తప్పదు కదా..!

కవిత్వం

నా కాలంలో సిరా అయిపోయినట్టుంది
అందుకే అక్షరాల పాట పాడడం లేదు
ఓ సారి నా మెదడుని మందలించాలి అనుకుంటా
ఏ బద్దకపు చీకట్లో నిద్రిస్తుందో..?
పిచ్చి ఆలోచనల దుప్పటి కప్పుకుని
ఏ గుహలో కూర్చుందో..?
నా మనసు బాగా మతిమరపు మందుకి మరిగిపోయినట్టుంది
ఇక రాయిని శిల్పి చెక్కినట్టు
నేను నా మనసుని ఉత్తేజపు ఆలోచనలతో పదునెక్కించాలి
కాని నేనేం చేయను అక్షరాలని ఏమి అనకముందే
నాతో గొడవ పడ్డట్టు మాట్లాడడం మానేసాయి
నేనేదో తన శత్రువున్నట్టు నా దరి చేరడం లేదు
నేను కాగితాన్ని ఒక్క మాటా అనలేదు
కాని నాతో స్నేహం చేయడమే మానేసింది
నేను ఏమి చెప్పినా విననంటుంది
ఏమో ఈ కాగితానికి నా గురించి ఎవరు ఏం చెప్పారో. .?
ఇప్పుడైనా నా మెదడుని ఆ గాఢ నిద్రనుంచి లేపి
ఆ పిచ్చి ఆలోచనల దుప్పటిని
చించి పడేయమంట
నా కలంలో సిరా నింపి
అక్షరాల పాట పాడమని చెప్తా
అక్షరాలని ఓ సారి అడుకుతా నాతో మాట్లాడమని
స్నేహ భావంతో చూడమి
కాగితాన్ని బతిమాలుతా నాతో స్నేహం చేయమని
నేను చెప్పింది వినమని
ఎందుకంటే మరి జీవితంలో అందనంత శిఖరాలను
అందుకోవాలంటే
వీటిని అడగక తప్పదు కదా..!
బతిమాలకా తప్పదు కదా…!

Written by P. Bhavyasri

9వ తరగతి
జి.ప.ఉ.పా రంగంపేట,మెదక్ జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్ఫూర్తి ప్రదాతలు మార్గదర్శకులు…

ప్రాణనాథుడు