
చక్కెర రేణువును ఎంతోశ్రమకోర్చి
గమ్యస్థానం చేర్చే చీమ చాలదా
మనిషి స్ఫూర్తి పొందేందుకు
గూడు అల్లే ప్రయత్నంలో
పడిలేస్తూ పటిష్ఠంగా నిర్మించ
సాలీడు కాదా స్ఫూర్తి కారకం
దృఢచిత్తం ఉండాలే గానీ వైకల్యం ఏ మాత్రం
ఆటంకం కాదంటూ ఎవరెస్టు అధిరోహించిన
అరుణిమా సిన్హా ఎందరికో స్ఫూర్తిదాయకం
నిరాడంబర జీవనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించి
నిర్విరామ కృషితో మిసైల్ మాన్ గా
అబ్దుల్ కలాంగారు గొప్ప స్ఫూర్తి ప్రదాత
పదివేల దృష్టాంతాలెందుకు
మంచీ – చెడుల్లాంటి పాలూ – నీళ్ళను
ఎంతో నేర్పుతో వేరుచేసే ఆ
సుందర మరాళే నాకెంతో స్ఫూర్తి ప్రదం