మన మహిళామణులు – కర్లపాలెం స్వరాజ్యలక్ష్మి గారు!

కర్లపాలెం స్వరాజలక్ష్మి భాగ్యనగరంలో పుట్టాడు 1948లో నవాబు నుంచి హైదరాబాదు విముక్తి అయింది తల్లిదండ్రులు ఎల్లాప్రగడ శకుంతల రామచంద్రరావు బాల్యం నుంచి కనపడిన పుస్తకం చదివేవారు రాజ్యలక్ష్మి మాడపాటి స్కూల్లో 12 స్టాండర్డ్ వరకు చదివి తెలుగులో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు ఆ స్కూల్ వాళ్ళు గోల్డ్ మెడల్ ఈమెకే తొలిసారి ఇచ్చారు రెడ్డి కాలేజీలోబి.ఏ చదివారు అమ్మా నాన్నల వలన ఆధ్యాత్మిక భావాలు తెలుగు భాష పై పట్టు వచ్చింది 1966 లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ కొత్తగా పెట్టారు తన దగ్గర ఉన్న 100 రూపాయలతో సర్టిఫికెట్ కొన్నారు దానితో రేడియోలో ఆమె పేరుని ప్రకటించి ఇంటర్వ్యూ చేయటం జరిగింది

1970లో ఆమె పెళ్లి కర్లపాలెం వెంకటేశ్వరరావు గారితో జరిగింది ఆయన జీవితం అంతా డిఫెన్స్ లో గడిచింది ఎక్కువగా ట్రాన్స్ఫర్లు నార్త్ ఇండియా లో ఉండేవి ఢిల్లీ ముస్సూరీ డెహ్రాడూన్ మొదలైన ప్రాంతాల్లో ఉండటంతో హిందీ,పంజాబీ ఉర్దూ మరాఠీ ఆంగ్లంలో పట్టు వచ్చింది.ఫోన్లు తక్కువ. ఊరిబైట అడవుల్లో వైద్య సదుపాయాలు లేని ప్రాంతాలు కావటంతో భర్త వల్ల హోమియో వైద్యం నేర్చుకున్నారామె.రైతులు కూలీలకు ఉచిత వైద్య సేవలు చేసి తృప్తి పొందేవారు
కర్లపాలెం స్వరాజ్యలక్ష్మి తన సంఘ సేవ గురించి ఇలా చెప్పారు మా వారి సహకారంతో కొండ ప్రాంతాల్లో వారికి సలహాలు సూచనలు ఇచ్చే దాన్ని వారి ఆరోగ్య సమస్యలు తీర్చేదాన్ని ఆయన దగ్గరే జాతకాలు చూడటం నేర్చుకున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే అక్కడి జంతువులు దెబ్బ తగిలితే కాస్త అనారోగ్యంగా అనిపిస్తే మా తోటలోకి వచ్చి మందు కలిపిన నీటిని తాగి బాధ నివారణ అయినాక వెళ్ళిపోవటం నాకు సంతోషంగా అనిపించేది ఇక వరదలు వచ్చినప్పుడు వాటి పిల్లల్ని మా ఇంటి తలుపు దగ్గర వదిలేసేవి వాటిపై దుప్పటి కప్పి పోషణ చేసేదాన్ని ఆ తర్వాత అవి సంతోషంగా పిల్లల్ని తీసుకువెళ్లిపోతుంటే నా ఆనందం చెప్పగలవి కాదు స్వెటర్లు టోపీలు జమ చేసి అవసరమైన వారికి అందజేసేదాన్ని ఇక లేడీస్ క్లబ్ సెక్రటరీగా ఐదేళ్లు ఎన్నో రకాల ప్రోగ్రాములు చేసి విరాళాలు సేకరించి పేదలకు అందజేసేదాన్ని మా వారు రిటైర్ అయినాక హైదరాబాదులో స్థిరపడ్డాం మా ఒక్కగానొక్క బాబు బాంబేలో పుట్టాడు ఇంజనీరుగా ప్రస్తుతం యుఎస్ లో స్థిరపడ్డాడు
2005లో మా వారికి హార్ట్ ఎటాక్ రావడంతో సోషల్ వర్క్ మానేసి ఆయన బాగోగులు చూసుకుంటూ ఇంటి దగ్గరే గడిపాను 2012లో ఆయన కాలం చేయటంతో సత్యసాయి సేవా సంస్థలు చేరాను ఆ తర్వాత బృందావనం వెళ్లి అక్కడ సాధువుల ఆశీస్సులు తీసుకుని భాగవతం రాయటం మొదలుపెట్టాను దాన్ని బృందావనంలోని రాధాదేవికి అంకితం ఇచ్చాను ఇక తులసి వాల్మీకి రామాయణంలోని తేడాలు వివరిస్తూ రామాయణం రాసి ప్రచురించి మా అమ్మకి అంకితం ఇచ్చాను భక్తుల చరిత్ర ప్రస్తుతం ప్రింటింగ్ లో ఉంది అప్పుడప్పుడు అమెరికా వెళ్లి వస్తుంటాను మన ఇండియన్స్ మన పద్ధతులు అక్కడివారికి చాలా నచ్చటం సంతోషకరమైన విషయం ఇక బృందావనంలో ప్రసిద్ధి చెందిన రాధాదేవి తత్వం గురించి దక్షిణాది వారికి తెలీదు అందుకే దాన్ని గూర్చి పూర్తి వివరాలతో ఒక పుస్తకం రాయాలని సంకల్పం నాకు ఉంది నాకు అవార్డులు రివార్డులు లేవు దానికి ఆశించను భగవంతుడు ప్రతివాడికి జీవితాన్ని వరంగా ఇస్తాడు దాన్ని సరిగా ఉపయోగించాలి సేవా దృక్పథం ఉంటేనే భగవంతుడు అవకాశం కలిగిస్తాడు మనం ఆయన చేతిలో ఆట బొమ్మలం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“ఎదురు చూపు

చిట్కాలు ఆరోగ్య సూత్రాలు