తెలుగు, కన్నడ ఆడబడుచులoదరూ ఏడాదంతా ఎదురుచూసే బంగారు పండుగ వరలక్ష్మీ వ్రతం. శ్రావనమాసంలో పౌర్ణమి కి ముందుగా వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే సౌభాగ్యాల వేడుక ఈ పండుగ. చారుమతి కలలో కనిపించి వ్రత విధానము, సమయము, వైశిష్ట్యం వివరించిన వరలక్ష్మి అమ్మవారు జాతి, కుల భేదం లేకుండా నన్ను పూజించండీ, సిరులవాన మీ ముంగిట కురిపిస్తానని వరమిచ్చింది కదా! ముత్యాల చిరుజల్లులు కురిసే వర్ష ఋతువు. పున్నమి చంద్రుని రాకను సూచిస్తూ వెలిగే వెన్నెలల ఆకాశం. పొలాల నిండా మొలకల సిరి. ఆహ్లాదమైన ఈ తరుణంలో ఆడపిల్లలు ఆనందంగా కొత్త బట్టలు, నగలు, పూలు, గాజులు ధరించి ధరించి లక్ష్మీపూజ చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ఇది కేవలం ఆడవాళ్ళ పండుగే అనుకుంటే పొరపాటే.
కొసరాజు గారన్నట్లు ఆడుతూ, పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది? ఆడవాళ్ళకి ఆసరాగా, భర్త, కొడుకులు కూడా ఓ చేయి వేస్తే, ఈ పండుగ వేడుక యమహా గా ఉంటుంది. పూలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, శెనగలు, కొబ్బరికాయలు, మావిదాకులు ముందురొజే తెచ్చి ఇచ్చేస్తే ఓ పనైపోతుంది. ఎంచక్కా, గుమ్మాలకి తోరణాలు కట్టి, పీఠాన్ని సిద్ధం చేసి, అమ్మవారి అలంకారంలో సాయం చేస్తే ఎంత బాగుంటుందో కదా! తొమ్మిది వరసల తవరాలకి తొమ్మిది ముడులేసి, పూలు కట్టిస్తే పుణ్యం కూడానూ. సాయం చేసిన మగానుభావుడికి ,ఎటూ మూడో, అయిదో, తొమ్మిదవ పిండి వంటలు అమ్మవారికి నివేదిస్తారు కనుక, మృష్టాన్న భోజనం కూడా టేస్టీ గా దొరుకుతుంది. అమ్మవారి దీవెనలు మగాళ్ళకి బోనస్ గా లభించడం గ్యారంటీ.
ఈ ఆడవాళ్ళకు పనీ పాటా లేదు ఎప్పుడూ ఏవో పూజలు చేస్తారు అని అంటారు చాలా మంది మగవాళ్ళు. ఇది నిజమా? ఇదే నిజమా? కాదు! కానే కాదు!! జీవితం కష్ట నష్టాల సంగమం . సుఖ దుఃఖ సంగమం. వీటినుంచి తమను తాము కాపాడుకోవడానికి ఒక ఆసరాగా ఉండేదే భక్తి! పూజలూ వ్రతాలూ ఆత్మ నిగ్రహం కోసం సాధనాలు.
ఇప్పుడు జిమ్ కి వెళ్ళడం , జాగింగ్ కు వెళ్లడం, కౌన్సిలింగ్ సెంటర్స్ కి వెళ్లడం వెస్ట్రన్ మ్యూజిక్ , డాన్స్ లు చేయడం వంటివన్నీ పూర్వం నుంచి పూజలలో సంపాదించుకునేవాళ్లు. మరి ఈ మాడర్న్ యుగం లో అన్ని అందుబాటులో ఉండగా ఇవెందుకు అనీ అడుగుతారు మీరు! కానీ ఎప్పుడు ఎక్కడ నుంచి ఎలాంటి ఆపదలొస్తాయో ఏమో? ఏం తెలుస్తుంది? అయ్యే నష్టం అయ్యాక ఏం చేయగలం?
ఈ ఆలోచనలు కూడా చేయాలి మన పెద్దలు ఏర్పరిచిన నియమాలను పాటిస్తూ చక్కగా ఇంట్లో నే భగవంతుని ముందు కూర్చుని భక్తి తో ఇలాంటి ధ్యాన సాధన నో పూజాదికాలో చేయటం వల్ల అన్నింటికీ అందరికీ హాయిగా ఉంటుంది.
ఏమంటారు? కాన్సంట్రేషన్ పెట్టడం అనేది అన్ని విధాలా మంచిది.
ఇకపోతే , ఈ వ్రతాల కేవలం ఆడవాళ్లకే కేటాయించారు అనకండి. వ్రతాలూ నోములూ మీ కోసం కూడా! సౌభాగ్యం అంటే పురుషుల దీ అని సో.. ఫ్రెండ్స్ మగవాళ్ళు కూడా చేయాలి.
అందుకే అబ్బాయిలూగరిట అందుకోండి! అమ్మవారి అనుగ్రహం పొందండి.