రేగుపళ్ళ పచ్చడి తయారీ విధానం

(ఒక కిలో రేగి పళ్ళు బాగా మగ్గినవి కాకుండా కాస్త దోరగా ఉన్నవి అయితే బాగుంటాయి )

రేగుపళ్ళ పచ్చడి కి కావలసిన పదార్థాలు

ఒక కిలో రేగి పళ్ళు
200 గ్రాముల ఉప్పు
250 గ్రాముల కారము
50 గ్రాముల చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి
ఒక స్పూన్ పసుపు
75 గ్రాముల ఆవపొడి
40 గ్రాముల జీలకర్ర మెంతులు కలిపి చేసుకున్న పొడి
రెండు పెద్ద సైజు ఎల్లిగడ్డలు
1/2 కేజీ పల్లి నూనె

తయారీ విధానం

* ముందుగా రేగుపళ్లను శుభ్రంగా కడిగి ఒక బట్ట పైన ఆరవేసుకోవాలి
* తడి లేకుండా ఆరిపోయిన తర్వాత వాటికి ఉన్న తొడిమెలు తీసి రేగి పండును చిన్నగా నొక్కితే పగులుతుంది. ఆ విధంగా చేసి ఉంచుకోవాలి
* అలా చేయడం వలన పండ్లు లోపలికి కూడా మనం కలుపుకునే ఉప్పు కారం అన్నీ వెళ్తాయి
* పండులో ఉన్న పులుపు తీపి సమంగా అన్నింటికీ పడుతుంది .
* తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని బాగా మెత్తగా కాకుండా బరకగా దంచి పక్కన పెట్టుకోవాలి
* జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకోవాలి
* ఆవాలు పొడి చేసుకోవాలి

ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తో పోపు చేసుకొని కరివేపాకు, ఇంగువ వేసి అవి వేగిన తర్వాత తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఆ నూనెలో వేసి ముద్ద దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి మనం శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న రేగుపళ్ళను ఆ నూనెలో వేసి మూకుడు కిందికి దించుకోవాలి
ఇప్పుడు మూకుడులో వేసుకున్న రేగు పళ్ళ పైన మనం రెడీగా పెట్టుకున్న ఉప్పు, కారం ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి అన్ని వేసి కలిపి ఒక రోజంతా మూత పెట్టి ఉంచాలి .
తెల్లవారికి బాగా ఊరి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఎంతో రుచికరమైన అద్భుతమైన రేగుపళ్ళ పచ్చడి తయారవుతుంది.

* ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయము
రేగి పళ్ళు తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది త్వరగా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నదీమతల్లి- 10వ భాగం

చూడాల