చూడాల వేదకాలం
( సత్యకాలం )నాటి స్త్రీ రత్నం .
క్రీస్తు పూర్వం 5,6 వేల సంవత్సరాలనాటి మహిళామణి .
శారీరక సౌందర్యంతో పాటు
అద్భుతమైన ఆత్మసౌందర్యం కల
మహిళారత్నం చూడాల.
ఆత్మవిశ్వాసం లో అకుంఠిత సేవా తత్పరత లో ఆమెకు ఆమే సాటి .
చక్కని ఇల్లాలు .ఉత్తమ స్త్రీ రత్నం .అనుగుణమైన అర్ధాంగి.ఆదరించే రాణి.
దైవభక్తి .యోగశక్తి, మంత్రబలం,గల అమె,కుటుంబ వ్యవహారాలేకాక
రాజ్యపరిపాలనా
వ్యవహారాలు నిర్వహించడంలో
ప్రజలకు మంచిపాలన. అందించడంలో దక్షురాలు,
కుటుంబ నిర్వహణలో చతురురాలు
సకలకళా నిపుణురాలు .
ఆ వేదకాలంలోనే అత్యంత సమర్ధవంతముగా
రాజ్యాన్ని, బాధ్యతలనూ, నిర్వహించినవిదుషీమణి..
కర్తవ్యం విముఖుడైన (భర్తకు)రాజుకు
దిశా నిర్దేశం చేసిన ధీశాలిని.
వశిష్టముని అంతటి వానిచేత “చూడా ల” వంటి ఉత్తమ మహిళ వేరొకరు లేరు అంటూ యోగ వాశిష్టం లో. కొనియాడబడిన . ప్రసిద్ధురాలు. వశిష్ట ముని సాక్షాత్తు అవతార పురుషుడైన
శ్రీరామచంద్రునికి . ఆ కథ చెప్పి . ఆమెను ఆదర్శంగా తీసుకోమని . చెప్పారంటే ఆమె అస్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. .. ఆ. పురాతన కాలంలోనే
ఆదర్శ మహిళ అలరారింది చూడాల.
త్రేతాయుగంలో రాజ ధర్మమని
అల్పుని మాటలకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చి ,భార్యను
(సీతాదేవిని) పరిత్యజించిన
శ్రీ రాముడు ,
తర్వాత విరహంతో వేగిపోయి చలించిపోయి,కృంగిపోయి,
కర్తవ్య విముఖుడై, పాలనా వ్యవహారాలు పట్టించుకోని సమయంలో ,
శ్రీ రామచంద్రుని తిరిగి కార్యోన్ముఖుని
చేయడం కోసం,
మహర్షి వశిష్టుడు యోగ వాశిష్టం నుండి చూడాలి కథ చెప్పి రాముని కి
దిశా నిర్దేశం చేసారు …
ఉత్తమ చరిత్రగల “చూడాల కథ”.
“చూ డా ల మాళవ దేశపు
రాజ కుమార్తె. మహా సౌందర్యవతి
సౌశీల్య వతి, విద్యా గుణశీల ,
సకల శాస్త్ర ప్రవీణ, సూక్ష్మగ్రాహి ,
సకల గుణ శోభిత.
ఈమెను తల్లిదండ్రులు “శిభి ద్వజుడు” అనే రాజుకు ఇచ్చి వివాహం చేశారు.
శిభి ద్వజుడు మహా పరాక్రమశాలి .
అందగాడు. మహాయోధుడు.
ప్రజల ను కన్నబిడ్డలుగా పాలించే మహారాజు..సకల విద్యా కోవిదుడు ..
వేద కాలంలోనే ఆ దంపతుల అన్యోన్య దాంపత్యం గురించి కథలు కథలు గా చెప్పుకునే వారట.
ఇద్దరూ అన్యోన్యంగా ఆదర్శప్రాయంగా అత్యంత అనురాగం గా జీవించేవారు.
ఒకరి పట్ల ఒకరికి అపారమైన నమ్మకం.
విశ్వాసం ఉన్నాయి..
ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాట .
అందరూ వారి అన్యోన్య దాంపత్యం చూసి అబ్బుర పడేవారు.
కొంతకాలం రాజ్య పాలన చేసిన శిభిద్వజునకు చూడాలకు ఆధ్యాత్మిక జీవనం వైపు దృష్టి మళ్ళింది..
ఇరువురూ కూడబలుక్కుని తమ తమ ధర్మాలను నెరవేరుస్తూ, ఆధ్యాత్మిక చింతనతో కాలం గడపడం ప్రారంభించారు .
చూడాల ఏకాగ్రత తో ,విపరీతమైన సాధన చేయడం వలన ,
ముందుగా ఆవిడకు యోగదృష్టి కలిగింది.
ఏకాగ్రత, దివ్య దృష్టి ,గల ఆమెకు అనేక విద్యలు, సిధ్ధులు యోగశాస్త్ర రహస్యాలు, కొద్దికాలం లోనే పట్టుబడ్డాయి.
శిభి ద్వజుడు తన భార్య అంత గా ఏకాగ్రత కుదరక ,సాధనపై దృష్టి సారించలేకపోతున్నాడు.
అతను ఏ సిద్ధులనూ పొందలేకపోయాడు.
దృష్టి కేంద్రీకరించక పోవడం వలన, యోగ రహస్యాలు పొందనందుకు చాలా బాధపడ్డాడు.
ఇదంతా గమనించిన.చూడాల .
తన వంతు సహకారం అందించింది .
అయినా! తనకు ఏకాగ్రత కుదరకపోవడంతో ,లక్ష్యాన్ని చేరుకోలేక
శిభి ద్వజుడు,
నేను అడవికి పోయి తపస్సుచేసుకుని వస్తానని భార్యకు చెప్పాడు .
ఆమె ఇష్టపడలేదు.
కారణం ఇద్దరంకలిపి మోక్షం కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం.
మనకు కర్తవ్యాలు ఉన్నాయి.ధర్మంగా, సుఖంగా, దేశాన్ని పాలించచడం, కన్నబిడ్డలవలె ప్రజలు చూడటం,
మన బాధ్యత వాటి పారిపోకూడదు .నిర్వహించవలసిన విద్యుక్త ధర్మాలు.
బాధ్యతలను, వదిలేసి ,మోక్షం కోసం పలాయనం చిత్తగించాడు సరైనది కాదని భర్తకు నచ్చజెప్పింది.
అతడు ఆమె మాటలు అంగీకరించినట్లే
అనుకుందామె .
కానీ! రాజు శిభిధ్వజుడు
రాత్రికి రాత్రి రాజ్యాన్ని కుటుంబాన్ని
వదిలేసి వెళ్ళిపోయాడు.
శిభి ద్వజుడు ముందే షరతు పెట్టాడు .
తను లేని సమయంలో ఆమె రాజ్యపాలన చేయాలని .
చూడాల పరిస్థితి అర్థం చేసుకున్నది.
మంత్రి సామంతులను
పిలచి, రాజు అత్యవసరమై వెళ్లాడని, .అందరికీ అన్ని బాధ్యతలూ అప్పగించింది. తాను రాణిగా అంతా చూస్తాననిచెప్పి,అత్యవసరమైతే తప్ప ఎవరినీ కలియవద్దని .
నమ్మకస్థులైన మంత్రులతో సమావేశమై వారికి ,అదనపు బాధ్యతలు అప్పగించింది . దివ్య దృష్టితో చూసింది
చూడాల. అప్పటికే అతీత శక్తులు దివ్య దృష్టి కలిగిఉంది.
వెంటనే భర్త ఎక్కడున్నాడో చూసి తెలుసుకుంది.
అతనిలో మార్పు రాలేదు. వెంటనే మంచి మార్గాన్ని, మంత్రిమండలికి చెప్పి, తనూ ,రాజూ కలసి వస్తామని చెప్పింది .
కుంభుడనే యువకునిగా మారు వేషంతో భర్త దగ్గరికి వెళ్ళింది.
అతనిని . సమర్థిస్తూ అతనికి ఆప్త మిత్రుడిగా ఉంటూనే,
తానే గురువై జ్ఞానోపదేశం చేసి, యోగ రహస్యాలను, సిద్ది సాధనా విధానాలనూ బోధించింది..
క్రమేపీ శిభి ధ్వజుని లో మార్పు రావడం ప్రారంభించింది.
యోగ రహస్యాలు తెలుసు
కున్నాడు.సకల సిద్ధులుపొందాడు.
నీవలన నేను సిద్ధులను పొందానని స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు.
శికిధ్వజుడు .
మిత్రమా !నాకు కృతజ్ఞతలు
చెప్పొద్దు..నాకొక సహాయం చేస్తే,
నేనే నీకు ఋణపడి ఉంటాను . అన్నాడు కుంభకుడు.
ఏం చేయాలో చెప్పమన్నాడు శిబిద్వజుడు.
కుంభకుడు ఇలా అన్నాడు.నేను శాపవశాన పగలు పురుష వేషంలో ఉన్నా, .రాత్రి* మదనిక అనే యువతిగా మారి పోతాను.
మీరు రాజుగా తిరిగి రాజ్యంలో ఉంటే, మీ నీడలో నా శాపం తీర్చుకుంటాను అన్నాడు కుంభుడు .
సరేనని రాజు. శిబిద్వజుడు రాజ్యానికి వచ్చేసాడు .
రాజు . నా స్నేహితుని చూడమని కోరినా, కుంభుని, సరాసరి కాకుండా, తెరవెనుక నుండే చూస్తానంది చూడాల .శాపగ్రస్తుని చూడనంది .
రాజు. సిబిద్వజుడు ఒత్తిడి చేయలేదు .
చూడాల గా ,కుంభునిగా, మదనికగా ,
రాజుకి విభిన్న వేషాలలో కన్పిస్తూ విజ్ఞతను చాటుకుంటుంది చూడాల .
తపస్వినిలా కనబడుతోంది చూడాల ..
*మదనికగా కనబడి
మరింత చేరువవ్వడానికి ప్రయత్నించినా, శిభి ద్వజుడు మదనికను దూరంగానే ఉంచాడు .
అతని లో నిగ్రహశక్తిని పరీక్షించాలని చూడాల ,మదనిక వేషంలో తనను వివాహం చేసుకోమని శిభిద్వజుని కోరుతుంది .
తాను ఏకపత్నీ వ్రతుడనని
తనకు సంసార సుఖాలపట్ల
ఆసక్తి లేదని,
తన భార్య కేవలం చూడాల యేనని
చెప్తాడు శిభిద్వజుడు ..
అయినా! తనను వివాహం చేసుకోక
తప్పదని, రక్షిస్తానని మాట ఇచ్చావు గాబట్టి, మాట తప్పకుండా
వివాహమాడాలని
ఒత్తిడి చేస్తుంది మదనిక ..
తప్పక మదనికను వివాహమాడిన రాజు .ఈ రాజ్యం నువ్వే ఏలుకో ,
నేనూ, నాభార్య చూడాల వానప్రస్థాశ్రమానికి
వెళ్లి పోతాము అంటాడు ..
అప్పుడు చూడాలగా కనబడి
వానప్రస్థాశ్రమానికి చాలా సమయముంది .
ముందు బాధ్యతలు నిర్వహించి, వారసులకు రాజ్యం అప్పగించండి .అంతవరకూ ప్రజలను కన్నబిడ్డలలా పాలించాల్సిన బాధ్యత మీకుంది .
నమ్మి మిమ్మల్ని రాజుచేసిన, ప్రజలను
కష్టాల పాలు చేయవద్దు .
అందుకే నేను ఇన్ని వేషాలు వేసాను నన్ను మన్నించండి అంటుంది చూడాల. .
శిభి ధ్వజుడు చాలా సంతోషించి,
చాలాకాలం ప్రజారంజకంగా పాలన చేసి, భార్య చూడాలతో బహు సంతోషంగా జీవించి ,వారసులకు రాజ్యమప్పగించి,
వానప్రస్థాశ్రమం కు వెళ్లారు శిభి ధ్వజుడు చూడాల .
ఈ కథను వశిష్టుడు రామచంద్రునికి చెప్పి, రామా నీవు నీ భార్యను పిల్లలను కలుసుకొని ,పిల్లలను,పట్టాభిషిక్తులను చేయు ..
మహా మహిళ చూడాలను ఆదర్శంగా తీసుకోమని చెప్పారు .
బహుముఖ ప్రజ్ఞాశాలిని చూడాల కథను ,త్రేతాయుగంలో
రాముడికి చెప్పాడు వశిష్ట ముని ..
ఇంత విశిష్ట మహిళలను తప్పక ,. ఆధునిక మహిళలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ,,. ఆత్మహత్యలు చేసుకోవడం,. కొందరు హత్యలు చేయడం లాంటి విషయాల్లో ,. అతలాకుతలం అయిపోతున్న సమయాలలో చూడాలను . అంతటి ఆత్మవిశ్వాసం . ఆత్మగౌరవం గల మహిళలను తలచుకొని,
వారి ఆదర్శాలను అర్థం చేసుకొని . ఆదర్శప్రాయంగా నడచుకోవాలి .
వారి ఆత్మవిశ్వాసాన్ని అలవరచుకోవాలి ..
చిన్న చిన్న విషయాలకు చికాకు పడి బంధాలను తెంచుకొని బాధ్యతలను వదులుకొని అభం శుభ ం
సంతానానికి అంతులేని వేదనను మిగులుస్తున్న . తల్లిదండ్రులు,. బాధ్యతల నుండి పలాయనం చిత్తగిస్తూ పౌరుషాలతో పంతాలతో ప్రజా జీవనాన్ని సంక్షోభంలోకి నడుస్తున్న ప్రభుత్వాలు ప్రభువులు ఇలాంటి కథలను విని చదివి స్ఫూర్తిని పొందాలని కోరుకుందాం. పాత అంతా రోత కాదు,. కొత్త ఒకటే మోజు కాదు
కొత్త పాతల మేలు కలయిక కొమ్మె రంగులు జిమ్మగా”. అన్నట్లు జీవనయానాన్ని కొనసాగించుదాం.