ప్రాణనాథుడు

మీ పాదపద్మములను తప్ప,ముఖారవిందమును సైతం సూటిగా ఎన్నడూ చూడలేదు సీతమ్మా అంటూ వాపోయిన బిడ్డ వంటి మరిదిని..

మాకోసం తన ధర్మపత్నిని వదిలి వచ్చిన లక్ష్మణపతిని..
నీకు నాపై ఎప్పటినుండో మోహం ఉన్నది అంటూ ఘోరమైన అపనిందను మోపాను!

అన్న ఆజ్ఞను మీరలేను. మీ రక్షణ నా కర్తవ్యం అమ్మా! అంటూ ఎంతో బాధ్యతగా వ్యవహరించిన,మాకు నీడలా తోడున్నవానిని కఠినమైన మాటలతో తూలనాడాను!

అతను గీసిన గీతను దాటి..
ఈ రావణుని పాలబడు దుస్థితిని కొనితెచ్చుకున్నాను!

మరి ఏమి చేయుదును…?!

హా!సీతా! అని ప్రాణనాథుని ఆర్తనాదము విన్నవెంటనే నా ప్రాణము ఆగినంత పని అయినది.

ఎంతకూ ఉన్నచోటునుండి కదలని లక్ష్మణుని..
ఆరాటంతో, ఆతృతతో అతని సున్నిత హృదయాన్ని మాటలతో గాయపరిచి,తన అన్నగారి ఆచూకీ తెలుసుకుని,ఆపద నుండి కాపాడమని వేడితిని!

అతనికి అన్నగారి అనుజ్ఞపై గురి!

నాకు నా ప్రాణనాథునిపై ప్రేమ!

ఇందు నా దోషమేమియో అవగతం అవకున్నది!

విధి వైపరీత్యమిదేమో అని గాఢంగా తోచుచున్నది!
**************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తప్పదు కదా..!

చీకటి నీడల్లో బాల్యం