పురుష పుంగవులారా….!

వ్యాసం

ఏ.అరుణా

చాలామంది రచ్చబండ దగ్గర చేరి ధారాళంగా ఉపన్యాసాలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా తన ఆదిపత్యాన్ని గురించి మాట్లాడడమే ఎక్కువ. ఒక్కొక్కసారి స్త్రీలను గురించి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి వారు ఎందుకూ పనికిరారని వంట ఇంటి కుందేలు తప్ప మరి దేనికీ పనికిరారు అని మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వారిని అడగవలసిన ప్రశ్న ఏమిటి అంటే నీ జన్మ ఎక్కడ నుంచి వచ్చింది తండ్రి నుంచా లేక తల్లినుంచా తల్లి అయితే ఆమె ఆడపిల్ల కదా నీ తల్లిని నీవు చులకన చేసుకుంటావా ? అదే నీ చెల్లి గాని అక్కగానీ అయి ఉంటే ఆమెను గురించి అసభ్యంగా మాట్లాడగలవా ముందు ఎలా మాట్లాడాలి అన్న విషయం తెలుసుకోవాలి అవధులు దాటి మాట్లాడడం ఏ వ్యక్తికి సరైన పద్ధతి కాదు అందులో విమర్శించినప్పుడు దోష రహితంగా ఉండాలి.
నేను మగవాడిని సంపాదించే వాడిని నేను లేకపోతే నా సంసారం జరగదు ఆడది ఏం చేస్తుంది మనం తెచ్చిన డబ్బుల్ని ఖర్చు చేస్తుంది అంతకుమించి ఆమెకు పని ఏమి ఉంటుంది అంటూ సాగుతుంది ధోరణి అలాంటి వాడికి ఒకే ప్రశ్న నీ భార్య ఆడది నీ తల్లి ఆడది నీ చిన్నతనంలో నీ తల్లి ఆప్యాయతను ప్రేమను అనుభవించిన వాడివే కదా అదే అనుభూతిని భార్య ద్వారా ఎందుకు పొందలేకపోతున్నావు అంటే నీలో ఆత్మ న్యూనతా భావం ఏ మూలలో దాగి ఉన్నది అని అర్థం ఆమె కన్నా నేను తక్కువ అన్న భావం మనసులో ఎప్పుడూ వెన్నంటుతూనే ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేంతవరకు ఇంటిలో ప్రతి పని ఆవిడ చేయవలసినదే కదా పిల్లల పోషణ దగ్గర నుంచి వారిని నిద్రపుచ్చేంత వరకు అది చిన్న పనిగా కనిపిస్తుందా వంట చేయడం అంటే ఎందుకు పనికిరాని పనా..! ఒకరోజు ఆమె వంట చేయడం మానితే అప్పుడు తెలుస్తుంది ఆమె విలువ. నా పిల్లలకు నేను కారణం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు. ఒక చెయ్యి ఊపితే శబ్దం వస్తుందా ఈ చేతికి రెండవ చేయి కూడా తగిలినప్పుడు మాత్రమే నీవు అనుకున్న శబ్దాన్ని చేయగలవు స్త్రీ లేదు అనుకుందాం. ఎవరి ద్వారా నీవు పిల్లలను కంటావు మరొక పురుషుడు ఆ పని చేయగలడా ఎవరు చేయవలసిన పని వారు చేసి తీరాలి ఇది ప్రకృతి నియమం శుక్ల శోనితం కలిస్తే తప్ప స్త్రీకి గర్భం రాదు అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం ఎంత విచిత్రమో అనిపిస్తుంది విషయం తెలిసిన వాడివి నవమాసాలు మోసి చావు బ్రతుకు తేల్చుకోలేని స్త్రీ ప్రసవాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆమె కష్టం నీకు తెలిసి వస్తుంది ఆ బిడ్డ బయటకు రాకపోతే నీవు అమితంగా ఆనందించే ఆడపిల్ల కానీ నీ పున్నామ నరకం నుంచి కాపాడే పుత్రుడు గాని రావడానికి కారణం ఆమె నీవు ఆలోచించి మాట్లాడు.
తనంత సూర్యకాంతం లాంటి గద్దరి మనిషి ఈ ప్రపంచంలో లేదు అని చెప్పుకుంటావే ఆమె గద్దరితనం ఎక్కడి నుంచి వచ్చింది నీ చేష్టలు కదా కారణం ఇంటికి కావలసిన సరంజామా తీసుకురాకపోతే ఆమె ఏం చేయగలదు అవి కావాలి ఇవి కావాలి అని అడిగితే అది గొంతెమ్మ కోరికల్లాగా ఉంటాయా నిజంగా ఆమె అడిగి నీవు తీసుకురాకపోతే నోటికి ముద్ద వస్తుందా ఆరోజు నిరాహారమే కదా నీ బ్రతుకు దయ దలిచి ఆమె ఉడకబెడితే నీ కడుపు నిండుతుంది లేకుంటే మంచినీళ్లతోనే కడుపునింపుకోవాల్సి వస్తుంది నీకు నిజంగా ఆప్యాయతను పొందాలి అనుకుంటే నీవు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడినప్పుడు అంత ఆప్యాయంగా ఆమె మాట్లాడదా నీవు చిరునవ్వుతో ఒక మాట మాట్లాడితే పది మాటలు మాట్లాడుతుంది ఆ గృహిణి ఆమెను అంతంత మాటలు అనడానికి నోరెలా వచ్చిందయ్యా. తన తల్లితో ఎప్పుడూ గొడవలు పడుతుంది నా భార్య అని చెప్పుకునే భర్తలు సిగ్గుపడవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే అసలు గొడవలు ఎందుకు వస్తాయి అత్త కోడల్ని ప్రేమగా చూసుకుంటే కన్న కూతురు లాగా ఆదరించడం మొదలుపెడితే అత్త పాదాలను ఒత్తి అనుక్షణం ఆమెకు సపర్యలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఏ కోడలైనా తన తల్లిలా అత్తగారిని చూసుకునే స్థితిలోకి రావడానికి ఎవరు కారణం అది ఆలోచించకుండా విమర్శించడమేనా కోడలు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఏదో లోపం వెతికి ఆమెను అనరాని మాటలు అంటూ ఉంటే ఎంతకాలం ఆమె భరిస్తుంది అలాంటి స్థితిలో ఆమె నోరు చేసుకోవడం తప్పా అందుకని గయ్యాళిగంప అని విమర్శిస్తూ ఉంటావా నీకది న్యాయంగా అనిపిస్తుందా నిజంగా అనిపిస్తే విషయం ఏమిటంటే నేను నిలదీసి అడిగి అమ్మను ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మ అలా చేస్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చి ఉండేవాడివి కదా. ఆమె విసుక్కోడానికే కారణం తన పనిలో ఉండి పిల్లల్ని చూసుకోవడంలో కొంచెం ఆలస్యం అయితే సహాయం చేయలేవా అని అడిగితే అది తప్పయినట్లుగా విమర్శించడం ఇంటిలో ఈ సరుకులు అయిపోయినాయి తీసుకురండి అని చెబితే అదేదో నిన్ను ఇరకాటంలో పెట్టినట్లు బాధపడితే ఏమిటి ప్రయోజనం కానీ సోనీ ఇంట్లో భోజనం చేసిన తర్వాత నీవు తిన్న కంచం తీసి ప్రక్కన పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎంతో విసుగులో పనిలో ఉన్న సమయంలో కూడా నీకు మంచినీళ్లు ఇవ్వలేదని ఆమె మీద ఫిర్యాదు చేస్తావే అది సమంజసంగా అనిపిస్తుందా నీకు? దాహమైతే నీవు ఒక గ్లాసుడు నీళ్లు తాగడానికి బద్ధకిస్తే అంత పని ఒత్తిడిలో ఉన్న ఆమె కొంచెం ఆలస్యం చేస్తే నీకు అది పెద్ద తప్పులా గా కనిపించిందంటే నీకన్నా ఘోరంగా ఆలోచించేవాడు ఎవడుంటాడు ఈ ప్రపంచంలో.
అదే నీ కూతురు గాని అక్కగానీ చెల్లి గాని అత్తవారింటికి వెళ్లి అక్కడ ఇలా చేసి ఆమె అత్త ఏమయినా అంటే పరుగుపరుగున వెళ్లి ఆమె మీద తగవులాడతావే నీ రక్తసంబంధం తోనే చేశావు ఈ పనిని ఆమె రక్తసంబంధం ఉన్న అన్న గానీ తమ్ముడు కానీ వచ్చి నీ పైన పోట్లాడితే నీవు ఏం చేయగలవు తప్పు నీదా వారిదా పరిస్థితులను అవగాహన చేసుకుని కష్టపడుతున్న భార్యకు ఏ ఒక్క రోజైనా చేదోడు వాదోడుగా చిన్న పని అయినా చేసి పెట్టావా? ఆమెను విమర్శించడానికి మాత్రం ముందుంటావు సహకారం మాత్రం ఉండదు ఇది న్యాయంగా కనిపిస్తుందా నీకు ఈ కుటుంబానికి ఏ సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని ఇంటిలో గొడ్డు చాకిరి చేస్తూ ఉంటే ఆమెపై జాలి చూపి సహకరించవలసింది పోయి అనరాని మాటలతో ఆమె మనసును గాయపరిస్తే అది నీకు న్యాయంగా కనిపిస్తుందా చిన్న బిడ్డకు నీ భార్య చేస్తున్న పనులు చూస్తే నీకు ఏమనిపిస్తుంది మూత్రానికి వెళ్ళడం కానీ విరోచనానికి వెళ్లడం కానీ తెలియని ఆ పసిగుడ్డు అన్ని పక్కలోనే చేస్తూ ఉంటే ఎంత సహనంతో మళ్లీ బిడ్డకు ఆ తడి కాకుండా పొడి గుడ్డతో శుభ్రంగా తుడుస్తూ ఆ బిడ్డకు ఎలాంటి రోగకారక క్రిములు తగలకుండా చూసుకునే బాధ్యత వహిస్తుంది ఆమె తెల్లవారు ఆ మే నిద్రపోకుండా వాడి ఏడుపులతోనే సరిపోతుంది కదా కనీసం ఓదార్పు మాటలతో చాలా బాగా కష్టపడుతున్నావు ఏవైనా ఇబ్బంది కలుగుతుందా లేకపోతే ఎవరినైనా ఒక పని మనిషిని ఏర్పాటు చేయమంటావా అంటూ అనునయంగా ఏ ఒక్క రోజునైనా నీవు పలికేన పాపాన పోయావా మీ అమ్మ చేసిన పద్ధతిలో ఏమి చేయకపోతే తెలియక చేసిన ఆమె అమాయకత్వాన్ని సరిదిద్ద వలసినది పోయి కంచాన్ని ఆమె మొహం మీద విసిరితే నీ సంస్కారాన్ని గురించి ఏమనుకోవాలి.
నీవు బయటకు వెళ్లి గ్రంథాలయాలలో కానీ స్నేహితులతో కానీ చక్కగా హాయిగా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ ఉంటావు. నీ భార్య ఇరుగుపొరుగులతో కలిసి నలుగురు ఏదో ఊచుబోసు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అది ఎందుకు పనికిరానిది అని తిట్టడమా నీకన్నా తెలివైనవారు ఆ నలుగురులో ఐదుగురు ఏ ఒక్కరూ లేరా పత్రిక చూసి విషయాలు సేకరించే స్త్రీ వారిలో నీకు కనిపించలేదా పోనీ వారు మాట్లాడుకుంటున్న విషయాలు ఏమిటో నీవు ఎప్పుడైనా విని దానిని గురించి మాట్లాడుతున్నావా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు ఈ కూర ఎలా చేయాలి ఆ కూర ఎలా చేయాలి లాంటి కబుర్లు తప్ప వారికి ఇంకేముంటాయి తన భర్తను గురించి వేరే కబుర్లు చెప్పుకోవడం తప్ప సమయాన్ని వృధా చేయడం కోసం చేసే పనులని భావిస్తున్నవు తప్ప వారికి కూడా కాలక్షేపం కావాలి అనే జ్ఞానం నీకు ఉండదా.ఆమె కర్రీ పాయింట్ లో కూరలు తీసుకురమ్మని ఎందుకు చెబుతుంది నీవు కూరగాయలు తీసుకురాకపోవడం వల్ల అన్న విషయం మర్చిపోయి ఆమె ఏ కారంతోనో పచ్చడితోనో అన్నం పెట్టడానికి సంకోచిస్తూ మంచి కూరతో నీకు భోజనం పెట్టాలన్న ఆలోచనతో ఆమె చెబితే అది నీకు దోషంగా కనిపించిందా ఏం బజారుకు వెళ్లి నీ ఉద్యోగం చేస్తూ వచ్చేటప్పుడు కూరలు తీసుకొచ్చే సమయమే నీకు దొరకదా ఉదయం వెళ్లి పాలు తీసుకొని రాలేవా నడిచినట్లుగా కూడా ఉంటుంది కదా దానికోసం వారికి డబ్బులు ఇచ్చి కూలి వారిని ఏర్పాటు చేసుకుంటావా నిన్ను దూషించాలనుకుంటే ఆమెకు ఎన్ని లేవు కానీ ఎప్పుడైనా నీవు ఇన్ని మాటలు అంటున్నా ఇన్నిసార్లు ఇన్ని విషయాలపై తిట్టినా ఆమె నోరు విప్పి ఒక్క మాట అయినా నిన్ను అని ఎరుగునా అప్పటికి కూడా ఆమె మంచితనం నీకు తెలియక పోతే నీ అజ్ఞానానికి చింతించడం తప్ప ఏమీ చేయలేం. పిల్లలను తీర్చిదిద్ది క్రమశిక్షణలో పెంచి వారిని మంచి ఉద్యోగస్తులుగా తయారుచేసి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేయాలన్న కోరికతోనే భార్య బిడ్డలకు అక్షరాలు దిద్దడం దగ్గర నుంచి అన్నీ చేస్తూ ఉంటే కనీసం ఒక్కరోజునైనా వాడి దగ్గర కూర్చుని ఏం బాబు ఎలా చదువుతున్నావ్ ఏం పాప నీవు చదువుతున్న పాఠాలు నీకు అర్థం అవుతున్నాయా లేక నన్ను ఏమైనా చెప్పమంటావా అని ఒక్క మాట అడిగావా ఎప్పుడైనా ఏమిటి ఎప్పుడూ పిల్లలతోనే కాలక్షేపం చేస్తూ ఉంటావు నేను వచ్చినది గమనించవలసిన అవసరం లేదా రాగానే మంచినీళ్లు ఇచ్చి నన్ను సేద తీర్చవలసిన బాధ్యత నీకు లేదా అని కేకలు వేయడం తప్ప పిల్లలకు పాఠాలు చెప్తుంది నీ మంచినీళ్లు నీవు ముంచుకుని నీ దాహాన్ని తీర్చుకోవాలి అన్న కనీస జ్ఞానం కూడా లేకపోతే నిన్ను నిజంగా మనిషిగా గుర్తించవచ్చా నీవే ఆలోచించు. ఏ కుటుంబం అయినా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తుంది అంటే దానికి ఆమే కారణం నీవు పెట్టే బాధలను భరించలేక ఇంటి నుంచి వెళ్ళిపోతే నిన్ను ఏమంటారో నీకు తెలుసు కదా చేతకానివాడు దద్దమ్మ కనుకనే వాడిని విడిచి వెళ్లిపోయింది అనే అపవాదురాకమానదు బంధువులు స్నేహితులు ఎవరు వచ్చినా వారికి అతిథి మర్యాదలు చేస్తూ కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్నది నీవా ఆమె. స్త్రీ వల్ల ఆ కుటుంబానికి గౌరవం వస్తుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు మీ కుటుంబం ప్రశాంతంగా వెళుతుంది అంటే దానికి కారణం ఆమె మంచితనం ఇరుగుపొరుగులతో ఆమెకు ఉన్న చక్కటి ఆత్మీయతను పంచే తోటి గృహిణిలతో స్నేహం మీ పిల్లలు గొప్పవారు కావడానికి కారణం ఆమె కానీ నీవు కాదు కదా ఇప్పటికైనా ఆమెను గురించి చెడుగా మాట్లాడడం మానితే చాలా మర్యాదగా ఉంటుంది.
కుటుంబం అన్న తర్వాత సమస్య జీవనం అని మరిచిపోకూడదు భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ పిల్లలను క్రమశిక్షణలో పెంచుతూ ఆనందంగా ఆప్యాయతలను పంచుతూ అనునిత్యం ఆనందాన్ని అనుభవిస్తున్న మీ కుటుంబాన్ని చూసి ఆదర్శ కుటుంబం ఇలా ఉండాలి అని అనుకునేట్లుగా వారు కూడా ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వారికి వస్తే ఒక కుటుంబాన్ని చూసి మరొక కుటుంబం మరొక కుటుంబాన్ని చూసి వేరొక కుటుంబం ఆనందంగా ఉండడంతో సమాజం మొత్తం సుభిక్షంగా ఉంటుంది సనాతన ధర్మం లో చెప్పినట్లు సర్వేజనా సుఖినోభవంతు అన్న నీతిని ఆచరణలో పెట్టిన వారం అవుతాం అందుకు ప్రతి ఒక్కరూ సహకరించడం మంచిది

Written by A. Aruna

అరుణానంద్
విజయవాడ.
9492811322.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

వస్తువు, విషయం – subject and content