సహనమా!! Patient of patience

16-11-2024 తరుణి పత్రిక సంపాదకీయం

ఈ అలవికాని ఆకర్షణ ల మోజుల రోజుల్లో కొంత ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే ఎవరి మనసులో కి వాళ్ళు తొంగిచూసుకోవాలి.
Tolerance రేంజ్ ఎంత అంటే సహనం అనే గుణం పరిధి ఎంత
అనేది మాట్లాడుకున్నప్పుడు దీని విశేష్య విశేణాల విషయాలను చర్చించుకోవాలి . అసలే ఓపిక లేకుండా ఉన్నప్పుడు వ్యతిరేక అర్థం లో సహనం లేదు అని అంటాం అంటే unwearying patience అంటే చిరాకుగా ఉండడము కలత చెంది కనిపిస్తూ ఉండడం కోపం గా ఉండడం ఏమాత్రం వేచి ఉండలేని తనము నిలకడ లేని తనమూ ఇటువంటివన్నీ కూడా ఇంటాలెరెన్స్ కి ఉదాహరణగా చెప్తాం.
సహనం రహదారి వంటిది. ఎవరికైతే ఓపిక ఉండదో వాళ్లు అడ్డదారుల్లో తొందరగా చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అడ్డదారులు అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి. కొన్నిసార్లు మానప్రాణాలను రక్షించాలనుకున్నప్పుడు తొందరగా చేరుకునే ప్రయత్నంలో వెళ్లే బాట కాదు. అవినీతి అత్యాశ వ్యసనలోలత వంటి దుర్గుణాలతో ఉన్నతమైన పదవులను ఆశించాలనుకునేది అడ్డదారి.
“అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది ,ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది “అని ఊరికే అనలేదు మన పెద్దలు.
సామెతలు ఆమెతలు. అంటే రోజు భోజనం చేస్తాం కానీ షడ్ర షోపేతమైన భోజనం ఎప్పుడో ఒకసారి చేస్తాం . సామెతలతో ఆలోచించే జీవితం మృష్ఠాన్న భోజనం వంటిది.
తాలిమి కలిగి ఉండడాన్ని మనం సహనం అంటాం అంటే క్షమాగుణం ఓర్పుగల నడవడిక. శ్రమ శక్తి అనేది చాలా కష్టమైనటువంటి శక్తి ఆ శక్తిని ఉపయోగిస్తే కొండంత బలం మనదవుతుంది. అంతర్గత శాంతిని కోరుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ఓపికగా ఉంటారు మనుషులు.
జీవితంలో సహనం ప్రాముఖ్యత ఎంతో ఉన్నది అని గ్రహించినప్పుడు తప్పకుండా ఓపికను తనది చేసుకొని వ్యక్తి జీవితం కొనసాగుతుంది. సహనం ఉంటే కృతజ్ఞతలు పాటించే తత్వాన్ని ఇస్తుంది సహనం ఉంటే బుద్ధి కర్మ మూడు శుద్ధి చేయబడతాయి. ఇంటిశుభ్రత, ఒంటి శుభ్రత, మనసు శుభ్రత ఈ మూడు సహనంతో చేసుకోగలుగుతారు . సహనం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా శుభ్రపరుచుకోగలరు. తమలో ఉన్న తప్పులు, లోపాలు ఏవైనా ఉంటే వాటిని సావకాశంగా తెలుసుకొని రిఫ్రేమ్ చేసుకుంటూ, సెట్ చేసుకుంటారు. సహనం ఉన్నవాళ్లు దేన్నైనా పోటీగా తీసుకోరు అలవాటుగా మార్చుకుంటారు నిలదొక్కుకుంటారు.

కిటికీలోంచి దునికి వెళ్లి కాపాడాలనుకునే తత్వానికి ముఖ ద్వారం నుంచి వెళ్లి కాపాడాలనుకునే తత్వానికి మధ్యలో కొంత నే భేదం ఉంటుంది. కానీ ఆయా అవసరాలను బట్టి ఆ అర్జెన్సీ ని బట్టి సహాయం చేయడానికి అయితే చేయవచ్చు వెళ్ళవచ్చు కానీ రాజమార్గం ఎప్పటికైనా క్షేమదాయకం.లక్ష్యాలను సాధించాలంటే బలమైన సంబంధాలను నిర్మించుకోవాలంటే వశ్యత అవసరం.

విజయం అనేది రాత్రికి రాత్రి వచ్చి ముందు పడదు. ఎంతో ఓపికగా నిర్మించుకుంటూ వెళ్లిన సహనం అనే మెట్ల పైనుంచి ఎక్కినప్పుడు మాత్రమే విజయం అనే సింహాసనాన్ని సులభంగా అధిరోహిస్తారు.

” వినదగు నెవ్వరు చెప్పిన /వినినంతనె వేగపడక వివరింపదగున్/ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు” అని సుమతీ శతక కారుడు చెప్పిన మాట లలోని నీతి ఏమిటి? ఇతరులమాట వినే సహన గుణమే అని ఖచ్చితంగా అనవచ్చు.
ప్రజలకు ఉపయోగపడే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో సహనం అనే tool రాత్రివేళ అడవిలో పోతుంటే కాగడా పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనలో ఉన్న బర్నౌట్ అనేదాన్ని కట్టడి చేసుకున్నప్పుడు ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చేప్పుడు ఓపికగా పనులు చేయాలి.
ఎవరైనా ఏదైనా కష్టమైనటువంటి పనిని పూర్తి చేయగానే అబ్బో ఓపిక ఉంది ….చాలా సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు అని ఇలా
అంటుంటారు. Saft ఆలోచన లతో చేసే ప్రయత్నాలకు తప్పకుండా విలువ ఎక్కువగా ఉంటుంది. ఓపికని పాటిస్తే మంచి మంచి ప్రయోజనాలను పొందుతూ ఉంటాం. ఈ సహనాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అనే చింతన ఉన్నప్పుడు సహనం ప్రభావం ఎంతో తెలుసుకుంటారు. సహనం ప్రభావం తెలుసుకోవడానికి ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. సహన గుణం అనేది ఒక ధర్మం. స్వీయ నియంత్రణ చాలా అవసరం.

ప్రపంచాన్నే జయించగలిగే ద్వాదశ గుణాల్లో శమ దమాలున్నాయి. శమ గుణం అంటే అంతరిద్రియ నిగ్రహం. దమ గుణం అంటే మనో నిగ్రహం . ఈ రెండూ సహనం అని మనం చెప్పుకుంటున్న ముఖ్య గుణం వీటిని ప్రతిబింబించే గుణమే!
భావోద్వేగాలను పొందని మనుషులు ఉండరు కానీ అది ఎదుటివారి ముందు ప్రయత్నపూర్వకంగా ప్రదర్శించాలనుకుంటే సహనం అనేది బలహీనమైన శరీరానికి టానిక్ వంటిది జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి వేసుకునే మందు వంటిది.
ఒక ఉద్యోగి ఒక వ్యాపారి ఒక రాజకీయ వేత్త ఒక సంసారి వీళ్ళందరీలోనూ….అందరిలోనూ ….ఓపిక ఉన్నవాళ్లు తప్పకుండా ముందు చూపుతోనే పయనిస్తారు. కాస్తంత కంట్రోల్ ఉంటే చాలు, గుడ్ క్యారెక్టర్ ఉత్పాదకత పెరుగుతుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం కన్జ్యూమర్స్ ఆకర్షించడం, సమాజ దిక్సూచిగా మారడం, కుటుంబానికి జీవకర్రగా నిలవడం. ఇవన్నింటికి సహనం ఉంటే చాలు సాధించగలం.
ముందు ఒక మంచి శ్రోతగా ఉండగలగాలి. అప్పుడే కోపాన్ని నియంత్రించుకోగలుగుతారు. పనిమీద శ్రద్ధ ఉండడం తో కొత్త కొత్త నైపుణ్యాలను కూడా ఒడిసి పట్టుకుంటారు. హేతుబద్ధంగా ఆలోచించగలిగితే వాస్తవాలకు విలువ ఇవ్వగలిగితే, ఇక వెనుదిరగక ప్రయాణించడం అలవర్చుకోగలుగుతారు.
ఇతరులకు సలహా ఇవ్వగలుగుతున్నారూ అంటే పాటించగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్లే సలహాలను ఇవ్వగలుగుతారు. దీర్ఘకాలికమైన లక్ష్యాలు ఉంటే కఠినమైన పరిస్థితులు వచ్చినా కఠినమైన సవాళ్లు వచ్చినా ఎదుర్కోగలుగుతారు.
ఆరోగ్యం బాగా ఉంటే సహనం దానంతట అదే వస్తుంది. ఓపికతో ఉండాలని అనుకున్న అనారోగ్యం ఉంటే ఓపికతో ఉండలేరు. కాబట్టి సమతుల్యమైన ఆహారాన్ని ముందు నుంచి తీసుకుంటే శారీరక దారుఢ్యత పెరుగుతుంది దానితోపాటు మనోధారుఢ్యఘత కూడా పెరుగుతుంది. సానుకూల దృక్పథంతో అవసరమైన చర్యలను తీసుకోవడమే వశ్యత అంటాం. అంటే చేయాలనుకున్న కార్యం పైన బుద్ధి చాపల్యత లేకుండా ఫ్లెక్సిబిలిటీ తో అనుసరించడం అన్నట్టు. నైతికమైన విలువలకు ప్రాధాన్యత సంతరించుకుంది మన జీవితం అనుకున్నప్పుడు తప్పకుండా ఈ వశ్యత అనేది ఒక మంచి గురువు లాగా తోడు ఉంటుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధత ఉన్నప్పుడే ప్రజా బహుళ్యం లో మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేయగలగుతారు. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలిస్తే సరిపోదు. బంగారు పళ్ళానికైనా గోడదాపు ఉండాలంటారు . ఎంత తెలివితేటలు ఉన్నవాళ్లకైనా ఎంత బలశాలి, ధైర్యవంతులకైనా ఈ మాట వర్తిస్తుంది. గోడదాపు వంటిదే సహన గుణం.ఎవరికైతే patience అంటే ఓపిక సహనం ఉండదో వాళ్ళు patient అన్నట్టే! సహన కొరత నే వాళ్ళ ను పట్టి పీడించే జబ్బు!! కానీ నయం చేసుకోలేని జబ్బు కాదు ఇది. కాస్త శిక్షణ అంటే ప్రాక్టీస్ చేసుకుంటే సహనం అలవడుతుంది దీనితో మనసుకు, ఒంటికి పట్టిన రుగ్మతలను పోగొట్టుకోవచ్చు. అందరిలో గొప్ప గా నిలిచి గెలవచ్చు.

– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక ఎడిటర్

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

అడవిలో చెట్ల