రాక్షసుల చేతుల్లో నలిగిన బాల్యాలు,
చిన్నారి కళ్లలో చెదిరిన స్వప్నాల జాల్యాలు;
పుట్టకముందే పూడిపోయిన ఆశల గాల్యాలు,
నిశ్శబ్ద రాత్రుల్లో రోదించే మానవ బాల్యాలు.
బాల్యం అనే పువ్వులు వికసించకముందే వాడిపోయె..!
రక్కసుల స్పర్శలో పవిత్రత అంతా రాలిపోయెను;
నిర్దయ నేలపై కన్నీటి బిందువులు నిలిచిపోయెను,
మనసుల గాయాల్లో కాలం నిశ్శబ్దంగా నిలిచిపోయె..!

మృగాలు సైతం తలదించు నీచత్వం మనిషిలోనె కనిపించె..!
చట్టపు నీడలో దాగి దోషి నిర్భయంగా నడిచె..!
న్యాయం గదుల్లో ధనం కనిపించని గాలిలా
ప్రవహించి సత్యం మూగబోయి మౌనంలో కరిగిపోయె..!
ఆలయ గోడలపై ధర్మం అక్షరాలుగా నిలిచినను,
బడి గడపలపై నీతి సూక్తులు వెలిగినను,
లోపల న్యాయం ధన ప్రవాహంలో కొట్టుకొనిపోయె,
సమాజం మాత్రం మౌన సాక్షిగా నిలిచిపోయె..!
తల్లి తండ్రుల నిర్లక్ష్యంలో యువత మార్గం తప్పి
అజ్ఞానం ముసుగులో బాధ్యతల భారం మసకబారెను..!
చరిత్ర రాయబోయె నాయకులే చీకటిలో మునిగెను..!
మానవత్వం మౌనంగా కాలగర్భంలో కరిగెను..!