గడ్డిపూవు

కొండకోనల్లో నక్కి చేనుచెలకల్లో రేకు విప్పి
ఏ నాగరిక పోకడ లెరుగని
గడ్డిపూవును

తొలిపొద్దు మంచుపరదాల మాటున తొంగిచూసి
మునిమాపు కెంజాయ
లద్దుకుని

పుడమికి రంగుల తివాచీనై
అడవికి వన్నెల కోకనై
జాబిలి వెలుగుల్లో అలంకృత నై అంతటా నేనే అన్నిటా నేనే

సామాన్యుని కంటికి నేను లోకువేమోగానీ
ఆయుర్వేదంలో నాది అందె వేసిన చేయి
ఆధ్యాత్మికతలో నాకు అగ్రతాంబూలం

గరికనై గణపతిని అర్చిస్తాను
గునుగునై పరాశక్తిగా అవతరిస్తాను
రెల్లునై తారకారికి తల్లిన య్యాను

గాలితరగలపై ఊయలలూగుతాను
ఏటి గట్టున పాటకు పల్లకి నౌతాను

ధిక్కారాలు తిరస్కారాలు నాకు కొత్తేమీ కాదు
లెక్కలోనివీ కావు

సుగంధ చికిత్సనై ఓసారి
ఔషధ లేపనాన్నై మరోసారి
నా ఉనికిని చాటాను
నవ్విన నాప చేనై పండాను

పల్లెసీమలో ఫక్కుమన్న స్నిగ్ధ సౌందర్యాన్ని
ప్రకృతికాంత జడను జుట్టిన ముగ్ధమనోహరాన్ని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

…లింగ వివక్షత……GENDER DISCRIMINATION.

గునాసారి గున్నమ్మ