ఉసిరిచారు

ఇప్పుడు ఉసిరికాయలు దొరికే కాలం.కాబట్టి వెరైటీగా పప్పు ,చారు చేసుకోవచ్చు.కందిపప్పు ఉడికించి ఉంచుకోవాలి. ఉసిరికాయలు రెండు మూడు కచాపచా దంచి పోపులో వేసి మగ్గినాక పప్పులోవేసి ఉప్పు, కారం కరేపాకు,కొత్తిమీర కల్పితే ఉసిరిక పప్పు రెడీ!

ఉసిరికాయ చారు ఇలా చేయాలి.మిక్సీలో రెండు మూడు గింజలుతీసిన ఉసిరికాయలు,పచ్చిమిర్చి,జీలకర్ర,మిరియాలు,టమాట, ఉప్పువేసి సిద్ధంగా ఉంచుకోవాలి .కొద్దిగా కందిపప్పు ఉడికించి, బాండీలో నూనెవేసి పోపులో ఆవాలు ఇంగువ ,చింతపండు,తగినంతనీరుపోసి ఉడికించాలి.ఆపై రుబ్బిఉంచిన మిశ్రమం కల్పి ఒక పొంగు రాగానే దింపాలి.ఇలా ఉసిరి ఆరోగ్యానికి సిరి.చేసి చూడండి

Written by S. Sukanya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు 35వ భాగం

చెరుకుతుద వెన్ను పుట్టిన