మన మహిళామణులు – దేవరాజు రేవతి

అధ్యాపకురాలు ఆదర్శ గృహిణి కోడలిగా దేవరాజు రేవతి గారు చక్కగా తరుణితో తన మనసులోని ఊసులు పంచుకున్నారు. మరి చదవండి

నాపేరు దేవరాజు రేవతి.
నేను చెన్నూరు గ్రామములో పుట్టాను.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.నా బాల్యమంతా నిర్మల్ లో గడిచింది.నేను సరస్వతీ శిశు మందిరంలో 1నుండి 10 వ తరగతి వరకు చదివాను.మా నాన్న దేవరాజు సాంబమూర్తి,అమ్మ శ్యామల.మేము నలుగురం అక్కాచెల్లెళ్ళం.ఒక అన్నయ్య.నేను అందరికంటే చిన్న దాన్ని .మా నాన్న జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసేవారు.నేను 7.వ.తరగతి చదివేటప్పుడు మా నాన్న గారు పదవీ విరమణ పొందారు. పెన్షన్ మంజూరు అయ్యేవరకు చాలా యిబ్బందులు పడాల్సి వచ్చింది.నేను కష్టపడి చదివే దాన్ని.మంచి మార్కులతో చాలా మంచి‌ నడవడి , పద్ధతితో మా ఉపాధ్యాయుల మనసు చూరగొన్నాను. అందరు అభిమానించే విద్యార్థిగా ఆట పాటలతో సాగింది నా బాల్యం.7.వ తరగతిలో పద్య పఠన పోటీ లో 50 పద్యాలు చదివి మెప్పు పొందాను.అన్నమాచార్య కీర్తనలు నేర్పించేవారు.మా తెలుగు ఉపాధ్యాయులు రామానుజాచార్యులు బోధించే విధానం నా పై చెరగని ముద్ర వేసింది.నాకు స్నేహితులు‌ ఎక్కువ.సెలవు రోజు సరదాగా గడిచేది.పదవ తరగతి తరువాత B.P.C గ్రూపు తీసుకుని నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాను.మా యింటి నుంచి కళాశాల 3 కిలోమీటర్ల దూరంలో వుండేది.నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళం.ఇంటర్ లో కెమిస్ట్రీ వెంకటరత్నం సార్ చాలా అద్భుతంగా చెప్పేవారు.బాటనీ‌ అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు.డిగ్రీ కూడా నిర్మల్ ప్రభుత్వ కళాశాల లో B.sc B.zc గ్రూపు తీసుకుని చదివాను. మాకు జంతు శాస్త్రం అశోక్‌ కుమార్ సార్ చాలా అద్భుతంగా చెప్పేవారు.వారు చెప్పగా విని నేను స్వంతంగా నోట్స్ తయారు చేసుకొని మా స్నేహితులకు యిచ్చాను.అది చూసి సార్ నన్ను అభినందించారు.అది నేనప్పటికీ మరువలేను .డిగ్రీ ప్రధమ సంవత్సరం కాలేజీ ఫస్ట్ రావడం అప్పటి ఎం.ఎల్.ఏగారైన వేణుగోపాలాచారి చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం మరచి పోలేని జ్ఞాపకం.డిగ్రీ పూర్తి కాగానే P.G. చేయాలనుకున్నా.కానీ మా నాన్నగారు నాకు పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టి నా చదువుకు స్వస్తి వాచకం పలికారు.నాన్నగారిని యిబ్బంది పెట్టడం యిష్టం లేక పెళ్లి చేసుకున్నా ను.నా భర్త మాడుగుల నారాయణ మూర్తి .తెలుగు పండితులు పురోహితులు అవధాని.మాది పండిత వంశము.కాళేశ్వరము నా మెట్టినిల్లు. ఇద్దరు పిల్లలు సాహితీ,సాకేత్ పుట్టి వాళ్ళు బడికి వెళ్ళడం‌ తో నాకు మళ్ళీ చదువు కొన సాగించాలనే తపన మొదలైంది.

మా వారి సహకారంతో M.A.తెలుగు పూర్తి చేసి వెంటనే ప్రెవేట్ డిగ్రీ కళాశాల లో అధ్యాపకురాలిగా చేరాను.ఆ కళాశాలలో చేరిన రెండో సంవత్సరం మంచి ఉత్తీర్ణత శాతం సాధించి యాజమాన్యం ప్రశంసలందుకొని బహుమతి తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది..అదే సంవత్సరం ప్రభుత్వ కళాశాల లో C.J.L.గా పనిచేస్తు నా చదువు కు పదును పెట్టే దాన్ని.5సం పని చేశాక. B..ed పూర్తి చేసి డీఎస్సీ వ్రాయడానికి సిద్ధపడ్డాను.ఆ. సమయంలో నా పిల్లలు మా వారి సహకారంతో పట్టుదల తో చదివి ప్రభుత్వ ఉద్యోగం లో తెలుగు పండితురాలిగా అదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతమైన డబ్బా Zpss ఉన్నత‌ పాఠశాల లో అడుగు పెట్టాను.జీవితం ఎవ్వరికీ వడ్డించిన విస్తరి కాదు..ఎన్నో కష్టనష్టాలను, ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగితే విజయం వరిస్తుంది.మన లక్ష్యాన్ని చేరుకుంటాము.మంచి‌ గురువు గా ఎదుగుతూ ఎంతోమంది ని ప్రేరణగా తీసుకుని కొందరికీ స్పూర్తి గా నిలుస్తూ నా ఉద్యోగ జీవితాన్ని పిల్లలను మంచి పౌరులు గా తీర్చి దిద్దడం కోసం కృషి చేస్తున్నాను.

నా జీవితం లో మరో మలుపు నేను కవయిత్రి గా సాహిత్య సేవ చేయడం.పద్యాలు పాటలు ,గజల్స్,మణిపూసలు, వచన కవిత్వం మొదలగు ప్రక్రియ లలో రచనలు చేయడం నా‌ ప్రవృత్తి. పిల్లలకు నేను వ్రాసిన దేశభక్తి పాటలు , పద్యాలు నేర్పించి‌ ప్రదర్శింప చేస్తాను.”అందరూ ఎదగాలి అందులో మన ముండాలి”అనే దానికి ప్రాధాన్యత నిస్తాను.

రేవతిగారు రాసి పాడినపాట

23 ఏండ్ల ఉద్యోగ జీవితం లో ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినాను. వారు ఉన్నత చదువులు చదివి వివిధ ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు.. గురువు ను మించిన శిష్యులుండడం నా కెంతో గర్వకారణం.ప్రస్తుతంMPUPS అంకుసా పూర్ ఆసిఫాబాద్,కుమ్రంభీమ్ జిల్లా లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను.తల్లిగ అలిగ,చెల్లిగ,కోడలుగ,కూతురిగ స్నేహితురాలిగా అన్ని బాధ్యత లను నిర్వహిస్తూ అందరి మదిని గెల్చుకున్నాను.
స్వయంకృషి భర్త అత్తవారింటి ప్రోత్సాహం ఉంటే తరుణి ఏదైనా సాధించగలదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యూరోప్ ట్రిప్ – 15 

దొరసాని -65 వ భాగం