కుసుమ వనాలు

కవిత

ఎన్ని బంగరుకిరణాలు నీవాకిటిలో పరుచుకొని వేచిచూస్తున్నాయో

రెప్పల తలపులు తెరవమంటూ పక్షుల కిలకిలరావాలతో సందేశమును పంపుతున్నాయి…

నిన్నటి నీరెండల నీడలు నిన్ను దుప్పటిలా చుట్టి నిశీధి రాజ్యంలో ఏకాకినిచేసెనని…

కన్నీటి జలపాతాలలో మునకలేస్తూ
ఆర్తితో ఎండినగొంతుకు దాహాన్ని తీర్చ చీకటినే తాగుతావెందుకు…

బతుకులవెతలను మదిగూటిలో మూలకు చుట్టి నవనవోన్వేష భావసుమాలతో హేమంతరాగాలాలపించుతూ
కొమ్మ కొమ్మనూ పలకరించు….

రెమ్మరెమ్మలోని పూలనవ్వులను అరువుగా తీసుకొని ఆశయపుప్పొడులు జల్లుతూ అనుభవాల దారులలో
నెనరుఅడుగులేయి…..

అప్పుడన్నీ వసంతాగమనాలే కోయిల తీపిరాగాలు
ఎర్రెర్రని చిగుర్ల కొంగ్రొత్త కుసుమవనాలె
నీదారిలో పరుచుకొని స్వాగతమిస్తాయి మధుపల్లవాలతో

Written by vakula vasu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లలిత గీతాలు

“మన జాతీయాల సొగసు”