సింధూరపు వన్నెలు

రంగులు

ఇంద్రధనస్సులో రెండో రంగు .అదే ఆరంజ్  .సృజనాత్మకతకు  ,స్వయంతృప్తికి ప్రతినిధి .ఆరెంజ్ రంగుకు సంభంధించిన ఆసక్తికర విషయాలు కాసిన్ని  చెప్పుకుందాం. ఆరెంజ్ పండు తో  మొదలు పెడదాం .

ఆరెంజ్ పండు

దీని పుట్టుక  దక్షిణ చైనాలో .  వాస్కోడగామా 1498లో దక్షిణ భారతదేశంలో ఈ పండును పరిచయం చేశాడని , అక్కడి నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లిందని చెప్తారు  .కానీ దాన్ని ఇప్పుడు మనం పండించడం లేదు . అదే నారింజరంగున్న పండు . మనకు తెలిసిన భాషలో సంత్రాలులెదా  కమలాలు . దీని కబుర్లు  చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటి తెలుసుకుందాం.

మొదలు ఆరెంజ్ అనే పేరు లేదు  .తొలుత  మనకు తెలిసింది పండే . దాని తర్వాతే దానికో పేరొచ్చింది . అదే పేరు రంగుకు స్థిరపడింది . ఈ రంగును ఇంగ్లీషులో (Geoluh read)ఎల్లో రెడ్ అని పిలిచేవారు 16వ శతాబ్దానికి ముందు  .

ఈ పేరు సంస్కృతంలోని నారంగా నుండి వచ్చిందంటారు . సువాసన గల పండు అని దీని అర్థం. పండులో రెండు ముఖ్యమైన రకాలు ఉన్నాయి  . తొక్క నారింజ రంగులో వదులుగా ఉండేది ఒక రకం .నాగపూర్ , పూనా   ప్రాంతాలలో  ఎక్కువగా పండిస్తారు మరొకటి నారింజ ఆకుపచ్చ కలిసినతొక్క ఉన్న  పండు. హత్తుకొని ఉండే తొక్కరకం ఇది  .సాధారణంగా అస్సాం కూర్గు  ప్రాంతాలలో  దొరుకుతుంది  .ఈ పండు విటమిన్లకు పుట్టినిల్లు . వేడిని , శక్తిని పుట్టిస్తుంది  . అన్ని వయసుల వారికి పనికొచ్చే  ఆహార ఔషధం .

ఈ కమలారసానికి ఒక స్పూనుతేనె  ,చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే  ,అస్తమా , జలుబు  ,పడిశం సమస్యల్లో అద్భుతంగా పనిచేస్తుంది . తొక్క నుంచి తీసిన నూనె సువాసనద్రవ్యాల్లో సబ్బుల తయారీలో వాడతారు .వదు లైన తోలున్నవి మనదేశంలోనూ , గెట్టితోలున్నవి యూరప్ లోను బాగా ప్రసిద్ధి  .ప్రకృతి మనకిచ్చిన అపురూపమైన వరాల్లో ఈ నారింజపం డో కటి

ఈ రంగు గురించి చెప్పుకోడానికి ఎంతో ఉంది . దీని వన్నెల్లో రకాలు ఉన్నట్లే పేర్లు చాలానే ఉన్నాయి. PUMPKIN -Langerine –marigold –Burnt Orange –Persian orange అందులో కొన్ని  . ఎన్నో పేర్లు ఉన్నట్లే , ఎన్నో అర్థాలు కూడా ఉన్నాయి.

మనదేశంలో ఇది ఆధ్యాత్మికంగా స్వాధి ష్ట చక్రానికి సంబంధించినది. ఫెర్టిలిటీ  ,లైంగికతకు  గుర్తు  .

సూర్యోదయం ఆకాశంలో  ఆరంజ్ రంగుతో మొదలవుతుంది.

 ఇది నెదర్లాండ్ జాతీయ వర్ణం .

బుద్ధిజం  ,హిందూయిజం లో పవిత్రమైన రంగు  .

సన్యాసులు ఎక్కువగా ఉపయోగించే రంగు  .

పలు దేశాల్లో ఉద్యమాల్లో ర్యాలీలకి ఈ రంగును వాడతారు .

                        ఉదా ;      ఉక్రెయిన్ లో  జరిగిన ఆరెంజ్ రెవల్యూషన్ .

పాశ్చాత్య  సంస్కృతిలో వారి హార్వెస్ట్ కు వెచ్చదనానికి రంగు .

పాశ్చాత్య సంస్కృతిలో  హార్వెస్ట్ ,వెచ్చదననికి గుర్తు .                          

మిడిల్ ఈస్ట్ లోని చాలా ప్రాంతాల్లో విషాద ఘడియలకు గుర్తు .

అమెరికాలో ఆరంజ్ పంప్కిన్ అంటే హలో విన్ వేడుకలు ( ఆకురాలు కాలానికి ప్రతీక

 జపాన్ లో జ్ఞానానికి    , నాగరికతకు గుర్తు

మన దేశంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు  ,ప్రయాణించాలనుకునేవారు ఈ రంగు ఎంచుకోవడానికి కారణం ఏమీటి ?

 సాధారణంగా ఓ వ్యక్తి కా షాయం రంగు వస్త్రాలను ధరించడం మొదలుపెట్టారంటే , అతను తన పేరు , గుర్తింపు , కుటుంబం  ,రూపం సమస్తము వదులుకొని కొత్త ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట . కొత్త ఉషోదయంలోకి అడుగెడుతున్నట్టు  ప్రత్యేకమైన రియలైజేషన్ వచ్చినట్లు . సమస్తాన్ని వదులుకొని జీవితంలోని మరో కోణాన్ని చూడబోతున్నాడు అన్నమాట  .ఇది జ్ఞానాన్ని , అంత దృష్టిని సూచిస్తుంది . కొత్త కోణాన్ని జీవితంలోకి ఆహ్వానించినట్లు లేదా ఆహ్వానించాలని ఆలోచనలో ఉన్నట్టు అందువల్లే వస్త్ర  ధా రణలో మార్పు వస్తుందన్నట్లు .

పండు పండినప్పుడు ఆరంజ్ వర్ణంలోకి మారుతుంది  .ఈ రంగం పరిణీతిని సూచిస్తుంది  .ఓ వ్యక్తి మానసిక పరిణితిని సాధించినప్పుడే ఈ రంగు వాడతాడు లేదా వాడాలి  .ఇదంతా ఓ మార్గంలో ఆలోచించేవాళ్ళకు .

                   ఐతే మనబోటి    సామాన్యులకూ  ఈ రంగు కొత్త అర్ధాలను తెలుపుతుంది  .

ఈ రంగును  ఇష్టపడేవారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు  . అందరితో కలిసి ఉండాలనుకుంటారు  .ఆవేశానికి ప్రతినిధులు  .ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు . మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు . ఇతరులతో సులభంగా కలిసి పోతారు  .ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు  .చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు . విభిన్నంగా ఆలోచిస్తారు

ఇంకొంచెం                  

తక్కువ వెలుతురులో నీటిలో స్పష్టంగా కనిపించే రంగు  .అందుకే లైఫ్ జాకెట్స్ లో rafts లో ఎక్కువగా వాడతారు  .నిర్మాణ ప్రదేశాల్లో  ,ట్రాఫిక్ కూడళ్ళలో లో  , ప్రమాద హెచ్చరికలు సూచించేది ఈరంగే .

 సాంప్రదాయక రంగుల అమరికలో   Orange , Blue ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి . పక్కపక్కనుంటే  రెండు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

 సైకాలజీ ప్రకారం ఇది శక్తిని ,వెచ్చదనాన్ని ఇచ్చే రంగు . సృజనాత్మకతకు స్నేహశీలతకు చిహ్నం .

 సాధారణంగా food packaging ,Restarent ల్లో  వాడుతారు .ఆకలి పెంచుతుందని నమ్మకం .

మనదేశంలో ఈ రంగు బలానికి  ,ధైర్యానికి , త్యాగానికి ప్రతీక  .ఈ కారణం వల్లనే జాతీయ పతాకంలో అగ్రభాగాన  నిలిచింది. దీన్ని హ్యాపీ కలర్ అంటారు . ఆత్మవిశ్వాసాన్ని ఈ రంగు దుస్తులు పెంచుతాయని నమ్మకం .2026 ఇది మేజర్ ట్రెండ్ లో ఉన్నారంగు .

 దీన్నెందుకు పవిత్రమైన రంగుగా భావిస్తున్నారంటే ఇది ఎరుపు పసుపుల కలయిక . ఎరుపు శక్తికి       , పసుపు పర్ఫెక్షన్ కు చిహ్నం .

మరి కొంచెం

తొలత క్యారెట్లు Purpul రంగులో ఉండేవి  .డచ్ రైతులు 17వ శతాబ్దంలో ప్రయోగాలు చేసి ప్రస్తుతం ఉన్న రంగును  సాధించారు  .ఆరెంజ్ గులాబీలు కోరికకు ఫ్యాషన్కు గుర్తు . మానవ నేత్రం అత్యంత వేగంగా గుర్తించే రంగు . సరదాను ఉత్తేజాన్ని సూచించే బ్రాండింగ్ రంగు .e g  Fanta

మార్స్ గ్రహాన్ని ఆరెంజ్ ప్లానెట్ అంటారు.

ఇంకా కొంచం

హిందూ సంప్రదాయం లో సింధూరం అత్యంత పవిత్రమై నదీ .వివాహ సమయంలో వరుడు వధువు నుదుట పాపిట సింధూరందిద్దడం  ద్వారా వివాహ బంధం సంపూర్ణమవుతుంది  .ఇది  భర్త రక్షణ , భార్య సుమంగళి  తత్వానికి ప్రతీక

మన దగ్గర హనుమంతుని సింధూరంతో అలంకరిస్తారు  .హనుమంతుడు సీతాదేవి నుదుట సింధూరం చూసి  ,తన శరీరమంతా అద్దు కోవడం ద్వారా రాముని పై తనకున్న అపారమైన ప్రేమను , భక్తిని నిరూపించుకున్నాడు . అందుకే హనుమంతునికి సింధూరం చాలా ఇష్టమైన ది .

ఇంతకు చెప్పచ్చేదేంటంటే

కష్టమైనా  క్లిష్టమైనా  న్యాయం , ధర్మం నిలవాలంటే తప్పదు త్యాగమని అంతర్లీనంగా బోధించేదిఆరెంజ్ రంగు .

లేత గోధుమ రంగులో ఉన్న చిన్న విత్తనం , మావి చిగురు రంగు చిగురాకులతో  నేలపై కొచ్చి  ,చిలకపచ్చ ఆకులనే  బాల్యంతో ముదు రాకు పచ్చని యవ్వన గంభీర్యంతో పుష్పించి , ఫలించి  ,జీవిత సారాన్ని అందించి  ,ఆనందించి పసుపు వర్ణంతో మెరిసి , సింధూరపు వన్నెలతో పండుటాకయి , తాను పుట్టిన మట్టిలోనే కలిసిపోతుంది  .

మానవ జీవితము అంతేగా!

 ఏ మట్టి మనల్ని నిలబెట్టి పెంచి పోషించిందో అదే మట్టి తనలోకి అక్కున చేర్చుకుంటుంది చివరికి . మూడు నాళ్ళ ముచ్చటకు ముక్కు మీద కోపాలు , మూతి విరుపులు , మూసిన తలుపులు , ముసురు పట్టిన మనసులు అవసరమా ఆలోచించండి .

Written by Vijaya Kandala

నా పేరు విజయ కందాళ.
35సంవత్సరాల బోధనానుభవం.ఫోటోగ్రఫీ,యాత్రా సక్తి నా హాబీలు.నీహారిణి గారి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి ప్రవేశించాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాన్నతోనే నా గమనం

ఇదో  కొత్త కథ