సంక్రాంతి ముగ్గు

హరితవర్ణం పులుముకున్న వాకిటి కాన్వాసుపై వేలి కుంచెల్లో ప్రతిబింబించే సనాతన సాంప్రదాయం

కుంచె మలుపుల్లో తీగ వంపుల్లో ఇమిడిన ప్రకృతి సోయగం

చదునైన వాకిలి నింగికి ప్రతీకైతే తళుకులీనే తారలే చుక్కలు

కేంద్రం సూర్య స్థానమయితే చుట్టూ తిరిగే గీతలు ఖగోళ చైతన్య సంకేతాలు

చుక్కలతో స్థితిశక్తిని గీతలతో గతిశక్తిని సూచించే కొలమానం

రేపల్లె గోపెమ్మలంతా సందె గొబ్బిళ్ళై సందడి చేస్తూంటే సహజీవనపు ఆవశ్యకత సూచించే రథమే పండగ ప్రహసనానికి ఆఖరి ఘట్టం

రంగుల మేళవింపుల్లో దాగిన రహస్య సౌందర్యంతో ముంగిట విరిసిన చిత్రశాల

స్త్రీ సృజనాత్మక ప్రతీక

పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గంగిరెద్దులవారు

సంక్రాంతి శోభ