
ఆకాశమంత మబ్బులు కమ్మి, నల్లటి మేఘాలు అలా వాటి ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాయి.
ఆకాశంలోని పక్షులు అలా ఎగురుతూ ఉంటే, పిల్లలు ఆడుకుంటున్నట్టు ముచ్చటగా అనిపిస్తుంది.
కనుచూపు మేరలో ఎప్పటికి కలవని ఆకాశం భూమి కలిసినట్టు కనిపిస్తుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది.
కదలిక లేని నీళ్లళ్లో ఒక్కో చినుకుపడి, అది కదులుతుంటే గాలికి ఎగిరే అమ్మాయి కురులులాగ కనిపిస్తుంది….
ఒక్కో చినుకు నా మీద పడుతూ ఉంటే, ఆ మేఘం నా కోసమే వర్షాన్ని కురుపిస్తుందన్నట్టు మనసు ఆనందంతో గంతులేస్తున్నట్టుంది…
పచ్చటి చెట్ల మధ్య ఇళ్లు కనిపిస్తుంటే స్వర్గంలో ఉన్నంత కనుసొంపుగా ఉంది.
ప్రకృతికి మించిన ఆనందం ఉంటుందా?
దాన్ని ఆస్వాదించడానికి… చూడటానికి… ఆనందించటానికి… ప్రకృతిని ప్రేమించే ప్రశాంతత ఉండాలి.