కళాకారులు

కవిత

క్షణం క్షణం జారిపోతున్న ఇసుక రేణువులా
కనుమరుగై పోతున్నారు జానపద కళాకారులు

పల్లె జీవనం నుంచి పుట్టుకొచ్చిన జానపద కళలెన్నో
ఆధునిక వినోద సాధనాల దాడి వల్ల ఆదరణ తగ్గి
కనుమరుగై పోతున్నారు
జానపద కళాకారులు
మోసం నేర్వని అమాయకులు

వినోదాలెరుగని కాలంలో
జనజీవన స్రవంతికి
విజ్ఞాన వినోదాలైన జానపదులు
జానెడు పొట్ట నింపుకోవడానికి
పడరాని పాట్లు పడుతున్నారు
మోసం నేర్వని అమాయకులు

గుండెల్లో బాధలను దిగమింగుకుని
కట్టలు తెంచుకొని వస్తున్న కన్నీళ్లును
కనురెప్పల మాటున దాచుకొని
ప్రాచీన కళారూపాలను కాపాడుకుంటున్న
మోసం నేర్వని అమాయకులు

నా బిడ్డలకు శుభాకాంక్షలు, సన్మానాలు అక్కర్లేదు
బతుకు దెరువు చూపించండి చాలు
అంటుంది కళామతల్లి

ఓ పాలకుల్లారా అధికారుల్లారా
సంస్కృతి సాంప్రదాయాలకు వెన్నెముకైన
కళాకారుల బతుకులు చీకటి కమ్ముకుంటున్నాయి
వెలుగు జ్యోతి వెలిగించ మంటుంది కళామతల్లి

Written by Manjula Patipati

రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కళ

చెట్టుకు చీడ !