ఎటువైపు మీ పయనం?

– 2026 నవంబర్ తరుణి ఎడిటోరియల్

      మనుషులు ఎంత ఎదిగినా, ఎన్ని కనుక్కున్నా, ఎన్నో కొనుక్కోగలిగినా కాల గమనం మహత్తును దాటిపోలేరు. కాలం చాలా గొప్పది. సమయం నీ వైపు ఉన్నదీ అంటే విర్రవీగుతూ ఉండడం, లేదని తెలిసిందో పలాయనం చిత్తగించడం పరిపాటి. దీన్ని సమయానుకూల నిర్ణయం అంటారు. అలాంటి మూడు ముఖ్యమైన విషయాలను చర్చించుకుంటే, కాలాన్ని, ధనాన్ని, జలాన్ని దుర్వినియోగం చేయవద్దని ఒక స్పృహ తో మాట్లాడుకుందాం.

         కాలం , సమయం ఈ రెండూ ఒక్క భావనను పోలి ఉన్నవే. అయినా కూడా చిన్న , స్పష్టమైన తేడా ఉన్నది .అది ఏంటంటే…కాలమేమో అనంతమైనది, సమయమేమో నిర్దిష్టమైనది . ఒక్కో నీటి బిందువు కలిస్తేనే నది అవుతుంది. నది వంటిది కాలం, నీటి బిందువు వంటిది సమయం. నిరంతర చలనశీలమైన కాలం గురించి చర్చించుకున్నప్పుడు సమయం కూడా  వస్తుంది.

    డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని అలా సంపాదించుకోలేము.ఒక్క నిమిషం గడిచిందో మన భవిష్యత్తు నుండి ఒక నిమిషం చేజారినట్టే. అందుకే  కాలాన్ని గౌరవించి సమయపాలన చేసేవాళ్ళు విజయాలను సాధిస్తారు.

“క్షణశః కణశశ్చైవ  విద్యామర్థం చ సాధయేత్

 క్షణే నష్టే కుతో విద్యా కణే నష్టే కుతో ధనమ్”

            ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకుంటూ విద్యను , ప్రతి కణాన్ని అంటే ప్రతి  గింజను సంపాదించాలి. అంటే,  ఇక్కడ ప్రతి పైసను పొదుపు చేస్తూ ధనాన్ని సంపాదించాలని చెప్పడానికి ఈ శ్లోకాన్ని ఉపయోగించవచ్చు అన్నారు పెద్దలు. సమయాన్ని కోల్పోతే చదువెలావస్తుంది? రాదు. అందుకే చిన్న మొత్తాన్ని కూడా అశ్రద్ధ చేయవద్దు, నిర్లక్ష్యం వహించొద్దు. దీన్నే మనం Time Management సరిగ్గా ఉండాలంటాం. ఇటు ధన సంపాదన అటు పొదుపు రెండు ఒక్కసారి వచ్చేవి కాదు , సులభంగా వచ్చేవి కాదు .కష్టపడి క్రమశిక్షణతో ఉంటేనే, కూడబెడితేనే వస్తాయి. దీన్నే మనం వాల్యూ ఆఫ్ వెల్త్ , Value of Savings అంటాం. ధనాన్ని సంపాదించడం ముఖ్యమైంది

అన్నప్పుడు మూడు విషయాలు దీంట్లో చెప్పుకోవాల్సినవి ఉంటాయి. అనుభవించడం , దానం చేయడం, నాశనం చేయడం . ఈ మూడు మార్గాలలో దానం చేయకుండా మొత్తం తానే అనుభవించాలి అనుకోవడం జీవిత పరమార్థానికి వ్యర్థం లేని ఆరాటం అవుతుంది. అలా అని మొత్తం దానం చేయడం కూడా సరైనది కాదు ఆ తర్వాత నాశనం చేయడం అంటే దుబారా చేయడం పొదుపు లేకుండా ఉండడం. . ఈ మూడింట్లోనూ అతి ప్రమాదమైనది. ధనాన్ని సంపాదించడం అవసరమే పొదుపు చేయడం అంతకన్నా అవసరమే. ఇందులోని మెలకువలను మెళకువగా గ్రహించాలి. భౌతిక సంపదకు జ్ఞాన సంపదకు మధ్య ఉండే స్వభావ వైచిత్రి ఇది.  ఈ మాటలలోని తాత్వికతను అర్థం చేసుకోవాలి, జీవితం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వీటిలాగానే నీటి విషయం. ఈ ధనం లేకపోవడాన్ని కవులు ఎలా వర్ణించారంటే, నదులు ఎట్లాగైతే ఎండిపోయి ఆగిపోతాయో అట్లా డబ్బులేని మనిషి ఆలోచనలు ఉంటాయి అని. ఎప్పుడైతే మళ్లీ వర్షాలు కురిసి, ప్రవాహం వస్తుందో… నది కళకళలాడుతుంది. అందుకే నదితో పోలుస్తారు.

దీన్నే కుటుంబ పరంగా ఆనందంగా ఉన్న వాళ్లకు పోలుస్తారు. ఆదాయమనేది ప్రేమ ఆప్యాయతలు ఉన్నచోటనే సఫలీకృతం అవుతాయనే అర్థం లో !! సంపాదించిన ధనం సద్వినియోగం కావడం, సమాజంలో గౌరవం సంపాదించుకోవడం అనేవి ధర్మబద్ధంగా జీవించే వాళ్లకు ఉంటాయి అని!!

నీళ్లు ఉంటేనే పంటలు పండుతాయి. పంటలు పండితేనే తిండి తింటాం . తిండి తింటేనే బ్రతుకుతాం . యువర్ టైం ఈజ్ లిమిటెడ్. సో డోంట్ వేస్ట్ ఇట్. లీవింగ్ సమ్ వన్ ఎల్స్ లైఫ్ . మన సమయం పరిమితమైంది. ఇతరులను అనుకరిస్తూ దాన్ని వృధా చేసుకోవద్దు.

    సమయమనే ఇసుక గడియారంలో జారిపోయే ప్రతి రేణువు వంటిదే ప్రతి క్షణం  విలువైనదే.  కొద్దిగా ఓర్పుతో ఉంటే , సమయం రేపటి వెలుగుకు దారి చూపుతుంది. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుని సమయాన్ని పిడికిట పడితే, కాలం అనే గురువు నేర్పే పాఠాలను  అవలీలగా నేర్చుకుంటాం, రాటుదేరుదాం. Tough times never last, but tough people do . కష్టాలు ఎప్పటికీ ఉండవు. కానీ, దృఢమైన  మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు

ఎప్పటికీ నిలబడతారు.

       నీళ్లు మనకు ఎంతో అవసరమైనవి. “పానీయం ప్రాణి నాం విశ్వమేవచ తన్మయమ్”  అనే సుభాషితం ఏం చెబుతోంది? నీరే ప్రాణం. నీరే సర్వస్వం. ఈ విశ్వమంతా నీటితోనే నిండి ఉన్నది. నీళ్లు లేకుండా జీవించడం అసాధ్యం. సర్వ ప్రాణులకు ప్రాణాధారమైనది  కేవలం నీరు నీరు.

        పొద్దున లేస్తే ఆకళ్ళు. వంటలు…వంటలు… వంటలను చేయడానికి పాత్రలు

… అందరి ఇళ్లల్లో సహజం ! మరి ఈ అంట్లు తోమి, శుభ్రపరచడానికి నల్లా నీళ్లను ఇష్టమున్నట్టు వాడేయకుండా, ఆ టాప్ ను తిప్పి కింద ఇష్టం ఉన్నట్టు వాడకుండా ముందే నీళ్లను బకెట్లో పట్టుకొని, గిన్నెలు కడుక్కుంటే నీరు తక్కువ  వాడొచ్చు.  బట్టలు ఉతికే పనికి కూడా ఇలాంటి పొదుపు వర్తిస్తుంది. అట్లాగే కూరగాయలు పండ్లు ఒక గిన్నెలోకి తీసుకొని కాసింత ఉప్పు వేసి చెయ్యితో గట్టిగా రుద్ది కడిగితే తొందరగా శుభ్రం అవుతాయి.నీరు తక్కువగా వాడే అవకాశం ఇది.

నల్లాకు ఎరిటర్స్ పెట్టాలి. అంటే చిల్లుల పరికరాన్ని బిగించామంటే, జల్లులు జల్లులుగా నీళ్లు పడుతూ

ఉపయోగాలు సులభమై నీరు ఆదా అవుతుంది. అట్లాగే ఈ మధ్య ప్యూరిఫైయర్ లేని ఇళ్ళు లేవంటే అతిశయోక్తి కాదు. ఆర్. ఓ . వాటర్ మంచిది అంటూ వాడుతున్నాం. నల్లా నీళ్లని ఎలా శుభ్రపరచుకుని త్రాగాలో తెలియని అగమ్య పరిస్థితుల్లో ఉన్నాం. డైరెక్ట్ గా వచ్చే నల్లా నీళ్లను తాగాలంటే భయం అవుతుంది. గతం లో బట్టతో వడకట్టి తాగేవాళ్ళం.  ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సరే RO వాటర్ తాగుదామని నిర్ణయించుకుంటున్నాం. మరి ఆర్ వో వాటర్ ఒక్క గ్లాస్ వాటర్ తీసుకుంటే, మూడు గ్లాసుల నీళ్లు వ్యర్థ నీళ్లు గా బయటకు వెళ్ళిపోతున్నాయి ఈ నీళ్లను వృధా చేయకుండా వాటిని బకెట్లలో పట్టి ఇండ్లు తుడవడానికి బట్టలు నానబెట్టడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి, సింక్ లు కడగడానికో అలా ఉపయోగిస్తే బాగుంటుంది. నీటిని వృధా చేయని వాళ్ళం అవుతాం . తర్వాత కూరగాయలను కడిగిన నీళ్లను , ముందు ఉప్పు నీడలో కడిగేసి ఆ తర్వాత మళ్లీ మంచినీళ్లలో కడుగుతాం కదా ఆ నీళ్లను మొక్కలకు పోస్తే బాగుంటుంది. అందులో ఉప్పు ఉండదు, మొక్కలకు పోస్తే ఆ నీరు ఉపయోగం అవుతుంది. నీళ్లు

కన్నతల్లిలాంటివి. “యో వః శివతమో రసః తస్య భాజయతేహ నమః, ఉశ తీరివ మాతరః ” అని ఋగ్వేదంలో ఒక మంచి మాట ఉన్నది. ఏంటట …..అంటే కన్నతల్లి పిల్లలకు ప్రేమతో పాలను పంచినట్టుగా నీళ్లు వాటిలోని సారాన్ని మనకు పంచుతాయట! మనల్ని పోషిస్తాయట! జలం మనుషులకు జ్ఞానాన్ని, మంచి దృష్టిని ప్రసాదిస్తుంది అని ఋగ్వేదం ఆపః సూక్తం చెప్పింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  వాతావరణ కాలుష్యం ఎక్కువైన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఎలినినో ప్రభావం వల్ల మన దేశానికి నీటి ఎద్దడి సంభవిస్తుంది అని చెబుతున్న ఈ సందర్భంలో ప్రభుత్వాలు ముందు చూపుతో నీటిని పొదుపుగా వాడండి అని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టకుండా ప్రతి పౌరుడు తన బాధ్యతగా కనీసం ఇలాంటివి కొన్ని చేయవచ్చు….

        ఇళ్ళ ముందు చీపురుకట్టతో వాకిలి ఊడ్చి నీళ్లు మగ్గులో తీసుకొని కళ్ళాపి  చల్లడం అనే అలవాటే పోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడండి పైపు పట్టేసేసి నీళ్లను కొడుతున్నారు. ధారగా  నీళ్లు పోతున్నాయి. అలా చేయకుండా ఒక

సగం బకెట్ తో నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటే వాకిలి శుభ్రంగానే ఉంటుంది. శుభ్రత ఊడుపుతో వస్తుంది.

” పిబంతి పద్యం స్వయమేవ నాంభః” నదులు తమ నీటి ని తామే తాగవు , ఎలాగైతే ఇతరులకు మేలు చేయడానికి సజ్జనులు ప్రయత్నిస్తారో అలా.. ఈ పరిస్థితులు ఎప్పటికీ ఉండవు మళ్ళీ వర్షాలు కురుస్తాయి మళ్ళీ నదులు ప్రవహిస్తాయి కాబట్టి

 ఇట్లా వర్షపాతం తగ్గిన ఈ అవస్థలలోంచి మనం బయట పడాలంటే ఎలా చేయాలో చెరువులలో కుంటలలో నీళ్లు తగ్గడం చూస్తున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ను ఉపయోగించి ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలి. నీటిని ఆదా చేయడం అంటే డబ్బులు ఆదా చేసినట్టే. భవిష్యత్తు తరాలను రక్షించినట్టే. అంటే ,

“జలం రక్షతి రక్షితః” .

      మరి ఇన్ని విషయాలను చర్చించుకున్న తర్వాత, మన పయనం ఎటు? అని ఎవరికి వాళ్ళు, వాళ్ళ మనసుకు గట్టి ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉన్నది !

_____***___

నవంబర్ 2026 తరుణి మాస పత్రిక విష సూచిక

1 ఎటువైపు మీ పయనం?- సంపాదకీయం: డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకులు
2 The FORGOTTEN MAVERICK – పుస్తక సమీక్ష: నెల్లుట్ల ఇంద్రాణి
3 చెరుకుతుద వెన్ను పుట్టిన – పొలంరెడ్డి విజయలక్ష్మి
4 మగ మహారాజులు ( కవిత)-
డాక్టర్ అరుణ పరంధాములు
5 ” కనిపించని గమ్యాన్ని – పదార్ధ విజ్ఞానం తో ‘ దృశ్యమానం ‘ చేసిన ప్రతిభాశాలి” (వ్యాసం) – రాధికా సూరి
6 డాక్టర్.. డాక్టర్! ( హాస్య నాటిక)- నెల్లుట్ల రమాదేవి
7 సామెతల ఊట – సునందమ్మ నోట -(6 – 10)
వురిమళ్ల ( భోగోజు) సునందా ఉపేందర్ రావు
8 కొత్త లోకాలు ( కాలమ్)
రిటైర్మెంట్ లేని జీవితం – మాధవపెద్ది ఉష
9 ” వైట్ డిస్చార్జ్ స్త్రీలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య” – ప్రొఫెసర్ డా. మజ్జి భారతి
10 మన మహిళా మణులు( ధారావాహిక పరిచయ వ్యాసాలు)
– డాక్టర్ వసంత గారి గురించి – అచ్యుతుని రాజ్యశ్రీ
11 మన జాతీయాల సొగసు ( వ్యాస ధారావాహిక)- చంద్రకళ దీకొండ
12 అనుభవాలకు ఆదికావ్యం….( సినీ గీత విశ్లేషణ)- మొదలి పద్మ
13 నా వంగదేశ యాత్ర – శ్రీమతి రమా శాండిల్య ( పుస్తక సమీక్ష)-
పి.వి.యస్. కృష్ణ కుమారి
14. ప్రియ దర్శిని (వ్యాసం)- విజయ కందాళ
15 ఋషిక యామి ( ధారావాహిక వ్యాస పరంపర)- విజయా రంగనాథమ్
16 చరిత్ర నేర్పిన పాఠాలు – (లోకాభిరామాయణం- కాలమ్ – రెండో సంవత్సరం -1) – పి. వి. యస్. కృష్ణ కుమారి
17 మారని తలరాతలు ( కవిత ) – అరుణ ధూళిపాళ
18 వర్షపు ధార ( కవిత ) – అంకిత , ఎం. ఎ
19 భద్రత ఎక్కుడ..? ( కవితా)- జుర్కి లావణ్య , ఎం.ఎ
20 అమ్మకం ( కవిత) – మంజుల పత్తిపాటి
21 మన దేశంలో వింత ఆలయాలు (సేకరణ)– అచ్యుతుని రాజ్యశ్రీ
22 డాక్టర్ బండ సరోజన గారికి అక్షర శ్రద్ధాంజలి – పలువురు రచయితలు
23 ఉసిరి చారు ( వంట వైభవం)
– ఎస్ సుకన్య , (ఎం.ఎస్సీ. మైక్రోబయాలజీ), హైదరాబాద్
24″ గోప బాలా రావయ్యా….” గీతం,రచన-Dr. Tk చూడామణి గారు – గానం
25 కుసుమ వనాలు ( కవిత) – వకుళ వాసు
26 మావయ్య బంగారం – 3 ( ధారావాహిక నవల)- పద్మావతి నీలంరాజు
27 రమక్కతో ముచ్చట్లు 27 వ భాగం ( కాలమ్)- రమాదేవి కులకర్ణి
28 క్విజ్ – 2,3 – నెల్లుట్ల ఇంద్రాణి
29 రచయిత్రి లహరి పరిచయం
30 రచయిత్రి లలితా రామ్ పరిచయం

 

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరి చందన-16వ భాగం