకున్న రచన.శృంగార కథల పోటీలో కూడా బహుమతిపొందిన ఆమె కి ఎందరో ప్రశంసావర్షం కురిపించారు.ముఖ్యంగా సినీదర్శకుడు ప్రత్యగాత్మ గారి భార్య 85 ఏళ్ల సరస్వతి గారు రాసిన లేఖలు అపూర్వ బహుమతులు అంటారు భానుమతిగారు.ఆమె కలం నుంచి యువత కి ఉపయోగ పడే రచనలు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను
