భూమాత …

పర్యావరణ ఒడిలో ఆనందంతో ఊయాలలుగుతున్న ఓ ధరణి..,
ప్రకృతి వైపరీత్యాల వలన మనుగడౌవుతున్న జీవితం నీది…
ఆనందంగా ప్రజల బరువును మోస్తున్న ఓ మేదిని..,
ప్రజల వల్లనే పీడిస్తున్న జీవితం నీది…
చిన్న చిన్న చినుకుల తాకిడితోనే వెూదం చెందుతున్న ఓ క్షోణి..,
అదేతీరుగా పురుగుమందులతో క్షీణించిపోతున్న జీవితం నీది…
నీ తనువు నుంచి తరువుకు ప్రాణం పోసిన ఓ ఉర్వీ..,
బోరుబావుల వలన బాధకు బాధింపురాలివైన జీవితం నీది…
నీ గర్భాన్ని చీల్చి,
శిలాజ ఇంధనాలను ప్రసాదించిన ఓ పృథ్వి..,
మానవ కార్యకలాపాల వల్ల
వేడికి దోహదమైన జీవితం నీది…
ఓపికే శ్రేయస్సుగా,
నీ జీవితం లో మార్పులు చేకూర్చుకుంటూనే, మానవాళి జీవితాన్ని నడుపుతున్నావు…

Written by K. Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వికసించిన పద్మం :పద్మా సచ్ దేవ్

పత్రిక పాతదైనా- సంపాదకీయం కొత్తది