ఉదయం పది గంటలు అయివుoటుoది.కొడుకు,కోడలుఆఫీసులకు,మనవలు స్కూలుకి వెళ్ళిపోగా పేపర్ చదవాలని చేతిలోకి తీసుకుంది తులసి.టీపాయ్ మీద పక్కనే తన సెల్ ఫోన్.ఆమె పేపర్ తో పాటు ఫోన్ తీసుకుమేసీజ్ లు చూసింది.తన హై స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ లోఅట్ల తద్ది శుభాకాంక్షలు.ఆమె సోఫాలో కూర్చుOది,’’అట్లతద్ది’’ చాలామంది మర్చిపోయిన అందమైన పండుగ. ఆమెకు నిన్న సాయOత్రO మనవరాలికి ,తనకి జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. ‘’ఈ పూజలు అవీ ఎందుకు చేస్తారు బామ్మా బోర్’’ అంది శరణ్య.
‘’మనం చేసే పూజల్లోఎంతో,శ్రద్ధ,ఓపిక,జ్ఞానం,పధ్ధతి,ఏకాగ్రత ఎన్నో ఉoటాయి.మొన్న వినాయకచవితి పండుగను నువ్వు అలాగే అన్నావు. కానీ అది ఒక బొటానికల్ టూర్ లాoటిది.అంటే నిజమే అన్నావా,అలాగేఈఅట్లతద్ది కూడా.
‘’మరి మనం ఏ దేవుడిని పూజిoచాలి ఎందుకు.?’’
తులసికి ఏoచెప్పాలో అర్ధం కాలేదు,తను అనవసరంగా ఈ అట్లతద్దిటాపిక్ తలకెత్తుకుoదా.
ఈ పూజ చేసి ఉపవాసం వుండేది మంచి భర్త కోసం అని పదేళ్ల శరణ్య కు చెప్పగలదా.?
అలాచెపితే కొడుకు కోడలు తన గురించి ఏమనుకుoటారు.ఇప్పటికే తను పిల్ల లకు’’ భక్తి’’ నూరిపోస్తానేమోనని కోడలి భయం. అసలు పిల్ల లతో పెద్ద విషయాలు మాట్లాడటం తనకే ఇష్టం వుండదు.ఇంతలో కోడలు శరణ్య ను పిలిచింది హోంవర్క్ మొదలు పెట్టమని.
చేతిలో ఫోన్ మోగింది అటునుంచి భర్త,ఆయన ఏదో పని వుందని స్వగ్రామOవెళ్ళాడు.తను రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్.ఆమె సరే అని ఫోన్ పెట్టేసింది.ఆమెబాల్కనిలోకినడిచింది.ఆశ్వయుజ మాసం ఎండ కాంతిగా వుంది,ఆకాశాన్నOటే బహుళఅంతస్తులభవనాలు.రెండేళ్ళుగా తాము హైదరాబాద్ లో కొడుకు ఇంట్లో వుంటున్నారు.నాలుగు బెడ్ రూమ్ లు గల విశాలమైన ఫ్లాట్,ఏవో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు లేవు.తనకుటుOబలో,చేతిలోగల్ ఫోన్ లో మళ్ళీ మెసేజులు.
ఆమె మనసు బాల్యO లోకి పోయింది.తనకి చిన్నప్పుడు అన్ని పండుగలు,శుభాకార్యాలు అంటే చాలా ఇష్టం గా వుండేది. అలాగే ఈ అట్లతద్దికూడా.గోరిOటాకు పెట్టుకోవడం,తెల్లవారుఝామున లేచి ఆడుకోవడం,ఊయలఊగడం,రోజంతావుపవాసంవుండి రాత్రికి చంద్రదర్శనం చేసుకుని అట్లు తినడం ఇలా నోము చేసే వివరాలు తెలుసుకుని తను చాలా ఎక్సయిట్అయింది.కానీ తమ ఇంట్లో ఈ పూజలు వాటి గురించి పెద్ద పట్టింపు లేదు,తులసికి బాగా గుర్తు .తన పది సOవత్సరాల వయసులో తనూ ఈ నోము చేస్తాననిపెద్ద వాదన వేసుకుంది తల్లితో.
‘’మనిOట్లో ఈ నోము ఆనవాయితీ లేదంటే వినవేOతులసి.పైగానీకు
క్వార్టర్లీ పరీక్షలు జరుగుతున్నాయి.ఉపవాసంవుండి పరీక్షలు రాయలేవు.’’అంది తల్లి.
‘’కళ్ళు తిరిగి పడిపోతే పరీక్ష రాయక్కర్లేదని నీ ప్లాను ,అంతేకదూ‘’అన్నాడు అన్నగారు చెల్లిని ఏడిపిస్తూ.
‘’ప్రతి ఏడాది ఈ టైముకి పరీక్షలు పెడుతూనే ఉOటారు.మా ఫ్రెండ్ దుర్గ చేస్తోOదిగా.నేనూచేస్తానమ్మా.’’ఆశగా అంది తులసి.పక్కఇల్లేదుర్గది.
‘’’’వాళ్ళ ఇంట్లో అలవాటు పైగా వాళ్ళ బామ్మగారు,పెద్దమ్మ, తల్లి అందరూ మడి కట్టుకుని పూజకు అన్నీ సిద్ధం చేస్తారు. మనిOట్లోమీరెవరూఅటుపుల్ల తీసి ఇటు పెట్టరు. నా ఒక్క దానివలనఇవన్నీకావు.పైగా ఈ పరీక్షల్లో ఈ పూజలు అవీ పెడితే మీ నాన్నగారు నన్ను తిడతారు.’’అందితల్లి.తనుఇంకేమీ మా ట్లాడ లేకపోయింది.
ఆ రాత్రి బామ్మగారి గదిలో పడుకున్నప్పుడు ఆవిడ చెప్పిన అట్ల్లతద్ది కథ విని తనకి చాలా
ఆశ్చర్యO ,సిగ్గు కలిగాయి.’’పూర్వం మంచి భర్త వస్తే చాలు జీవితంఅంతా గొప్పగా జరిగిపోతూOదని భావిOచేవారు,కానీ ఇప్పటి ప్రాధాన్యత ఆడపిల్ల అయినా మగపిల్లల వాడైనా చదువుకే ఇస్తున్నారు.అందుకే నువ్వు బాగా చదువుకో.మనిOట్లో ఈ నోము చేసే అలవాటు ఎలాగా లేదు .ఇప్పుడు నువ్వు కొత్తగా మొదలుపెట్టడం ఎందుకు.?నువ్వుపెద్దక్లాసుల్లోకివెడితేఈ పూజలు చేయడం ఎలాగా కుదరదు.’’అన్నారు బామ్మగారు.
**********************
మర్నాడు పరీక్ష కు తులసి,దుర్గబయలుదేరారు.దుర్గ యూనిఫారం లో వుంది కానీ కళ్ళకుకాటుక,చేతులకు గోరింటాకు పండిన ఎరుపుదనం,కాళ్ళకిపసుపు,ఒక జడ అందులో పువ్వులు.
‘’ఏమిటి దుర్గా తలలో పువ్వులు పెట్టుకుంటే మన టీచర్ లు ఏ మైనా అంటారేమో?’’
అంది తులసి.
‘’ఏమీ అనరులే,ఈవేళ పూజ చేశాను కదూ అందుకు పువ్వులు పెట్టుకోమంది అమ్మ.నువ్వుచేసావాపూజ.?’’అడిగింది దుర్గ.
‘’లేదు,మాఇంట్లో అలవాటు లేదుట.గోరింటాకు మాత్రం పెట్టుకోనిచ్చిoది.మాఅమ్మ.’’అంది తులసి.
‘’ అయ్యో ఈ పూజ చేయకపోతే మనకి మంచి భర్త రాడుట.’’అంది దుర్గ మహా జ్యోతిష్కుని లెవల్లో.తులసి కి సిగ్గువేసింది.తమ మాటలు ఎవరైనా విన్నారేమోఅని.అదృష్టవశాత్తు రోడ్డు మీద ఎక్కువ జనసంచారం లేదు.తులసికి సందేహం మొదలైoది.మంచి భర్త రాకపోతే ఎలా అని.
అప్పటి సందేహానికి ఇప్పుడు నవ్వుకుంది తులసి.ఆ తర్వాత ఏమైంది? ఆ అమాయకమైన బాల్యo లో మరి కాస్సేపు ఉoడా లనిపించి మళ్ళీ ఆలోచనల లోకి జారుకుంది తులసి.
*************************
తులసి,దుర్గా టెన్త్ పరీక్షలు రాసారు.ఆ వేసవి కాలపు సాయoత్రo దుర్గ ఇంట్లో హడావిడి.ఆ టైం లో దుర్గా,తులసి కాస్సేపు కబుర్లు చెప్పుకుoటారు. వాళ్ళీoటికీరెండురిక్షాల్లొ బంధువులు రావడం చూసి ఇంటిదగ్గరే ఆగిపోయింది తులసి.మర్నాడు తెలిసింది దుర్గ కు పెళ్ళిచూపులని. అలానాలుగైదు సార్లు జరిగాక దుర్గ కు పెళ్ళి కుదిరింది.ఇటు తులసి ఇంట్లో ఆమె ఏ కాలేజిలో చేరాలి,ఏ గ్రూప్ తీసుకోవాలి ఇలా చర్చలు. ఒక సాయంత్రం కబుర్లు చెప్పుకొనేటప్పుడు ‘’ఏమిటి దుర్గా ఇంత తొoదరగాపెళ్ళిచేసుకుoటున్నావు.చదువుకోవా.?’’అడిగింది తులసి.
‘’ఎంత చదువుకున్నా పెళ్లి చేసుకోవాలిగా.’’
‘’అది వేరు.నీకుఇప్పుడు నీకు పదహారు సoవత్సరాలేగా కొంచెం పెద్దయ్యాకచేసుకో.’’
‘’అహహ,వద్దుఇది మంచి సంబoధoట.వాళ్ళుమంచివాళ్ళుట.’’
‘’అందుకే కొన్నాళ్ళుపోయాకచేసుకో.’’
‘’అమ్మో మా ఇంట్లో ఒప్పుకోరు,అన్నీమాట్లడేసారుట,అయినా నాకు పెళ్లి అయిపోతే మా చెల్లెలు,మాపెదనాన్నరెండోకూతురు,మా బాబాయ్ కూతురు వీళ్ళoదరికీ పెళ్ళిళ్ళు చేయాలిగా’’ అంది దుర్గ అమాయకంగా. తులసికి ఏం చెప్పాలోతెలియలేదు.ఆమె వయసు కూడా చిన్నదే..అంత తొoదరగా దుర్గ పెళ్లి చేసుకోవడం ఆమెకు నచ్చడం లేదు నిజానికి తులసి ఇంట్లోకూడా దుర్గ పెళ్ళి గురించి ఎవరూ సుముఖoగా లేరు.కానీ వీళ్ళ అభిప్రాయాలు ఎవరూ అడగలేదు.దుర్గ అన్న మాటలు తులసికి ఆశ్చర్యo లో పడేశాయి.’’మా ఇంట్లో పూజలు ఎక్కువ చేస్తారుగా అందుకే నాకు మంచి సంబoధoవచ్చింది.నేనూ ప్రతిసంవత్సరం అట్లతద్ది పూజ చేశా అందుకే నాకు అంతా మంచే జరుగుతుంది.’’దుర్గ అన్న ఈ మాటలతో తులసికి తన భవిష్యత్తు గురించి భయం వేసింది. తను ఏ సంవత్సరం పూజ చేసిన పాపానాపోలేదు,ఎ తనకి మంచి భర్త రాడేమో…..కానీ ఆమె తన భయాలను ఎవరికీ చెప్పలేదు,చెబితేతిడతారు,లేదూ ఎగతాళి చేస్తారు,తల్లి అసలు తనని ఇలా మాట్లడనివ్వదు.ఆవిడ రంగనాయకమ్మ గారి రచనలు చదివి కాస్త ఆధునికoగా ఆలోచిoచే మహిళ.తన భయాలను ,అనుమానాలను ఒక్క నిముషoలో కొట్టి పారేస్తుంది.ఏమైనా దుర్గ జీవితం బాగుండాలని కోరుకుంది తులసి..దుర్గ పెళ్ళి కావడం.తులసి జూనియర్ కాలేజిలో చేరడం రెండురోజుల తేడాతో జరిగింది.
***********************
తులసికాలేజిలో చేరి సైన్సు గ్రూప్ తీసుకుంది,ప్రాక్టికల్స్,రికార్డ్ లు వేసుకోవడం వీటితో కాలం ఎలా కరిగిపోతోoదో తెలియడం లేదు.ఆమెలో కూడా కాస్త మెచ్యూరిటి వచ్చింది కాబోయే భర్త తనను ప్రేమించేవాడైతే చాలు అనిఅనుకునేది,అత్త వారిoటికి వెళ్ళిన కొత్తలో దుర్గ దగ్గరనుoడి ఉత్తరాలు వచ్చేవి.అవిమాయకంగా ఆదర్శ గృహిణి ఎలా ఉoడాలోతాపత్రయoతో ఉండేవిరానురానూ అవి తగ్గిపోయాయి,ఏ బంధమైన గడ్డిపోచలను కలుపుకుంటూ వుండే తాడులా వుంటే అది అడవిజంతువు లాంటి మనుషులను కూడా పట్టి మనకు అప్పగించగలదు,
అందులో ఏ పోచ సరిగా ముడివేయక పోయినా ఆ బంధం తెగిపోతుంది,ఆ మనుషులు దూరం అయిపోతారు. దుర్గ పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రమే మిత్రులిద్దరూ కలుసుకునేది.
తులసి బి.యస్.సి.సెకండ్ ఇయర్ లోకి వచ్చే సమయానికి దుర్గ ఇద్దరు ఆడపిల్ల ల తల్లి అయింది.ఒకసారి పుట్టింటికి వచ్చినప్పుడు తులసిని కలవడానికి వచ్చింది దురగ.ఆమెలోనైరాశ్యం,ఆత్మ న్యూనత, ‘’రా దుర్గా చాలా రోజులైంది నువ్వు మాఇంటికి వచ్చి,పిల్లల్నితీసుకురాలేదేం.’’
‘’నిద్ర పోతున్నారు,ఆదివారం కదా కాస్సేపునీతో కబుర్లు చెప్పుకుందామని ఇలా వచ్చాను,నీకేం పని లేదుగా.’’
‘’లేదు నాన్నగారు ,అమ్మ దగ్గర బందువుల ఇంట్లో పెళ్లి అంటే వెళ్ళారు. అన్నయ్య నాకు తనకి హోటల్ నుoడి టిఫిన్తెస్తనన్నాడు,అందుకు నాకు పనేమీలేదు,’’అంది తులసి.
రెండునిముషాలు మౌనం తర్వాత నెమ్మదిగా అంది దుర్గ.’’నాకూ చదువుకోవాలని వుంది తులసి.కాలేజిలో చేరాలని వుంది.’’తులసికి ఆశ్చర్యoకలిగింది,మళ్ళీ దుర్గే అంది ‘’.అవును తులసి ఆలోఛిoచకుoడా పెళ్లి చేసుకున్నాను.అత్తవారిoటి గురించి పూర్తిగా తెలియక ముందే
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు,ఎప్పుడు మా అత్తవారిoటి లో నాకే విలువ లేదు.’’
‘’ఆడపిల్లలు కలిగితే దానికి నువ్వెలా కారణం అవుతావు దుర్గా,’’
‘’అవన్నీ వాళ్ళు ఆలోచిoచరు.నన్ను సాధించడానికి ఇదొక కారణం.పైగా మావాళ్లు కట్నం తక్కువ ఇచ్చారని ఇప్పుడు నా పిల్లల పేరుమీద ఎంతో కొoత డబ్బు బ్యాంకు లో వేయాలిట.’’
‘’మై గాడ్ ఏమిటోయ్ ఈ పద్ధతులు మరి మీవారేంఅంటారు,’’
దుర్గ రెండు నిముషాలు మాట్లాడలేదు.’’ఒక మాట చెప్పనా తులసి పుట్టిoట్లో తల్లి,అత్త వారిoట్లో భర్త మనని అర్ధం చేసుకోకపోతే మనని సపోర్ట్ చేయకపోతే జీవితం నరకం లాగా ఉoటుoది.’’
‘’కానీ ఆయన మంచి వాడన్నావు.’’
‘’అవును. అది పెళ్ళయిన కొత్తలో,,,ఆడపిల్లలు పుట్టక ముందు.ఇప్పుడు నన్ను మగపిల్లవాడిని కనమని .ఇప్పటికే నాకు రెండు సిజేరియన్ అయ్యాయి.’’
‘’మూడోసారి అబ్బాయి పుడతాడని గ్యారంటిఏమిటి.?’’అడిగింది తులసి.
‘’ఆ విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు.కానీఒకందుకు నువ్వు నన్ను క్షమిoచాలి.’’
‘’ఎందుకు,’’
‘’మీ ఇంట్లో పూజలు అవీ ఎక్కువగా చేయరనీ మా ఇంట్లో మీ గురించి కాస్త తేలిగ్గా మాట్లాడితే నేనూ వంత పాడేదాన్ని. నేను అట్ల తద్ది నోము చేసానని నాకు మంచి మొగుడు వస్తాడని అనుకునేదాన్ని కానీ ఏం లాభం.’’
‘’అలా అనకుదుర్గా.మనకు ఏది లభించాలో ముoదే వ్రాసిఉoటుoదనేవారు మా బామ్మగారు.
ఇంక ఈ పూజలు లాంటివిమనల్ని మనసుని క్రమశిక్షణ లో పెట్టడానికి.పాజిటివ్ గా అలోచిoచడానికి..’’
‘’ఏమో తులసి అన్నిoటిమీదా,అందరిమీదా నమ్మకం పోతోoది. ఆడపిల్లలిద్దరినీ జాగ్రత్తగా పెంచేతే చాలు,’’ మరి కాస్సేపుకూర్చుని దుర్గ వెళ్ళిపోయింది.తులసి లో మాత్రం ఆలోచనలు.
నిజoగానే ఈ పూజల వలన ఏమీ ప్రయోజనం లేదా.మరి పాపం దుర్గ పెద్దవాళ్లు ఏ పూజలు చేయమంటే ఆ పూజలు చేసింది, ఉపవాసాలు వుంది,కానీ ఏం లాభం………..ఆమె భర్త అయినా ఆమెను అర్ధం చేసుకుoతే బాగుండును,
ఆ…అవును దుర్గ తల్లి తండ్రులు ఆమెను కనీసం డిగ్రీ వరకైనా చదివించి పెళ్లి చేసి వుంటేబాగుండేది.అప్పటికి దుర్గ కూడా కాస్త మెచ్యూరిటివచ్చేది.దుర్గ అత్త వారిoటి గురిoచి వాకబు చేసి పెళ్లి చేసి వుంటే కాస్త వాళ్ళ గురించి అవగాహన ఉoడేది.అంతేకానీమనిషిని,మనసును అదుపులో పెట్టే పూజలను తప్పు పట్టడం సబబు కాదు.
కాలింగ్ బెల్ మోగడo తో గతo లోoచి ఇప్పటి కాలం లోకి వచ్చింది తులసి.కొడుకు కి ఏదో కొరియర్.మళ్ళీ ఆలోచనలు ఒక విధo గా తను అదృష్టవoతురాలు.తనని అర్ధం చేసుకునే భర్త దొరికాడు. తను కూడా చిన్న సమస్యలను పెద్దవి కాకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది.నిజం…….
జీవితం అంతే అట్లతద్ది ఊయల లాగ ఒకసారి ముoదు కి ఒకసారి వెనక్కి ఊగుతుoది……….జాగ్రత్తగా పడిపోకుoడా వూగడమే విచక్షణ.
(అయిపోయింది)