ఆకు పచ్చని ఆకు లోన దాచుకున్న ఎరుపు
అరచేతిన చేరి ఎంత మురిపిస్తోందో?
ఆకాశన మేఘాడంబరాలు
మెరుపువీరుల ఉరుముల ఝడిపింపులకు
చెదరిన మేఘాలు అదే పనిగా కురిసే జల్లులు
ముసురో
గ్రీష్మ తాపానికి అదుపో
దక్షిణాయనానికి మొదలుగా పుడమితల్లిని తడిపేసే
తొలిఏకాదశి పండగ
ఆషాడపట్టీ కొత్త అల్లునికి
అత్తకు కొత్త కోడలు దూరం
వనదేవతలకు విహారం
పెద్దమ్మకు బోనాలు
వేపమండల వింజామరలతో
తెగిపడే వేటలు ఎన్నో
ఊరూర వసూళ్లతో
చినుకుల స్వైర విహారంలో
తొలకరికి స్వాగతం
స్థితి కారుని శయనం
దీక్షలకు శుభారంభం
నేలంతా పచ్చదనాల శోభింతతో
వారాహీ శాకాంబరీ మాతలకు
ఆరగింపుల హారతులతో
గురుపున్నమికి స్వాగతం
ఆషాఢం అంటే హడావుడి