నాడు – నేడు

నాడు ఉన్న సంప్రదాయం
నేడు సన్నగిల్లిపోయింది
నాడు ఉన్న కట్టుబాట్లు
నేడు కట్టలు తెంచుకున్నాయి
నాడు ఉన్న అనురాగాల బంధాలు
నేడు అనుమానాల బంధాలు

నాడు ఎరుపు సింధూరం నుదిటిపై చేరి వన్నె తెచ్చేది
నేడు నుదిటిపై కనుమరుగై
పెదవి పై చేరి వణుకు తెస్తుంది

నాడు వస్తాలు చీకు పట్టి చినుగుతే
నేడు వస్తాలనే చింపి ధరించే దుస్థితి
నాడు పువ్వుల పరిమళాలు
నేడు పూసుకున్న పరిమళాలు

నాడు సైకిల్ తొక్కి సన్నబడితే
నేడు బండి ఎక్కి బరువవుతున్నారు
నాడు చీకటి గుడిసెలో బ్రతికిన
మల్లె పువ్వుల వంటి వారు
నేడు వెలుగు బంగాలలో బ్రతికిన
మేడి పండు వంటి వారు

నాడు నాటకాలు చూసి మురిసిపోతే
నేడు నటించుకుంటూ మురిగిపోతున్నారు
నాడు బంధాలే బలం
నేడు బంధాలే బరువు
నాడు కష్టమే సుఖం
నేడు సుఖమే కష్టం

Written by Ankita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మాయ నిండిన మది

…లింగ వివక్షత……GENDER DISCRIMINATION.