స్ఫూర్తి ప్రదాతలు మార్గదర్శకులు…

 ఉద్యమాలకు ఊపిరిలూది సమర శంఖం పూరించిన స్ఫూర్తి ప్రదాతలు వీరు …
చాకలి ఐలమ్మ దొడ్డి కొమురన్న సర్దార్ పాపన్నల తేజం వీరు… కాకతీయుల రాణి రుద్రమ్మ ప్రతాపరుద్రుని రోషం వీరు …

ఓటమిని గెలుపుగా మార్చిన యోధులు వీరు..
తమ ఆశయాల కోసమే శ్వాసించే మహనీయులు వీరు….
నిస్వార్థమే ఊపిరిగా సమాజానికి వెలుగులు పంచిరి వీరు… చరిత్రపుటలలో చెరగని ముద్రగా నిలిచిరి వీరు…

చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణం వీరు. అలసిన గుండెల్లో నింపే నూతన చైతన్యం వీరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ధైర్య సాహసులు వీరు…
భావితరాలకు మార్గదర్శకమయ్యే అడుగుజాడలు వీరు.

మట్టి వాసనను అక్షరాల్లో నింపిన అలంకారం వీరు. హక్కుల కోసం గర్జించిన విప్లవ శంఖం వీరు.. తరతరాలకు తారక మంత్రం వీరో
అమర కావ్యం.. తెలంగాణ మాండలికానికి ఊపిరిలు ఊదిన నినాదం వీరు…

అన్యాయాన్ని అడ్డుకున్న ధైర్యం కాళోజి.. పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అన్నారు వీరు …
ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో చైతన్యాన్ని రగిలించినారు… ముక్కుసూటి తనంతో నిలువెత్తు ఎదిగిన నిప్పు కనిక వీరు…
సమ్మక్క సారక్క తెలంగాణ ఎల్లక్క భద్రకాళి పౌరుషం వీరు. పూర్తి ప్రదాతలు మార్గ నిర్దేశకులు వీరే వీరే మనకు ఆదర్శప్రాయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కథల పోటీ – 2026

తప్పదు కదా..!