గగనంలో విహరించే పక్షిలా
గమనంలో హద్దులు చెరిపేలా
వెలుగులు జిమ్మేకాంతి పుంజంలా
పడిలేచే కడలికెరటంలా ..కదిలే మహిళా జోహార్ జోహార్
అందరికీ ఆదర్శంగా
ఎందరికో ప్రేరణ గా
అందరిలో నువ్వేగా
అన్నింటా ముందుకు సాగే
మహిళా జోహార్ జోహార్
అబలను కాదని సంబరంగా
బలహీనుల కాలంబనగా
బడుగువారికాపన్నహస్తంగా
మానవతా మూర్తి గా కదిలే
… మహిళా జోహార్ జోహార్
ప్రపంచ దేశాలు తిరుగుతూ
అద్భుతాలెన్నో సాధిస్తూ
అలుపనేది లేకుండా
అహరహరం కృషి చేసే
… మహిళా జోహార్ జోహార్
చరితలు తిరగ రాస్తూ
చరిత్రలో ఒకపుటలా
చెరగని ముద్ర వేస్తూ
చరితార్థం నీ బ్రతుకే
… మహిళా జోహార్ జోహార్
అభినవ ఉషోదయం
అభినుత కార్యాచరణం
ఆరాధన హృదిమయం
ఆలోచన నిత్యనూతనంగా
.. కదిలే మహిళా జోహార్ జోహార్……….
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంకితం నా కవిత