ఆడపిల్లలం

కవిత

ఆడపిల్లలం అని అందరూ
అవమానపరుస్తుంటారు
అయినా భరిస్తూవుంటాము

అణిగిమణిగి ఉండే
స్వభావం కాదు మాది
నిర్భయంగా తిరుగుతాం
సంస్కారం తో ఉంటాం
కలిసిమెలసి చదువుకుంటాం
తల్లిదండ్రులకు దూరంగా ఉండి
హాస్టల్లోవుంటూ
విజ్ఞానాన్ని నేర్చుకుంటాం

అధ్యాపకులు చూపే మార్గంలో
క్రమశిక్షణ తో తిరుగుతాం
గురుకుల విద్యార్థులమని
ఘనత చాటి చెబుతాం
ఇంటికంటే గొప్పది
మా గురుకుల విద్యాలయమని
లోకానికి చాటుతాం
ఇరవైనాలుగు గంటలూ
కంటికి రెప్పలా కాపాడుకుంటూ
ఉంటారని తెలియజేస్తాం

కఠిన నియమాలున్నా
మా కళాశాల ఆదర్శమని
ఆనందంగా చాటెదం

– B. Jyothi , BA 2 year

Written by B Jyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సాంఘిక సంక్షేమ

మానుకొండ విజయలక్ష్మి చిత్రాలు