Akkinenipalli Nirmala
నేను నిర్మల దేవులపల్లి/అక్కినేపల్లి. M.Sc,B.Ed . నేను పుట్టి పెరిగింది, నా చదువు అంతా భాగ్యనగరం లోనే ! మాడపాటి హనుమంతరావు పాఠశాలలో K.G నుండి 10వ తరగతి వరకు, Intermediate to B.Sc Degree వరకు వనిత మహావిద్యాలయం లో , M.Sc zoology Koti Women's collage లో చదుకున్నాను.పెళ్లి prof.Raghuramrao గారితో జరిగింది. వెంటనే B.Ed వరంగల్ కాకతీయ కళాశాలలో చదువుకున్నాను. మాకు ఇద్దరు ఆణిముత్యాలు అమ్మాయిలు పుట్టారు. పెద్దమ్మాయి వైష్ణవి B.tech చదివింది . భార్గవ కొండపల్లి B.tech,M.S తో పెళ్లి జరిగి అమెరికాలో ఉంటున్నారు. చిన్నమ్మాయి Vainika Doctor M.B.B.S, D.N.B Psychiatry. ఇక్కడ నా గురించి కొంత చెప్పుకోవాలి. నాకు చిన్నప్పటి నుండి ఆటలంటే మక్కువ ఉండేది. చిన్నప్పటి నుండి vollyball ఆడేదానిని ఆ ఆటను మన రాష్ట్రానికి 10సార్లు ఆడాను. నేను మొదట ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా , కొంత కాలం ఒక స్కూల్ లో high school టీచర్ గా పిల్లలకి చదువు చెప్పాను. మరి కొంతకాలం ఒక కాలేజ్ లో డిగ్రీ పిల్లలకు బోధించాను.ఆ తరువాత మా పిల్లలు పెరుగుతుంటే వాళ్లకు కూచిపూడి నృత్యం, సంగీతం నేర్పించాలి అని నా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా వాళ్లకు చదువుతో పాటు వారి ఈ క్లాసెస్ కు తీసుకెళ్లడం, వాళ్ళ ప్రోగ్రామ్స్ కు వాళ్ళతో తిరగడం వల్ల నా కెరీర్ గురించి ఆలోచించడం మానేసి వాళ్లను తీర్చిదిద్దడం లోనే ఆనందం పొందాను. దానివల్ల నా పెద్దబిడ్డను ఇంజనీర్ ను చేయడమే కాక మంచి కూచిపూడి నృత్యం లో ప్రావీణ్యత సంపాదించడమే కాక ఇప్పుడు అమెరికా లో కూచిపూడి నృత్యాన్ని నేర్పించే గురువుగా ఎదిగింది. మా చిన్నమ్మాయి మొదట సంగీతం నేర్చుకుంది కానీ తన అక్కను చూసి తను డాన్స్ నేర్చుకుంది.మెడిసిన్ లో చేరిన తర్వాత సమయం సరిపోక తన కోరికను కొంత కాలం ఆపేసింది. P.G పూర్తి అయ్యాక ఉద్యోగం చేస్తూ మళ్ళీ సంగీతం నేర్చుకుంది. నేను ఇప్పుడు తరుణి పత్రిక , మయూఖ పత్రిక ఎడిటర్ కొండపల్లి నీహారిణి గారి ప్రోద్బలం తో వ్రాయడం మొదలు పెట్టాను. చదవడం అంటే ఇష్టం. తరుణి పత్రిక స్త్రీ ల సాధికారత దిశగా ప్రయత్నం చేస్తున్నది . నా రచనలు తరుణి పత్రిక లో ప్రచురితమవడం సంతోషదాయకం.