అమ్మకు చలి జ్వరం
చలితో గజగజ వణుకుతూ
మంచo పైన నాలుగు దుప్పట్లు
కప్పుకొని పడుకొంది అమ్మా
ఐదు పదులు నిండిన అమ్మను
ఆదరించేవాడు నాథుడే కరువయ్యాడు
అమ్మ మనసులో అలజడి మొదలైంది
తాను వంటచేయకుంటే ఇంట్లో వారందరూ
పస్తులుoడాల్సిదేనా అన్న బాధ మొదలైంది అమ్మ మనస్సులో
తన పిల్లలు పస్తులు ఉంటారేమోనని!
ఒంట్లో నీరసంగా ఉన్న ఒళ్ళు వణుకుతున్న
ఒంట్లో బలం తెచ్చుకుని పైకి లేచి
వంట చేసింది అమ్మ
తన పిల్లల కడుపు నింపాలని
ప్రతిరోజు పనితో తీరికలేని అమ్మకు
ఆ ఒక్కరోజైనా విశ్రాంతి దొరుకుతుందేమోనని
ఆశ పడ్డద కానీ అమ్మ ఆశ నిరాశ అయింది………
ఆ ఒక్కరోజు కూడా
విశ్రాంతి దొరకలేదు అమ్మకు
జ్వరం వచ్చిన ఒళ్ళు నిరసించిన
వంట చేసే డ్యూటీ మాత్రం తప్పలేదు.
అమ్మ మనసు
ఇలా రకరకాల ప్రశ్నలతో కలవర పెడుతున్నాయి
నిజంగా అమ్మే లేకుంటే
వంట చేసే వారే ఉండరా!
అన్న వేదన మొదలైంది అమ్మ మనస్సులో
అసలు ఈ లోకాన
ఆడవారే లేకుంటే నిజంగా
వంట చేసేవారు ఉండరా!
మగానికి విరామం ఉంది కానీ
ఆడవారికి విరమం లేదా ఈ లోకాన…..!