రామచంద్ర రావు షావుకారు ఇంటికి సమీపంలో అనేక దార్లు కలిసే కూడలి ఉంది. అతని ఇంటి ముందు కొన్ని ఎద్దుల బండ్లు ఎల్లప్పుడూ ఉంటాయి; కొందరు ఆ ఎడ్లబండ్ల పైకి ధాన్యం బస్తాలు చేర్చటానికి లేదా అందులో ఉన్నవి కిందకు దింపటానికి ఎదురు చూస్తుండగా.. ఇతరులు మరమ్మత్తులు చేస్తూ ఉన్నారు. వారిని చూసేందుకు పిల్లలు గుంపులుగా చుట్టూ మూగారు. వడ్డీ వ్యాపారి గుర్రాలు కొన్ని గడ్డి పరకలు కొరుకుతున్నాయి. తుంటరి గుర్రాలు కొన్ని గడ్డి గురించి ఎగురుతున్నాయి, వాటి ముందరికాళ్ళు కలిపి కట్టి ఉన్నాయి. నీడలో కొన్ని ఎడ్లు మగతగా జోగుతున్నాయి. కొన్ని ఎడ్లు తోకలను విదిలిస్తూ వాటి పుళ్ళ మీద వాలిన ఈగలను తోలుకుంటున్నాయి.
షాహుకారుకు పెద్ద బలిష్టమైన ఎడ్లు చాలా ఉన్నాయి. ఆ వడ్డీవ్యాపారి ఇంటిలోకి ప్రవేశించడానికి, మొదట అతని ధాన్యపు గిడ్డంగి దాటాలి. అది వడ్లు, బియ్యం, మాన్డియా మరియు ఇతర ధాన్యాలు నింపిన జనపనార సంచులు , వెదురు తడకలతో తయారు చేసిన గుమ్ములతో నిండిపోయి ఉంటుంది.
ఈ ధాన్యపు గిడ్డంగుల తర్వాత ఒక పెద్ద ఖాళీ ప్రాంగణా వస్తూంది. అక్కడ వరి, మిరపకాయలు, నూనె గింజలు, ఇతర పంటలు ఎండబెడతారు. ఆ రాజ ప్రాంగణము దాటిన తరువాత అతని కుటుంబ సభ్యులు నివసించే గదులు వస్తాయి. ఆ ఇంటి ప్రణాళిక విలక్షణమైనది. దక్షిణ ప్రాంతంలో రుణదాతల గృహాలు ఇట్లానే ఉంటాయి.
వరండా కూడా ధాన్యం సంచులతో పేర్చి ఉన్నాయి; ఒక మూలలో భారీగా ధాన్యాన్ని తూకం వేసే సామాన్లు, ఒక జత విరిగిన మంచాలు, ఒక కుప్ప పాతకుర్చీలు, ఇంకా ఇతర సామాన్లున్నాయి. ప్రవేశ ద్వారం భారీ కొయ్య తలుపులతో రక్షణగా ఉన్నది. వాటిని బలోపేతం చేసే పెద్ద ఇనుప గడియలతో బేడాలతో ఉందది.
ఇల్లంతా ముక్కిన ధాన్యపు బస్తాల కంపు, పశువుల ఎరువు, మరియు సేవకుల చెమటతో నిండిపోయింది. అయినప్పటికీ షాహుకారు సంపద అనే పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అది
షాహుకారు మహావైభవాన్ని ప్రకటిస్తూండగా కొన్ని మైళ్ళ దూరంలో ప్రజలు అతని హానికరప్రభావానికి, దోపిడీకి గురయ్యారు. కనుచూపుమేర సర్వసంపదలను అతని సొంతం చేసుకున్నాడు. ఇళ్ళు, ధాన్యాగారాలు, విశాలమైన పొలాలను , పళ్ళతోటలను ఆక్రమించుకున్నాడు.
షాహుకార్ సామ్రాజ్యానికి ఇరువైపుల రెండు చిన్న, నికృష్ట గ్రామాలు ఉన్నాయి. ఉనికిని కోల్పోయి చిరిగిన కప్పులతో కూలే మట్టి గోడలతో అలిసిపోయినట్లుగా, గాలి మరియు వర్షానికి ఆకులు రాలిన చెట్టులా బోడిగా కనిపిస్తూ. పురుషులు, మహిళలు దీనంగా ఉంటారు. పిల్లలు, కోళ్లు, కుక్కలు, పందులతో కలిసి దుమ్ములో దొర్లుతూ వుంటారు. ఈ గ్రామాలలో అన్ని రోజులలో వినవలసిన ఏకైక ధ్వని ఆకలితో ఉన్న పిల్లల ఏడుపు;
వారి తల్లిదండ్రులు సూర్యోదయ సమయంలో గుడిసెల నుండి బయటకు పోతే చీకటి పడే వరకు తిరిగి రారు. వారి జీవితాల సూర్యోదయ, సూర్యాస్తమయ మధ్యకాలమంతా సాహుకారుకు చెందినది. వారు అతని గోటిస్. అంటే రుణగ్రస్త సేవకులు, బానిసలు.
ఇరువైపులా కష్టాలతో కూడిన రెండు గోటీల కాలనీలు సాహుకార్ యొక్క వైభవము కొరకే ఏర్పడ్డాయి.
ఆ గుడెసెలు కూడా తమ సొంత కథలు చెపుతాయి. వాటిలో ఒకప్పుడు కష్టపడి పనిచేసే రైతులను కష్టాలపాలు చేసిన దురదృష్టాల గురించి, గౌరవ జీవనం గడిపేవారి జీవితాల గురించి. ఈ సకల భూములు వారి పూర్వీకుల సొంతమని. అప్పుడు మొదటి సారాబట్టీ గ్రామాల సమీపంలో పుట్టుకొచ్చింది. గిరిజనులు రోజు పని తర్వాత మద్యం లేకుండా ఉండ లేరు, మరి వడ్డీ వ్యాపారి వారిపట్ల చాలా ఆసక్తిని చూపేవాడు, వారికి ఉపకారం చేస్తున్నట్టు నటిస్తూ సిద్ధంగా ఉండేవాడు. వారు చెల్లించాల్సిన డబ్బు లేనప్పుడు, అతను వారిని త్రాగమని, డబ్బు తర్వాత చెల్లించవచ్చు అని వత్తిడి చేసేవాడు. అట్లా తరచుగా జరిగేది.
చాలా రోజుల తరువాత ఒక సారి ఒక రైతు పొలంలో పనిచేస్తూండగా వెళ్ళి అతడి పనిని ఆపి “ఇదిగో చూడు, నువ్వు నాకు మద్యం బాపతు మూడు స్కోరుల డబ్బు ఇవ్వాలిసి ఉంది. అప్పు తీర్చు లేదా బదులుగా ఈ భూమిని ఇవ్వూ..” అన్నాడు. ఆవిధంగా ఎందరో వ్యవసాయ భూములను తన వశం చేసుకున్నాడు షావుకారు.
ఆ తరువాత, ప్రభుత్వం కలుగచేసుకొని వడ్డీవ్యాపారి మద్యం దుకాణాన్ని తీసివేసింది; కానీ ఆ రుణదాత ఆ గిరిజన రైతుల పొలాలన్నీ తీసుకున్నాడు. ఇదీ అసలైన పాత కథ.
మరి ఈ గుడిసెలు అటువంటి ఎన్నో సంఘటనలకు సాక్షాలు. వడ్డీ వ్యాపారి శక్తి పెరగడం, కొత్త భవనాలు అతని కోసం నిర్మించబడటం, అతడి ఆధీనంలో ఉన్న వారి పొలాలు అతను స్వాధీనం చేసుకోడం, అన్నీ ఒకదానితో ఒకటి జరిగిపోయాయి. ఆ గుడిసెలు అన్నీ చూస్తూనే ఉన్నాయి. కొత్తగా జరుగుతున్న కొన్ని సంఘటనలను నిశ్శబ్దంగా తేరిపార కళ్ళు తడివారి అలిసిపోగా నోళ్లు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాయి గుడిసెలు.
ఆ గుడిసెలు తాము పాతబడి వంగి పోతుండగా ఆ వడ్డీ వ్యాపారి మాత్రం కొత్త పండ్ల తోటలను, కొత్త రోడ్లను వేస్తూ అభివృద్ధి చెందడం చూస్తూన్నాయి.
అతడు అభివృద్ది చెందుతూనే ఉన్నాడు గుడిసెలపై గడ్డి గాదం చెత్తాచెదారం పేరుకుపోయింది.
ఆ గుడిసెలో నివసించే గిరిజనులలో ఎడతెగని భయం కలిగించాడు షావుకారు. అతను వారిని అసహ్యించుకునే వాడు. వారిపైకి పోలీసులను పంపేవాడు . చాలామంది అధికారులతో షాహుకార్ కు స్నేహం ఉండేది. వారు గ్రామాల మీదికి వెళ్ళాలనుకున్నపుడు జమిందారులు, భూస్వాములు, వ్యాపారులు, అధికారులు అందరూ షావుకారి ఇంట్లో చేరేవారు.
పోలీసులు గిరిజనులను వేధించే అనేక మార్గాలు కనిపెట్టేవారు; వారిపై నేరాలు మోపేందుకు ఏ కారణం దొరకకపోతే ఏదో ఒక అభియోగం చేసేవారు.
మద్యం దుకాణాన్ని ప్రభుత్వం మూసిన తరువాత, వడ్డీ వ్యాపారి సాధారణ వస్తువుల దుకాణం ప్రారంభించాడు, అతను గిరిజనులకు ధాన్యాన్ని అప్పుగా ఇవ్వడం ప్రారంభించాడు. మరి దానిని పంట వచ్చిన తరువాత తిరిగి వడ్డీతో సేకరించడం ప్రారంభించాడు. అతని వ్యవహారాలన్నీ చీకటి నీడలలో జరిగేవి కానీ అతని ఆస్తులు మాత్రం చుట్టూ ఎత్తుగా పెరిగాయి.
ఒక గిరిజనుడు రుణం కోసం సాహుకారు వద్దకు వచ్చినపుడు, సాహుకార్ తనకు తానుగా అనుమతి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఒప్పందం ప్రకారం పుట్టి ధాన్యానికి అరపుట్టి వడ్డీతో తిరిగి ఇవ్వాలి. మరి ఆ మనిషి వెళ్ళబోతున్నప్పుడు, షాహుకారు “ధాన్యాన్ని తీసుకువెళుతున్నావా” అని అడుగుతాడు.
“అవును, షాహుకార్ “ అంటాడామనిషి .
“ఎంత తీసుకుంటున్నావు” ,
“ఒక్క పుట్టి”.
ఇప్పుడు పుట్టి ధాన్యాన్ని తీసుకుంటున్నట్టు తన పుస్తకాల్లో రాసుకుంటాడు.
“నా గుమస్తాకు సమాచారం అందించావా?” అంటూ సాహూకార్ మళ్లీ అడుగుతాడు. గిరిజనుడు గుమస్తాకు చెపుతాడు. గుమస్తా లెడ్జర్లో రాసుకుంటాడు.
సాహుకార్ మళ్ళీ . “నా భార్యకు సమాచారం అందించాలి. ఆమె ఇంటి లోపల ఉంది. వెళ్ళి ఆమెతో చెప్పు. నా పనివాడికి కూడా చెప్పు” అంటాడు.
“సరే, సాహుకర్” అని ఆ మనిషి వాళ్ళకు కూడా చెప్పి బయలుదేరడానికి సిద్ధపడతాడు. సాహుకారుతో పాటు, ధాన్యం పుట్టీని యాభై శాతం వడ్డీకి అప్పుగా తీసుకుంటున్నట్టు ముగ్గురికి చెప్పాడు. ప్రతిసారి ఎంట్రీ ఇవ్వబడుతుంది.
పేద గిరిజన కొండ్ జాతి లేదా పరజా జాతిలో ప్రతి ఒక్కరు అప్పు తీసుకుంటున్నట్టు ముగ్గురికి సమాచారం ఇవ్వాలి. మరుసటి సంవత్సరం రుణగ్రహీత పుట్టీ, ధాన్యంతో వడ్డీ కలిపి చెల్లించేందుకు తిరిగివస్తాడు.
ఆ రుణం అంతటితో అప్పు క్లియర్ చేయాలి. కానీ “ఇంతేనా? ” ధాన్యం కుప్పను చూస్తూ సాహూకర్ అడుగుతాడు.
” అవును, సహూకార్. ఒక్క పుట్టీ ఋణం, దానిమీద వడ్డీ సగం పుట్టీ” అంటాడా గిరిజనుడు.
“ఒక పుట్టీనా పిచ్చివాడివా? నా నుంచి ఒక పుట్టీని, నా గుమస్తా నుంచి ఒక పుట్టీ, నా భార్యనుంచి ఒక పుట్టీ, నా సేవకుని నుంచి ఒక పుట్టీ తీసికెళ్ళావు. ఎన్ని పుట్లయినయి? లెక్కించు, నాలుగు పుట్ల మీద వడ్డీ ఉందా? రెండు పుట్టులు. కాబట్టి మొత్తం ఆరు పుట్లు తెచ్చి ఉండాలి; దానికి బదులుగా ఒకటిన్నర మాత్రమే తెచ్చావు, ఎందుకని అట్లా తెచ్చావు. వడ్డీ కూడా దీని కంటే ఎక్కువ! నీకు అర్ధమవుతుందా?” అంటాడు.
“కాలేదు సాహుకార్,” అని తికమక పడతాడు గిరిజన యువకుడు.
“కానీ తప్పని సరిగా మీరు చెప్పిందే సరైనది ” అంటాడు. మరి ఆ పేదవాడు షావుకారు గాలానికి చిక్కాడు. అట్లా మరొక గోటి(ఋణగ్రస్త కార్మికుడు ) పుట్టాడు.
ఇటువంటి వీటన్నిటికీ ఆ గుడిసెలు సాక్షాలు. మరియు వారి క్షీణత ప్రతి దశలో షావుకారు సంపదకు ఒక కొత్త అధ్యాయం మొదలయింది. గిరిజనులకు చట్టమంటే సహజంగానే భయం ఉంది; చట్ట విరుద్ధంగా ఏది చెయ్యలన్నా భయపడతారు. ఆ భయమే సాహుకారుకి బలాన్ని ఇచ్చింది. రెండు మంటల మధ్య గిరిజనుడు కాలిపోతున్నాడు .
పేద గిరిజన గోటికి సాహుకార్ మధ్య జరిగిన ఒప్పందంలో నిబంధనల గురించి అతనికి ఏమీ తెలియదు. అతను తన సొంత బండ గుర్తుల కొలమాన వ్యవస్థ కలిగి ఉన్నాడు. అందులో పొడవైన ఒకతాడు ఉంటుంది, దానికి ప్రతి సంవత్సరం ఒక ముడి వేస్తాడు. ఆ ముడులు లెక్కింపు ద్వారా, ఎన్ని సంవత్సరాలు గడిచాయి , ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిస్తే తన స్వేచ్ఛను తిరిగి పొందగలడో చెప్పగలుగుతాడు. కానీ ఈ ముడుల మూర్ఖపు లెక్కలను సాహుకర్ లెక్క చేయడు.
అతను తన సొంత పద్దతిలో ఎరుపు మరియు నీలం సిరాతో లెడ్జర్ లో గీసిన వింత గీతలు, అమాయక గిరిజనుణ్ణి తికమకపెట్టి పరిష్కారం దొరకనివ్వవు. మాయాజాలంలా అంకెలు పెరుగుతూనే ఉంటాయి. ఆ అమాయక గిరిజనుని అప్పులు సంవత్సరం సంవత్సరం పెరిగి, అతని బానిసత్వానికి ఎప్పటికీ ముగింపు దొరకదు.
ప్రతి గిరిజనకొండ నుండి ఎర్రటి దారులు వచ్చి సాహుకార్ ఇంటికి చేరేవి. సాలెగూటి దారపు పోగుల వలె సుదూర కొండగ్రామాల నుండి గిరిజనులు సాహుకార్ ఇంటికి వచ్చేవారు. కొంతమంది తమ భార్యల ఆభరణాలను, చిన్న బట్టలో చుట్టి తెచ్చేవారు. కొందరు వారి పొలాల నుండి పంటను తీసుకువచ్చారు. మరి కొందరికైతే కుదవ పెట్టడానికి ఏమీ ఉండేవి కావు శరీరాలు తప్ప. మరి సాహుకార్ ఇల్లు ప్రతిదీ మ్రింగేసేది. మరి ఎప్పుడూ అవి తిరిగి వచ్చింది లేదు; ఆవిధంగా సాహుకార్ ఇల్లు నిండిపోయేది.
కొన్నిసార్లు సాహుకారు తన దుస్సాహసాలతో గిరిజనులను వేధించినా, నిరాహార దీక్షలు చేస్తూ అతనికి లొంగేవారు కాదు. కానీ సాహుకారకు వారిని వారి స్థానంలో ఎలా పెట్టాలో తెలుసు.
ఆ సంవత్సరం సాహుకార్ కోపం సామ్యా పై పడింది. గిరిజనుడి పొలాన్ని మోసపూరితంగా తాకట్టు పెట్టించుకొన్నాడు, అందులో మొక్కజొన్నపంట ఉన్నది. దాని చుట్టూ ఒక కంచె వేసి, ఒక కాపలాదారుని కూడా పెట్టాడు. మొక్కజొన్న పంట చాలా బాగుంది. సామ్యా రెండురోజులుగా ఏమీ తినలేదు, అతను కొండదిగువ నది వైపు వెళుతున్నాడు. అతను రెండవసారి ఆ రాత్రి తన ఖాళీ కడుపుని నీళ్లతో నింపుకున్నాడు. మొక్కజొన్న కండెలు ఆకర్షణ కలిగిస్తూ ఆకలిని పెంచాయి: అతను కంచె నుండి తన చేతిని పెట్టి రెండు కండెలు తెంపాడు. ఒకటి తింటూ రెండవది చేతిలో పట్టుకుని ఉండగా పొరుగువాడు ఒకడు చూశాడు. దొంగతనం గురించి షాహుకార్ విన్నాడు. సామ్యాను చెట్టుకు కట్టేసి నిర్దాక్షిణ్యంగా కొట్టాడు షావుకారు.
అంతే కాదు. సాహుకార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు్ కొందరు కానిస్టేబుళ్ళతో సహాయక ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడ విచారణ ప్రారంభించాడు సాహుకర్ తరపున అనేక మంది సాక్షులు వచ్చారు.
ఒకడు తాను పొలం దగ్గర కూచ్చొని ప్రతిదీ చూశానని చెప్పాడు. మరొక వ్యక్తి తన ఎద్దును వెతికేందుకు వచ్చి అంతా చూశానన్నాడు. మొక్కజొన్న కండెలు పెద్ద కుప్ప పోలీసు పార్టీలో తెచ్చారు; ఇంకెవరో ఒక పెద్ద బుట్టను ఒక సంచీని నేరానికి ఉపయోగించిన వస్తువులుగా అక్కడ ఉంచారు. సామ్యా రాత్రిపూట సాహుకార్ చేలో మొక్కజొన్న కండెలను దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి; దొంగ రెడ్-హాండెడ్ గా పట్టుకున్నట్లు ఆధారాలతో నిర్దారించబడింది. సామ్యాకు నాలుగు నెలల కఠిన కారాగార జైలు శిక్ష విధించారు. దీని ద్వారా గ్రామస్థులు ఒక పాఠాన్ని నేర్చుకున్నారు.
*** *** ***