మగ మహారాజులు

పుట్టుకతోనే మొదలవుతుంది
వాడి భోగభాగ్యాల ప్రయాణం,
వాడు పుట్టాడంటే ఇంట్లో పండుగ,
వారసుడు వచ్చాడంటూ సంబరం!

వాడు పెరిగే కొద్దీ తెలుస్తుంది
ఆ ఇంటికి తానే మహారాజని,
వాడి మాటే శాసనమని,
వాడి ఇష్టమే కుటుంబ నిర్ణయమని!

వాడికి లేవు ఆంక్షలు,
వాడి అడుగులకు లేవు హద్దులు,
అర్ధరాత్రి తిరిగినా తప్పు కాదు,
అమ్మాయితో మాట్లాడినా గొప్పే మరి!

వయసు పెరిగేకొద్దీ భోగాల వేట,
వయసు మళ్లేకొద్దీ రోగాల బాట,
ఇంట్లో మాత్రం వాడిదే శాసనం,
వాడిని ఎదిరించే ధైర్యం ఎవరికుంది మరి?

వాడికీ కొన్ని ఆంక్షలుంటే బాగుండేది,
వాడి చూపులకు కూడా హద్దులుంటే బాగుండేది,
ఆడపిల్లలను ఆటబొమ్మలుగా చూసే
ఆలోచనలైనా మారేవేమో బహుశా!

అమ్మాయిలందరూ భయం లేకుండా
స్వేచ్ఛగా తిరిగే రోజులు వచ్చేవేమో,
వాడి చూపులో గౌరవం,
వాడి మనసులో మానవత్వం ఉంటే!

ఒకరిని ప్రేమిస్తాడు,
ఇంకొకరిని వంచిస్తాడు,
ఒకరికి ఆశలు కల్పిస్తాడు,
మరొకరి జీవితముతో ఆడుకుంటాడు!

అదేంటని ప్రశ్నిస్తే
నేను మగ మహారాజునంటాడు,
నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటాడు,
నా జీవితానికి నేనే రాజునంటాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చెరుకుతుద వెన్ను పుట్టిన

“కనిపించని గమ్యాన్ని – పదార్థ విజ్ఞానంతో ‘దృశ్యమానం ‘చేసిన ప్రతిభాశాలి.”